E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: నయని నోరుమూయించిన గంగవ్వ, ప్రేరణపై పగపట్టి న పృథ్వి.. ఈసారి నామినేషన్స్ అదుర్స్

Bigg Boss 8 Telugu: నయని నోరుమూయించిన గంగవ్వ, ప్రేరణపై పగపట్టి న పృథ్వి.. ఈసారి నామినేషన్స్ అదుర్స్
Advertisement

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా వచ్చారు. వారంతా మునుపటి సీజన్స్‌లో కంటెస్టెంట్స్‌గా కనిపించినవారే. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంటర్ అయిన తర్వాత హౌస్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా మారుతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ మరింత బోరింగ్‌గా తయారయ్యింది. ఫైనల్‌గా నామినేషన్స్ అయినా ఇంట్రెస్టింగ్‌గా సాగేలా ఉన్నాయని తాజాగా విడుదలయిన ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతోంది. ఈసారి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన టోపీని ఎవరైతే ముందుగా పట్టుకుంటారో కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేసే అవకాశం వారికే లభిస్తుందని బిగ్ బాస్ వివరించారు.

తేజ వెటకారం

Advertisement

ముందుగా నిఖిల్ వచ్చి టేస్టీ తేజను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పడంతో బిగ్ బాస్ ప్రోమో మొదలవుతుంది. నిఖిల్ తనను నామినేట్ చేస్తాడని ఊహించని తేజ షాకయ్యాడు. ఆ తర్వాత యష్మీ వచ్చి కూడా తేజనే నామినేట్ చేసింది. ‘‘నేను ఊహించినంత ఫన్ రాలేదు’’ అని కారణం చెప్పింది. ‘‘నేను నా టీమ్‌మేట్స్‌తో చేసింది నీకు తెలియదు. మీ మైండ్‌లో ఆ ఆలోచన వచ్చింది కాబట్టి మీరు అలాగే చూస్తున్నారు’’ అని తప్పించుకోవాలని చూశాడు తేజ. ‘‘మీ క్యారెక్టర్ నుండి బయటికి రావడం నేను చూశాను’’ అని యష్మీ సీరియస్‌గా చెప్తున్నా కూడా దానిని కామెడీ చేశాడు తేజ. ఆ తర్వాత వచ్చిన మణికంఠ.. నిఖిల్‌ను నామినేట్ చేశాడు.

Also Read: బిగ్ బాస్ మేకర్స్‌పై ఫిర్యాదు.. హౌస్‌కి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన పోలీసులు

Advertisement

కామెడీ చేయకు

‘‘నీ గ్రాఫ్ పడిపోయింది’’ అంటూ నిఖిల్‌ను నామినేట్ చేయడానికి కారణం చెప్పాడు మణికంఠ. ‘‘నువ్వు ఎక్కడ చూశావు, ఎలా చూశావు, గ్రాఫ్ ఏమైనా వేశావా’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు నిఖిల్. అంత కామెడీగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని మణికంఠ అనగా నువ్వు కామెడీగా చెప్తున్నావు అంటూ నిఖిల్ రియాక్ట్ అయ్యాడు. ‘‘నిఖిల్ నుండి కూడా నేను ఫన్ రావాలని ఆశిస్తున్నాను’’ అని మణి చెప్తుండగానే.. ‘‘నేను పులిహోర గురించి కామెడీ చేస్తుండగానే నువ్వు ఫీల్ అయ్యి వెళ్లిపోయావు’’ అని గుర్తుచేశాడు నిఖిల్. ‘‘బీబీ హోటల్ టాస్క్‌లో నువ్వు సరిగా ఆడలేదు’’ అంటూ పృథ్విని నామినేట్ చేసింది గంగవ్వ. అది వినగానే ‘‘మహారాణి అసిస్టెంట్ ఇక్కడే ఉన్నారు ఆమెను అడగండి’’ అంటూ నయని పావనిని మధ్యలోకి తీసుకొచ్చాడు పృథ్వి.

నయనిపై సీరియస్

‘‘అది నాతోనే సరిగా లేదు నాకు అసిస్టెంట్ ఎలా అవుతుంది’’ అంటూ నయని పావనిపై సీరియస్ అయ్యింది గంగవ్వ. తర్వాత నయని ఏదో చెప్పాలనుకున్నా వినకుండా అరిచి తన నోరుమూయించింది. గంగవ్వ నామినేషన్‌ను ప్రేరణ యాక్సెప్ట్ చేసింది. దీంతో పృథ్వి, ప్రేరణకు మధ్య గొడవ మొదలయ్యింది. ముందుగా యష్మీ దగ్గరకు వెళ్లి ప్రేరణను నామినేట్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు పృథ్వి. ఇదంతా విన్న ప్రేరణ.. నిఖిల్‌ను సాయం అడిగింది. నిఖిల్ వెళ్లి చెప్పినా పృథ్వి వినలేదు. ‘‘హౌస్ మొత్తం ఒకవైపు ఉన్నా కూడా నేను ప్రేరణనే నామినేట్ చేస్తాను’’ అని గట్టిగా చెప్పాడు. అలా ప్రేరణపై రివెంజ్ తీసుకోవడానికి ఆట మొదలుపెట్టాడు పృథ్వి.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×