E-Paper
Advertisement

 Kalki2 : దీపిక ప్లేస్‌లో స్వీటీ… మళ్లీ పెళ్లి వార్తలు వచ్చేస్తాయేమో

 Kalki2 : దీపిక ప్లేస్‌లో స్వీటీ… మళ్లీ పెళ్లి వార్తలు వచ్చేస్తాయేమో
Advertisement

Kalki 2: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ప్రభాస్ (Prabhas)ఒకరు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి (Bahubali)సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా పనులలో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు.

కల్కి 2 లో భాగం కానున్న అనుష్క?

ఇకపోతే ప్రభాస్ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి(Kalki). డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Aswin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ పనుల త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల హీరోయిన్ విషయంలో సంచలన విషయాన్ని వెల్లడించారు. కల్కి సినిమాలో సుమతి పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే(Deepika Padukone) నటించారు. అయితే కొన్ని కారణాలవల్ల సీక్వెల్ సినిమాలో దీపికను ఈ ప్రాజెక్టు నుంచి తప్పిస్తున్నట్లు అధికారకంగా వెల్లడించారు.

Advertisement

సుమతిగా కనిపించబోతున్న అనుష్క…

ఈ విషయం కాస్త సోషల్ మీడియాలోనూ ఇటు ఇండస్ట్రీలోను సంచలనంగా మారింది. ఇక ఈ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడంతో హీరోయిన్గా ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరగడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కల్కి సినిమాలో హీరోయిన్ విషయంలో మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుమతి పాత్రలో దీపిక స్థానంలో అనుష్క(Anushka) అయితే బాగా సెట్ అవుతుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే అనుష్కను ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తెరపైకి ప్రభాస్ అనుష్క పెళ్లి వార్తలు?

ఇలా అనుష్క ఈ సినిమాలో భాగం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అయితే ఈ వార్తలు వైరల్ గా మారడంతో మరోసారి తెరపై అనుష్క ప్రభాస్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంతకాలంగా అనుష్క ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఈ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలను ఈ ఇద్దరు ఖండిస్తూ తాము మంచి స్నేహితులం మాత్రమేనని వెల్లడించారు.ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు మిర్చి బాహుబలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్న అభిమానులకు కల్కి2 సినిమా గురించి వార్తలు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు . మరి కల్కి 2 సినిమా హీరోయిన్ విషయంలో వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Also Read: Aamir Khan: మల్టీప్లెక్స్ తీరుపై మండిపడిన అమీర్ ఖాన్… పద్ధతి మార్చుకోవాలంటూ!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×