Bumrah: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని మూడో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యమే కొనసాగుతోంది. కానీ భారత ప్రధాన పెసర్ జస్ప్రీత్ బుమ్రా {Bumrah} మాత్రం ఆరు వికెట్లతో మెరిశాడు. బ్రిస్ బెన్ లో పేస్ దళాన్ని ముందుకు నడిపించిన ఈ స్పీడ్ స్టార్.. ఆదివారం రోజు ఆటలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను (21) అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. మిగతా బౌలర్ల నుంచి పెద్దగా సహకారం లభించినప్పటికీ బుమ్రా {Bumrah} మాత్రం ఆకట్టుకున్నాడు.
Also Read: Sanjiv Goenka: ఢిల్లీ కుట్రలు… పంత్ కు ఎక్కువ ధర పెట్టెలా చేశారు.. భారీ నష్టాల్లో ?
దీంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయగలిగింది. అయితే ఆదివారం రోజు ఆట సందర్భంగా బుమ్రా {Bumrah}పై ప్రశంసల వర్షం కురిపించే క్రమంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, మహిళా కామెంటేటర్ ఇషా గుహ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ మ్యాచ్ కి కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఇషా గుహ.. బూమ్రా ప్రదర్శనను కొనియాడుతూ జాత్యహంకార వ్యాఖ్యలు చేసింది. బుమ్రాను కోతి జాతికి చెందిన జంతువుతో పోల్చింది. ప్రైమేట్ అనే పదం వాడింది.
దీంతో ఆమెపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదటగా ఈ మూడవ టెస్ట్ కి కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ.. బుమ్రా {Bumrah}పై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఈరోజు 5 ఓవర్లలో 4 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడని అన్నాడు. మాజీ కెప్టెన్ నుంచి ఇది కదా జట్టు ఆశించేదని చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలకు స్పందించిన ఇషా గుహ కూడా బుమ్రాను ప్రశంసిస్తూ నోరు జారింది. ప్రైమేట్ అంటే కోతి జాతికి చెందిన జంతువు అని అర్థం. దీంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో నెటిజెన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడో రోజు ఆట ప్రారంభ సమయంలో ఆమె క్షమాపణలు తెలిపింది. ” నిన్న మ్యాచ్ సమయంలో కామెంట్రీ చేస్తూ ఓ పదం వాడాను. కానీ అది విపరీత అర్థాలకు దారితీసింది. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు చెబుతున్నా. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేందుకు ఎప్పుడూ ప్రయత్నించను. నేను మాట్లాడిన మాటలు మొత్తం వింటే బుమ్రా {Bumrah} పై అత్యుత్తమ ప్రశంసలు కురిపించానని మీకే తెలుస్తుంది.
Also Read: IND vs Aus 3rd Test: భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయిన ఆసీస్.. మ్యాచ్ కు మరోసారి అంతరాయం ?
భారత అత్యుత్తమ ఆటగాళ్లను నేనెప్పుడూ తక్కువ చేయను. బూమ్రా {Bumrah} విషయంలో అతడు సాధించిన అద్భుతాలను ప్రశంసించే క్రమంలో పొరపాటున ఆ పదం వాడినట్లు అనుకుంటున్నా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఉద్దేశపూర్వకంగా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అక్కడి అభిమానులు భావిస్తున్నారని అనుకుంటా” అని వెల్లడించింది. ఇక ఇషా గుహ చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. లైవ్ టెలికాస్ట్ లో క్షమాపణలు చెప్పడం అద్భుతమని, నువ్వు ఓ ధైర్యవంతురాలి అని కొనియాడాడు. ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ లో కొన్నిసార్లు ఇలాంటివి జరిగినప్పుడు అవి సర్దుకుని ముందుకు సాగాలని తెలిపాడు.