BigTV English

Bigg Boss Nayani Pavani : బిగ్ బాస్ నయని అసలు పేరు ఇదా.. ఎందుకు మార్చుకుందంటే?

Bigg Boss Nayani Pavani : బిగ్ బాస్ నయని అసలు పేరు ఇదా.. ఎందుకు మార్చుకుందంటే?

Bigg Boss Nayani Pavani : తెలుగు టాప్ రియాలిటి షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత ఆదివారం నుంచి హౌస్ లో హంగామా మాములుగా లేదు.. ఐదు వారాలు చప్పగా సాగిన షోలోకి నిన్న ఆదివారం ఎపిసోడ్ లో రీ లోడ్ పేరుతో 8 మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అందులో ఒకరు హాట్ బ్యూటీ నయని పావని.. ఈ అమ్మడు సీజన్ 7 లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అలా హౌస్ లోకి వచ్చిన వారానికే ఎలిమినేట్ అయ్యి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ ఈ సీజన్ 8  లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


ఈ నయని పావని మొదట సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అన్న విషయం తెలిసిందే.. ఈమె అసలు పేరు సాయిరాజు పావని. టిక్‌టాక్‌ స్టార్‌గా బాగా పాపులరిటీని సంపాదించుకుంది.. ఎంత ఘాటు ప్రేమ, సమయం లేదు మిత్రమా, పెళ్లి చూపులు 2.0, బబ్లూ వర్సెస్‌ సుబ్బులు కేరాఫ్‌ అనకాపల్లి వంటి పలు షార్ట్‌ ఫిలింస్‌లో నటించింది.. కవర్‌ సాంగ్స్‌, చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి చిత్రాల్లోనూ కనువిందు చేసిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఆమె అందంతో యాట్టిట్యూడ్ తో ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే ఈమె హౌస్ లోకి వచ్చిన రెండో రోజే అందరితో నేను మోనార్క్ ను అన్నట్లు మాట్లాడింది. నామినేషన్ చేసింది. కొందరికి కోపాన్ని కూడా కలిగించింది.

అలా హౌస్‌కు వెళ్లగానే అందరితో ఇట్టే కలిసిపోయింది. కానీ దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్‌ అయిపోయింది. హౌస్‌ నుంచి వచ్చాక అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. అంతేకాదు, ఇప్పుడు బయటకు వచ్చేసినా నెక్స్ట్‌ సీజన్‌లో రావడం పక్కా అనుకున్నారు. అందరూ ఊహించినట్లుగానే ఈ సీజన్‌లో అడుగుపెట్టింది. కాకపోతే మరోసారి వైల్డ్‌కార్డ్‌ ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఈమె మిగిలిన వాళ్ళతో పోలిస్తే అంతగా ఫెమస్ అవ్వలేదు. అప్పుడు వైల్డ్ కార్డు ద్వారానే వచ్చింది. ఇప్పుడు కూడా వైల్డ్ కార్డు ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. కంటెస్టెంట్ గా వచ్చే అవకాశం బిగ్ బాస్ ఈమెకు ఎందుకు ఇవ్వడం లేదో అని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు. మరి నెక్స్ట్ సీజన్ కు అన్నా పాపకు ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఇక ఈ సీజన్ లో ఎన్ని రోజులు ఉంటుందో… తన ఆటతో ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.. ఈమె వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×