BigTV English

Bigg boss: విష్ణుప్రియకు అది తప్పా మరేం దక్కలేదా..?

Bigg boss: విష్ణుప్రియకు అది తప్పా మరేం దక్కలేదా..?

Bigg boss:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). డిసెంబర్ 15వ తేదీ నాటికి 8 సీజన్లు పూర్తిచేసుకుంది. చివరి సీజన్ మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమవ్వగా అందులో యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya) తప్ప ఎవరూ పెద్దగా తెలిసిన మొహాలు కాదు. దీంతో ఈమెకు గుర్తింపు బాగా లభించింది. చాలామంది ఈమె కోసమే బిగ్ బాస్ షో చూడడం మొదలుపెట్టారు. ఇకపోతే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేదు ఈ ముద్దుగుమ్మ. కనీసం ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విష్ణు ప్రియ ప్రేమ వ్యవహారం హైలెట్ అయ్యింది. టిఫిన్ ఇక ఈమె ఆటను మరిచి కంటెస్టెంట్ పృథ్వీ తో చనువుగా తిరిగింది.


అతడి కోసమే ఎన్నో గేమ్స్ ను వదిలేసుకుంది. గెలిచే అవకాశం ఉన్నా సరే పృథ్వీ కోసం వదులుకుంది. 14 వారాలు హౌస్ లో ఉంది కానీ ఆమె గేమ్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కేవలం తెలిసిన వ్యక్తి అనే నేపథ్యంలోనే ఎక్కువమంది ఓట్లు వేయడం జరిగింది. టైటిల్ విన్నర్ గా బరిలోకి దిగిన విష్ణు ప్రియతో హోస్ట్ నాగార్జున కూడా హెచ్చరించారు. నువ్వు గేమ్ ను సీరియస్గా తీసుకోకపోతే ఆడియన్స్ కూడా నిన్ను బయటకు పంపించేస్తారని తెలిపాడు. ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి వచ్చిన విష్ణు ప్రియ తండ్రి కూడా ఇదే విషయంలో ఆమెను హెచ్చరించాడు. కానీ ఆమెలో మాత్రం మార్పు రాలేదు. ఇక విష్ణుప్రియ తెలుగు బిగ్ బాస్ టైటిల్ కొట్టిన ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ అవుతుంది అని అందరూ భావించారు. కానీ విష్ణుప్రియ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. ఇదిలా ఉండగా సోషల్ మీడియా స్టార్ నబీల్ టాప్ 3 లో నిలవడం విష్ణు ప్రియ కు చెంపపెట్టు అని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో తన పెర్ఫార్మన్స్ పై విష్ణు ప్రియ ఓపెన్ అయింది. ” కొంతమంది నన్ను అభిమానించారు. మరికొంతమంది ద్వేషించారు కూడా. అయితే నేను నాలాగే ఉన్నాను. గతంలో నేను కోటి రూపాయలు ఇచ్చినా బిగ్ బాస్ షో కి వెళ్ళను అని అన్నాను. అయితే ఈసారి సీజన్లోకి వచ్చినప్పుడు, దానిని ఆధారంగా చేసుకొని చాలా మంది ట్రోల్స్ చేశారు. నాకు బిగ్ బాస్ సీజన్ 3 నుండే ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు కోపం ఎక్కువ అలాగే ఇగో కూడా ఎక్కువే. ఇక నన్ను నేను ఎంత వరకు కంట్రోల్ చేసుకోగలను అని తెలుసుకోవాలనే ఇప్పుడు హౌస్ లోకి వచ్చాను. నాలో గత రెండేళ్లుగా ఆధ్యాత్మిక చింతన మొదలైంది. నా గురువు సలహా మేరకే నేను ఈ షో కి రావాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ ఈ షో కి వచ్చిన తర్వాత నన్ను నేను కొన్ని సందర్భాలలో కంట్రోల్ తప్పాను” అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ , నబీల్ వంటివారికి ఈ షో ద్వారా భారీ పాపులారిటీ లభించింది. కానీ ఇప్పటికే పాపులారిటీ ఉన్న విష్ణు ప్రియకి మాత్రం క్రేజ్ లభించలేదు. దీనికి తోడు పృథ్వీ తో ప్రేమలో పడి, ఆట మరిచిపోయిందనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి చూసుకుంటే ఈమెకు డబ్బు తప్పా..మరేమీ మిగల్లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×