Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రేమమ్(Premam) అనే మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో “అ ఆ” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈమెకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయని చెప్పాలి. ఇక తెలుగులో శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి నటిగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.
పరదా ట్రైలర్…
ఇక త్వరలోనే అనుపమ పరమేశ్వరనన్ పరదా (Paradha) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. అలాగే టాలీవుడ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) గురించి కూడా అనుపమ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ పోతినేని స్నేహితుడిగా తన జీవితంలోకి రావడం అదృష్టమని తెలియజేశారు.
స్నేహితుడుగా రావటం అదృష్టం..
నా జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే నేను రామ్ పోతినేనికి ఒక ఫోన్ చేస్తే చాలు వెంటనే నా సమస్యను తన సమస్యగా తీసుకొని పరిష్కారం చూపుతాడని వెల్లడించారు. అలాంటి ఒక గొప్ప స్నేహితుడిని పొందడం నిజంగా అదృష్టమని తెలిపారు. ఇలా రామ్ పోతినేని తనకు మంచి స్నేహితుడనే విషయాన్ని ఈమె వెల్లడించడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వీరి డేటింగ్ రూమర్లు కూడా ఒకానొక సమయంలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. ఇలా వీరిద్దరి గురించి ఇలాంటి రూమర్స్ రావడానికి కారణం లేకపోలేదు. వీరిద్దరి కాంబినేషన్లో వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
జంటగా రెండు సినిమాలలో..
అనుపమ పరమేశ్వర రామ్ పోతినేని హీరో హీరోయిన్లుగా ఉన్నది ఒక్కటే జిందగీ(Unnadi Okkate Jindagi), హలో గురు ప్రేమకోసమే (Hello Guru Premakosame) అంటూ రెండు సినిమాలు వరుసగా విడుదల అయ్యాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఒకప్పుడు వార్తలు హల్చల్ చేశాయి. అయితే తాజాగా అనుపమ పరమేశ్వర రామ్ తనుకు ఒక మంచి స్నేహితుడని వెల్లడించడంతో ఈ వార్తలకు కూడా పులిస్టాప్ పెట్టినట్టు అయింది. ఇలా హీరో హీరోయిన్లు వరుసగా రెండు మూడు సినిమాలలో కలిసి నటిస్తే వారి గురించి ఇలాంటి వార్తలు రావడం అనేది ఇండస్ట్రీలో సర్వ సాధారణమని చెప్పాలి. ఇక రామ్ పోతినేని కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో రామ్ కూడా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు.
Also Read: Mega Heroes: ఒకే ప్రేమ్ లో మెగా హీరోస్.. ట్రెండింగ్ లో పెద్ది మూవీ!