BigTV English

Bigg Boss 8 Winner : బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్ ఎంత వచ్చిందో తెలుసా?

Bigg Boss 8 Winner : బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్ ఎంత వచ్చిందో తెలుసా?

Bigg Boss 8 Winner : బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నిన్నటితో ఎండ్ కార్డు పడింది. ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతారో అన్న ప్రశ్నలకు సమాధానం దొరికేసింది. అనుకున్నట్లే కన్నడ బ్యాచ్ లీడర్ నే బిగ్ బాస్ విన్నర్ గా చేశారు.. మొదటి నుంచి హౌస్ లో వినిపిస్తున్న రూమర్స్ ను బిగ్ బాస్ నిజం చేశాడని వార్తలు జనాల్లో వినిపిస్తున్నాయి. ఎన్ని అనుకున్నా ఇక బిగ్ బాస్ నిర్ణయం మార్చుకొనే ఛాన్స్ లేదు. విన్నర్ గా నిఖిల్ మరో చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ అతడికి దక్కింది. ఏకంగా రూ 55 లక్షల ప్రైజ్ మనీ నిఖిల్ సొంతం అయింది. తెలుగు నటుడు కాకపోవడంతో కన్నడ బ్యాచ్ అంటూ నిఖిల్ పైకి అవమానాలు మొదలయ్యాయి. ఇక విన్నర్ గా మొత్తం ప్రైజ్ మనీ ఎంత? అతనికి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అంటూ మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నిన్నటితో పూర్తి అయ్యింది. 14 మంది ముందుగా హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా ఎనిమిది మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. దాంతో బిగ్ బాస్ రెండు గ్రూప్ లుగా డివైడ్ చేసి ఆటలు ఆడించారు. బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ లో నిఖిల్, గౌతమ్ పోటీ పడ్డారు. అయితే గౌతమ్ ఫైర్ చూసి అతనే విన్నర్ అని ఆడియన్స్ అనుకున్నారు. కానీ స్వల్ప ఓట్ల తేడాతో నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంత అనేది ముందుగా హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ చెప్పలేదు. దీంతో ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో అన్నది చివరి వరకు ఆసక్తిగానే మారింది.. నిన్న ఫినాలే ఎపిసోడ్ లో ఆ ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. ఎంత మనీని నిఖిల్ అందుకున్నాడో ఒకసారి తెలుసుకుందామా..

నిఖిల్ బిగ్ బాస్ నుంచి ఎంత గెలుచుకున్నాడు..? 


బిగ్ బాస్ విన్నర్ కి 50 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారు. కానీ ఈ సీజన్ కి ప్రైజ్ మనీ 55 లక్షలకి చేరింది. ప్రైజ్ మనీ పక్కన పెడితే నిఖిల్ రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో వారానికి 2.25 లక్షలు రెమ్యునేషన్ తీసుకున్నాడు. మొత్తం 15 వారాలకు నిఖిల్ లో పారితోషికం రూపంలో 33 లక్షల వరకు అందుకున్నాడు. అంతేకాదు.. మారుతీ సుజుకి డిజైర్ కారు కూడా నిఖిల్ కి దక్కుతుంది. మొత్తంగా చూసుకుంటే నిఖిల్ సంపాదన దాదాపు కోటి రూపాయలు అనుకోవచ్చు. పడ్డ అవమానాలకు, దమ్మున్నోడిగా నిలబడి గేమ్ ఆడిన విధానానికి నిఖిల్ కి పారితోషకం, ప్రైజ్ మనీ రూపంలో ప్రతిఫలం దక్కింది.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేతుల మీదుగా నిఖిల్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే అంతగా హడావిడి లేకుండానే ముగిసింది.. ఇక బయట గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా పోలీసులు అన్నపూర్ణ స్టూడియో వద్ద ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో అంతా కూల్ గానే జరిగింది.

Tags

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×