E-Paper
Advertisement

Bigg Boss: బిగ్ బాస్ మేకర్స్‌పై ఫిర్యాదు.. హౌస్‌కి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన పోలీసులు

Bigg Boss: బిగ్ బాస్ మేకర్స్‌పై ఫిర్యాదు.. హౌస్‌కి వెళ్లి మరీ నోటీసులు ఇచ్చిన పోలీసులు
Advertisement

Bigg Boss 11 Kannada: బిగ్ బాస్ అనేది దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో దాదాపు ఒకే సమయానికి ప్రారంభమయ్యింది. అందులో ముందుగా తెలుగు ప్రారంభం కాగా.. ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో కూడా మొదలయ్యింది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే కాంట్రవర్సీలు. కచ్చితంగా ఇలాంటి ఒక రియాలిటీ షో ఉండడం సొసైటీకి మంచిది కాదని ఎవరో ఒకరు దీనిపై ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. దానిని మేకర్స్ కూడా పెద్దగా పట్టించుకోకుండా సీజన్ తర్వాత సీజన్‌తో దూసుకుపోతూనే ఉంటారు. తాజాగా కన్నడలో బిగ్ బాస్ సీజన్ 11 ప్రారంభం కాగా.. మొదలయిన వారం రోజుల్లోనే అనేక చిక్కులు వచ్చిపడ్డాయి. ఏకంగా పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు.

స్వర్గం.. నరకం..

Advertisement

బిగ్ బాస్ కన్నడ ఇప్పటివరకు 10 సీజన్లు పూర్తిచేసుకుంది. అందుకే ఈసారి మునుపటి సీజన్స్ కంటే భిన్నంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అలా కొత్త కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ 11ను ప్రారంభించారు. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ హౌస్‌లో స్వర్గం, నరకం అనే కాన్సెప్ట్ ఉంది. అంటే కంటెస్టెంట్స్‌గా వచ్చిన వారిలో కొందరు స్వర్గంలో ఉంటే, కొందరు నరకంలో ఉండాలి. అయితే స్వర్గంలో ఉండే కంటెస్టెంట్స్‌కు దొరకే సౌకర్యాలు ఏవీ నరకంలో ఉండేవారికి ఉండవు. ఆహారం, బాత్రూమ్ వినియోగించుకోవడం.. ఇలాంటి అత్యవసరాలు కూడా స్వర్గంలో ఉండే కంటెస్టెంట్స్ చేతిలోనే ఉంటాయి.

Also Read: ‘బిగ్ బాస్’ నుండి గాడిద ఎలిమినేట్.. మొత్తానికి వారి పంతం నెగ్గిందిగా!

Advertisement

అత్యవసరాలు కూడా బంద్

స్వర్గంలో ఉండే కంటెస్టెంట్స్ తమకు నచ్చిన ఆహారాన్ని తినవచ్చు. కానీ నరకంలో ఉండేవారు కేవలం గంజి మాత్రమే తిని బ్రతకాలి. ఆఖరికి బాత్రూమ్‌కు వెళ్లాలనుకున్నా స్వర్గంలో ఉన్న కంటెస్టెంట్స్ అనుమతి ఇస్తేనే వెళ్లాలి. దీంతో ఈ షో చూడడానికి ప్రేక్షకులకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. బిగ్ బాస్ అనేది ఎంటర్‌టైన్మెంట్ కోసం అన్నట్టు కాకుండా అందులో కంటెస్టెంట్స్‌గా వచ్చినవారిని ఇబ్బంది పెట్టడానికే అన్నట్టుగా తయారయ్యింది. ప్రేక్షకులకు మాత్రమే కాదు రాష్ట్ర మహిళా కమిషన్‌కు కూడా దీనిపై కోపం వచ్చింది. షోలోని మహిళల అత్యవసరాలను పట్టించుకోకుండా, వారి ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్నారని మహిళా కమిషన్ భావించింది.

పోలీసులకు ఫిర్యాదు

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నాగలక్ష్మి.. బిగ్ బాస్‌పై ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదును యాక్సెప్ట్ చేసిన పోలీసులు.. బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. దీంతో బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 ప్రారంభమయిన వారం రోజులకే దీనిపై గట్టి దెబ్బపడింది. అయినా ఇలాంటి ఫిర్యాదులు బిగ్ బాస్‌కు కొత్తేమీ కాదు. ఈ షోను ఆపేయాలని ఎన్నోసార్లు మేకర్స్‌పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం సులువుగా ఈ ఫిర్యాదుల నుండి తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ షో కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమే అని మేకర్స్ పదేపదే చెప్తున్నా కూడా కొందరు మాత్రం కావాలని దీనిని పర్సనల్‌గా తీసుకొని ఈ షో ఆపేయాలని నిరసనలు కూడా చేశారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×