Geetu Royal : బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న గీతూ రాయల్ (Geethu Royal)ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఈమె హౌస్ లో ఉన్నది చాలా తక్కువ వారాలే అయినప్పటికీ తన ప్రవర్తనతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక బిగ్ బాస్ (Bigg Boss 6)నుంచి తొందరగా బయటకు రావడంతో ఈమె ఎంతో ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. అయితే తదుపరి సీజన్ కు ఈమె బజ్ హోస్ట్ గా వ్యవహరించి సందడి చేశారు.ఇలా బిగ్ బాస్ తర్వాత పెద్దగా సినిమాలలోను వెబ్ సిరీస్లలో నటించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు.
చీమల్లాగా చనిపోతున్నారు…
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే గీతూ రాయల్ తాజాగా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా మనుషులు చావు గురించి మాట్లాడారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ప్రమాదంలో మనుషులు చనిపోయారనే వార్తలే వింటున్నామని తెలిపారు. మనుషులు చీమల మాదిరిగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక హనీమూన్ వెళ్తే అక్కడ కాల్పులు జరుపుతారు, గుడికి వెళ్తే తొక్కిసలాటలో చనిపోతున్నారు, సినిమాకు వెళ్లిన, ఇటీవల ఆర్సిబీ గెలిచి విజయోత్సవాల్లో పాల్గొన్న తొక్కిసలాట జరిగి చనిపోతున్నారు. బస్సులో ప్రయాణం చేసిన కారులో ప్రయాణం చేసిన చనిపోతున్నారు. ఇటీవల జరిగిన విమాన ప్రమాదం గురించి కూడా ఈమె ఆవేదన చెందారు.
ప్రాణాలతో బయటపడ్డాను…
ఒక్కసారిగా విమానం కూలిపోవడంతో 250 మంది ప్రాణాలు పోయాయని ఆవేదన చెందారు.. మనిషి బ్రతుకు క్షణాలలో క్లోజ్ అవుతుందని కానీ మనం ఇప్పటికీ బ్రతికున్నామంటే ఎంతో అదృష్టవంతులమని తెలిపారు. అంతేకాకుండా గత 20 రోజులకు క్రితం తన కారుకు కూడా ఘోరంగా యాక్సిడెంట్ జరిగిందని చనిపోయే పరిస్థితి నుంచి బ్రతికి బయటపడ్డానని తనకు జరిగిన ప్రమాదం గురించి ఆలస్యంగా తెలియజేశారు. ఈ ప్రమాదం నుంచి తాను తృటిలో తప్పించుకున్నానని, ఈ జీవితం ఏ క్షణం ముగుస్తుందో తెలియదు అందుకే మనకు నచ్చింది చేసేయాలి. ప్రేమించాలి. మన భావాలను మిగతావాళ్లతో పంచుకోవాలి. మన వల్ల ఎవరికీ బాధ కలిగించకపోతే, మనం చనిపోయినా పశ్చాత్తాపం ఉండదని తెలిపారు.
?igsh=MXN0MnhscDFsazV5NA%3D%3D
ఇలా గీతూ రాయల్ తనకు జరిగిన ప్రమాదం గురించి ఈ విషయాలను బయట పెట్టడంతో అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నారు కదా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం చాలా అద్భుతమైన మాటలు చెప్పారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి తన మాట తీరుతో గీతూ రాయల్ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఈమె ఇతర షోలలో ఎక్కడ కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
Also Read: Anchor Lasya: నా కల నెరివేరింది నాన్న.. తండ్రికి కారు గిఫ్టుగా ఇచ్చిన లాస్య, కానీ..