BigTV English

Anchor Lasya: నా కల నెరివేరింది నాన్న.. తండ్రికి కారు గిఫ్టుగా ఇచ్చిన లాస్య, కానీ..

Anchor Lasya: నా కల నెరివేరింది నాన్న.. తండ్రికి కారు గిఫ్టుగా ఇచ్చిన లాస్య, కానీ..

Anchor Lasya: బుల్లితెరపై ఎన్నో మ్యూజిక్ చానల్స్ లో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న లాస్య(Lasya) ఇటీవల కాలంలో యాంకరింగ్ కు కాస్త దూరంగా ఉన్నారు. గతంలో ఈమె మా మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తూ చీమ ఏనుగు కథలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న లాస్య ప్రస్తుతం యాంకరింగ్ కు దూరంగా ఉంటూ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇక ఈమె తను ప్రేమించిన వ్యక్తి మంజునాథ్(Manjunath) ను పెళ్లి చేసుకున్న తర్వాత బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన లాస్య ఇటీవల కాలంలో తిరిగి పలు కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.


తండ్రికి ఇష్టం లేని పెళ్లి…

ఇక మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తన తండ్రికి ఇష్టం లేకుండా మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎన్నో గొడవలు తర్వాత తిరిగి కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో లాస్య మంజునాథ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే లాస్య తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె కావడంతో తన తల్లిదండ్రుల బాధ్యతను కూడా ఈమె తీసుకున్నారు అని తెలుస్తుంది.


ఫాదర్స్ డే సందర్భంగా…

చిన్నప్పటినుంచి తన తండ్రి తనకోసం ఎంతో కష్టపడి పని చేశారని తన కష్టాన్ని తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే గత కొద్దిరోజులుగా లాస్య తన తండ్రికి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. తన సొంత ఊర్లో తన తండ్రి కోసం ఒక అందమైన ఇంటిని కట్టించి ఇచ్చారు. అలాగే గత ఏడాది ఫాదర్స్ డే సందర్భంగా పొలంలో పనిచేయడం కోసం తన తండ్రికి ట్రాక్టర్ కూడా కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫాదర్స్ డే (Fathers Day)సందర్భంగా ఈమె తన తండ్రికి మరొక కారును(Car) కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని లాస్య తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

తన తండ్రికి తెలియకుండా గుడికి వెళుతున్నామని చెబుతూ ఈమె షో రూమ్ కి తీసుకువెళ్లి, తన తండ్రికి ఎంతో ఇష్టమైన కారును కొనుగోలు చేసి కానుకగా అందించారు. చిన్నప్పటినుంచి తన తండ్రి కారు నడుపుతుంటే తన తండ్రి పక్కన కూర్చొని వెళ్లటమే తనకల అని తెలిపారు. అయితే ఇన్ని రోజులకు నా కల నెరవేరింది అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ వయసులో తన తండ్రికి కారు అవసరం ఎంతో ఉంది కనుక తన తండ్రికి కారును కానుకగా ఇచ్చానని అయితే చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా తన తండ్రికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. తండ్రికి ట్రాక్టర్ నడపడం వచ్చు కానీ కారు నడపడం రాదని చెబుతూ ఈమె ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు మీలాంటి కూతురు ఉండటం చాలా అదృష్టం కానీ, మంజునాథ్ లాంటి అల్లుడు దొరకడం మరింత అదృష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మంజునాథ్ తనని మామయ్యలాగ కాకుండ ఒక తండ్రిలాగా చూసుకుంటారని పలు సందర్భాలలో లాస్య వారిద్దరి బాండింగ్ గురించి చెప్పిన విషయం తెలిసిందే.

Alaso Read: Prabhas:  మళ్లీ జన్మ ఉంటే ప్రభాస్ కొడుకుగా పుట్టాలి..  జరీనా వహాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×