Upasana: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణిగా మరింత పేరు సొంతం చేసుకున్నారు ఉపాసన (Upasana). అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలిగా.. మరొకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు చేపడుతూనే.. ఇటీవల తెలంగాణలో కూడా కీలక పదవిని సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు విషయాలపై చర్చించే ఉపాసన.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ తో ముచ్చటించారు. ముఖ్యంగా తమ ప్రేమ ఎలా మొదలైంది? అనే విషయం దగ్గర నుండి.. చిరంజీవి , రామ్ చరణ్ మంచి భోజనం ప్రియులు అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం గురించి ఆ యూట్యూబ్ ఛానల్ తో పంచుకున్నారు ఉపాసన.
యూట్యూబర్ తో పలు విషయాలు పంచుకున్న ఉపాసన..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ యూట్యూబర్.. కర్లీ టేల్స్ (Curly tales) ఛానెల్ చీఫ్ కామియా జానీ (Kamiya jani)గత కొన్ని రోజులుగా సౌత్ సెలబ్రిటీలతో ఇంటరాక్ట్ అవుతూ.. హోమ్ టూర్ వీడియోలు చేస్తూ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohanbabu) తో హోమ్ టూర్ చేసి వైరల్ గా మారిన ఈమె.. ఇప్పుడు తాజాగా ఉపాసనతో కలిసి హోం టూర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకోవడం జరిగింది.
మెగా కుటుంబం ఆహారపు అలవాట్లు బయటపెట్టిన ఉపాసన..
ఇక ఇందులో ఉపాసన మాట్లాడుతూ .. హైదరాబాదులో ‘ఫేమస్’ ఐస్ క్రీమ్ కావాలి అంటూ తన భర్త రామ్ చరణ్ కు ప్రేమ పరీక్ష పెట్టిన సరదా సంఘటనను ఆమె పంచుకున్నారు.. ముఖ్యంగా తమ ఇంట్లో ఆహార పలవాట్లు.. చిరంజీవి దోశ, రామ్ చరణ్ రసం, రైస్ గురించి కూడా ఆమె ప్రత్యేకంగా వివరించారు. ఉపాసన మాట్లాడుతూ.. “మా ఇద్దరిలో రామ్ చరణ్ చాలా స్పైసీ ఫుడ్ తింటాడు. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా సరే కచ్చితంగా సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండాల్సిందే. రోజులో కనీసం ఒక్కసారైనా సరే సౌత్ స్పైసీ ఫుడ్ లేకపోతే ఆయనకు కడుపు నిండదు. ముఖ్యంగా ఆయన తినే భోజనంలో రసం ఉండాల్సిందే అంటూ వారి ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చింది.
మాది మగధీర లాంటి ప్రేమ కాదు – ఉపాసన
అలాగే తమ ప్రేమ గురించి చెబుతూ..” మాది మగధీర సినిమాలో లాంటి ప్రేమ కథ కాదు. ఎలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వివాహ బంధంతో ఒక్కటయ్యారనే సంగతులను కూడా ఉపాసన పంచుకున్నారు”. ఇక ప్రస్తుతం ఆమె పంచుకున్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Udaipur files: వివాదాల నడుమ థియేటర్ లోకి వచ్చిన ఉదయ్ పూర్ ఫైల్స్.. ఎలా ఉందంటే?