BigTV English

Longest Passenger Train: ఈ ఒక్క రైలుకే 100 బోగీలు.. 25 ఇంజిన్లు.. ఇది ఎక్కడ నడుస్తోందంటే?

Longest Passenger Train: ఈ ఒక్క రైలుకే 100 బోగీలు.. 25 ఇంజిన్లు.. ఇది ఎక్కడ నడుస్తోందంటే?

 World’s Longest Passenger Train:

ప్రపంచ వ్యాప్తంగా రవాణా వ్యవస్థలో రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా, రష్యా, భారత్ లాంటి దేశాల్లో అత్యంత ఎక్కువ మంది రైళ్ల ద్వారానే రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే, తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైలు ప్రయాణం చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ప్రకృతి అందాల నడుమ రైలు వెళ్తుంటే ఎంతో రిలాక్స్ గా అనిపిస్తుంది. పలు దేశాల్లో పొడవైన రైళ్లు ఉన్నాయి. స్విట్జర్లాండ్ ఓ అడుగు ముందుకు వేసి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంజినీరింగ్ అద్భుతంగా నిలువడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది ఈ రైలు.


100 కోచ్ లు, 25 ఇంజిన్లు.. 1.91 కిలో మీటర్ల పొడవు..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ రైలును రేటియన్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పొడవు 1.91 కిలో మీటర్లు ఉంటుంది. మొత్తం 100 కోచ్‌ లను కలిగి ఉంది. 25 ఆధునిక కాప్రికార్న్ ఇంజిన్‌ లతో నడుస్తుంది. ఈ రైలు అత్యంత పొడవైన ట్రైన్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఆల్ప్స్ పర్వతాల గుండా వెళ్తూ మరుపురాని మెమరీస్ ను అందిస్తుంది. ఈ రైలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రిడా, అల్వానియు మధ్య అల్బులా-బెర్నినా మార్గంలో పరుగులు తీసింది. ఈ మార్గం ఉత్కంఠభరితమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది.

స్విస్ రైల్వే 175వ వార్షికోత్సవం సందర్భంగా..    

స్విస్ రైల్వేల 175వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రైలును నడిపారు. ఇందులో 150 మంది ప్రయాణికులు జర్నీ చేశారు. ఈ రైలు  గంటకు 30-35 కి.మీ వేగంతో ప్రయాణించింది. ఈ రైలు ప్రపంచంలోనే అతి పొడవైన ప్యాసింజర్ రైలుగా గిన్నిస్ ప్రపంచ రికార్డును సంపాదించిపెట్టింది. ప్రపంచ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.


Read Also: వందేభారత్ స్లీపర్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్, ఫస్ట్ రూట్ ఇదే!

ఇండియాలో అత్యంత పొడవైన రెండు రైళ్లు

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పొడవైన గూడ్స్ రైలు ఆస్ట్రేలియాలో ఉంది. దాని తర్వాత మన దేశంలోనే రెండు అత్యంత పొడవైన గూడ్స్ రైళ్లు ఉన్నాయి. దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలుగా’రుద్రాస్త్ర’ గుర్తింపు తెచ్చుకుంది. ఇది సుమారు 4.5 కిలోమీటర్ల పొడవు ఉంది.  తూర్పు మధ్య రైల్వే పరిధిలో గంజ్ కవాజా స్టేషన్ నుంచి గర్హ్వా రోడ్ స్టేషన్ వరకు ఇది రీసెంట్ గా పరుగులు తీసింది. సరకు రవాణా సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా, ఏడు ఇంజిన్లతో 354 వ్యాగన్లను కలిపి ఈ రైలును నడిపారు. అంతకు ముందు ఇండియాలో అత్యంత పొడవైన గూడ్స్ రైలు గా  ‘సూపర్ వాసుకి’ గుర్తింపు తెచ్చుకుంది. 2022లో ప్రారంభించబడిన ఈ రైలు ఏకంగా 3.5 కి.మీ పొడవు ఉంటుంది. ఒకే ప్రయాణంలో 27,000 టన్నుల బొగ్గును మోసుకెళ్తుంది.

Read Also: భారత్, పాక్ ప్రధాన మంత్రులు ప్రయాణించే విమానాల్లో ఇన్ని తేడాలా? ఏ విమానం గొప్ప?

Related News

Flight Passenger: ఫ్లైట్ 14 గంటలు ఆలస్యమైతే బర్గర్ ఇస్తారా? ప్రయాణీకుడికి రూ. 55 వేలు కట్టాల్సిందే!

Bengaluru Woman Cop: యూకే వెళ్లే ఫ్లైట్ మిస్, పోలీసుకు రూ. 2 లక్షల జరిమానా!

IRCTC Tour Packages: డిసెంబర్‌లో కేరళ, కశ్మీర్ ట్రిప్‌కు వెళ్లాలా? అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ!

India – Pakistan: భారత్, పాక్ ప్రధాన మంత్రులు ప్రయాణించే విమానాల్లో ఇన్ని తేడాలా? ఏ విమానం గొప్ప?

Traffic Diversions: గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్‌లోని ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు!

Big Stories

×