Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran).. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. త్రివిక్రమ్(Trivikram ) దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శర్వానంద్(Sharwanand ) హీరోగా వచ్చిన ‘శతమానం భవతి’ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. మధ్యలో కొంతకాలం సైలెంట్ అయిన అనుపమ ఇప్పుడు మళ్లీ విభిన్నమైన జానర్లను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగానే వరుసగా జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, పరదా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ ఇప్పుడు కిష్కింధపురి అనే హార్రర్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఈరోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో భాగంగా ఆ డైరెక్టర్ తనకు నరకం చూపించాడు అంటూ స్టేజ్ పైనే చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది అనుపమ పరమేశ్వరన్. మరి అనుపమాకు అంతలా నరకం చూపించిన ఆ డైరెక్టర్ ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆ డైరెక్టర్ నాకు నరకం చూపించారు – అనుపమ
కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో వస్తున్న కిష్కింధపురి సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే టైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా డైరెక్టర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది అనుపమ. ఈమె మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పటినుండి హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను నాలుగు సంవత్సరాల వయసు నుండే హారర్ చిత్రాలు చూడడం మొదలు పెట్టాను. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నాకు ఇలాంటి జానర్ లో నటించే అవకాశం రాలేదు. వాస్తవానికి నా జుట్టు అలా ఉండడం చూసి నాకు హారర్ సినిమాలలో అవకాశాలు కల్పించారు. కానీ ఇలాంటి కథతో ఎవరూ నా దగ్గరకు రాలేదు. అందుకే కౌశిక్ వచ్చి నాకు కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పాను. సీరియస్ గా చెప్పాలి అంటే స్టోరీ చెప్పేటప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఆ ఫ్లో నచ్చి నేను వెంటనే ఓకే చెప్పేసాను.. ముఖ్యంగా డబ్బింగ్ స్టూడియోలో నన్ను ఇంతలా టార్చర్ చేసిన వేరే తెలుగు డైరెక్టర్ ను నేను ఇంతవరకు చూడలేదు. అంతలా నాకు నరకం చూపించాడు”. అంటూ సరదాగా చెప్పుకొచ్చింది అనుపమ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కిష్కింధపురి సినిమా విశేషాలు..
ఈ సినిమా విషయానికి వస్తే హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా మకరంద్ దేశ్ పాండే, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగర్ , హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా.. ఇప్పుడు ట్రైలర్ లో అనుపమ పర్ఫామెన్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ఇక 125 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
ALSO READ:Ileana D’Cruz: సినిమాలకు మళ్లీ దూరం కానున్న ఇలియానా.. అసలు రీజన్ ఇదే అంటూ!