AP Politics: మాజీ ముఖ్యమంత్రి జగన్ సత్తెనపల్లి పర్యటన మొత్తం వివాదాస్పదంగానే సాగింది. వాస్తవానికి జగన్ సత్తెనపల్లి పర్యటనలో రచ్చ చేసేందుకు ఆ పార్టీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసిందని ప్రభుత్వానికి సమాచారం అందింది. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగేలా ఏదో ఒక గొడవ సృష్టించేందుకు వైసీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ పర్యటనకు ఆంక్షలు పెట్టారు. అయినా వైసీపీ నేతల హడావుడితో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలవడం, పోలీసులతో అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు వివాదాస్పంగా మారింది.
అపసృతులు.. దౌర్జన్యాలు
జగన్ పర్యటనలో వైసీపీ కుట్రలు పన్నిందని టీడీపీ ఆరోపణలు
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటించారు. ఈ పర్యటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగేలా వైసీపీ కుట్ర వ్యూహాలు పన్నిందని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందులోభాగంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్యకర్తల సమీకరణకు ఆ పార్టీ ఏర్పాట్లు చేసిందంటూ టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ క్రమంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను సమీకరించాలని ఆదేశాలు వెళ్లాయంట.
లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి ప్రణాళికలు
అలాగే నియోజకవర్గ నేతలతో పార్టీ అగ్రనేతలు స్వయంగా మాట్లాడి కార్యకర్తలను తీసుకువచ్చే బాధ్యతలను వారికి అప్పగించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా పోలీసుల సూచనలు, నిబంధనలు ధిక్కరించడం ద్వారా గలాటా సృష్టించేందుకు పక్కా ప్రణాళికలు రచించారని, ఇతర ప్రాంతాల వారిని పోలీసులు ఆపితే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేందుకు ప్రణాళిక పన్నారని నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది.
జగన్ పర్యటనపై ముందే ఆంక్షలు విధించిన పోలీసులు
అందుకే పరామర్శకు పరిమిత సంఖ్యలో వచ్చి వెళితే అభ్యంతరం లేదని ఇప్పటికే వైసీపీ నేతలకు జిల్లా ఎస్పీ తెలిపారు. ముందస్తు సమాచారంతో పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ఆంక్షలు విధించారు. అదీకాక పొదిలి పర్యటనలో వైసీపీ శ్రేణులు దాడుల నేపథ్యంలో పోలీసు శాఖ ముందే అప్రమత్తమైంది. 2024 ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చాడు. వైసీపీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదో ఒక సమస్యను సృష్టించేందుకు ఆ పార్టీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. అందుకు గతంలో జరిగిన సంఘటనలే ఉదాహరణ అని కూటమి శ్రేణులు అంటున్నాయి. గతంలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి.
జగన్ పొదిలి పర్యటనలో రాళ్లు దాడి
అలాగే పొగాకు రైతులకు మద్దతు తెలుపుతూ ఇటీవల ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్బంగా రాళ్ల దాడి ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు మరో గలాటా సృష్టించేందుకు వైసీపీ పక్కా ప్రణాళిక రూపొందించిదన్న సమాచారంతో పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. అంత చేసినా వైసీపీ శ్రేణుల అత్యత్సాహం మాత్రం కొనసాగింది. జగన్ పర్యటనలో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు రెచ్చిపోయారు. అంబటి, అతని సోదరుడు మురళి కలిసి రోడ్డుపై పోలీసులు అడ్డంగా పెట్టిన బారికేడ్‌లు విసిరిపడేశారు. వారిని అడ్డుకోబోయిన పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యంగా ప్రవర్తించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా ఏకంగా పోలీసులకే అంబటి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆపై అంబటి సోదరులు బారికేడ్‌లు తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపించారు.
సత్తెన్నపల్లి టౌన్లో సీఐపై వైసీపీ శ్రేణుల దౌర్జన్యం
జగన్ పర్యటన మొత్తం దౌర్జన్యాలు, అపశృతులతో ముందుకు సాగింది. సత్తెన్నపల్లి టౌన్లో జగన్ రాకముందే ఓ సీఐపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యం చేసి అతడిని నెట్టివేయగా.. మరోవైపు ఆర్టీసీ బస్సుపై జెండా కర్రలతో దాడి చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లా సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద మాజీ మంత్రి హల్‌చల్ చేశారు. బారికేడ్లను తోసివేసి.. ఆంక్షలు విధించిన పోలీసులపై దౌర్జన్యం చేస్తూ వైసీపీ కేడర్‌ను సత్తెనపల్లి వైపు వెళ్లేలా వీరంగం సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి భారీ ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రోడ్డుపై నుంచి తోసిపడేశారు.
గతంలో పట్టాభిపురం సీఐ పట్ల దురుసు ప్రవర్తన
జగన్ పల్నాడులోకి ప్రవేశించాక.. ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తలు, కేడర్ వాహనాలను పల్నాడు వద్ద బార్డర్‌లో బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. అదే రోడ్డులో వస్తున్న అంబటి రాంబాబు, అతని సోదరుడు అంబటి మురళి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిద్దరినీ పంపిస్తామని పోలీసులు చెప్పినప్పటికీ బారికేడ్లను స్థానిక నేతలతో కలిసి సోదరులు ఇద్దరు బారికేడ్లను లాగిపడేస్తూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుకు పోలీసుల అంతు తేలుస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినోత్సవంలో కూడా పట్టాభిపురం సీఐపై కూడా అంబటి రాంబాబు ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. పోలీసుల పట్ల అంబటి రాంబాబు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జయవర్ధన్ అనే వైసీపీ కార్యకర్త మృతి
ఇక జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో వరుస అపశృతులు చోటు చేసుకున్నాయి. సత్తెనపల్లి గడియారం స్థంభం వద్ద ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. దీంతో జయవర్ధన్ అనే వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయిడటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఉదయం జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొట్టడంతో సింగయ్య అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడారు. పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
Also Read: షాక్ ఇస్తాడా? బీజేపీలోనే ఉంటారా? ఈటల ఫ్యూచర్ ఏంటి
గాయపడ్డ వృద్దుడ్ని పక్కకు నెట్టేసి వెళ్లిన క్యాడర్
గుంటూరు లాలపురం రోడ్ ప్రమాదంలో చనిపోయిన సింగయ్య మృతిపై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. జగన్ కాన్వాయ్ ముందు వెళ్తున్న వాహనాలు ఢీ కొట్టడంతోనే సింగయ్య చనిపోయారని తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ సింగయ్యను రోడ్డు పక్కన పెక్కకి నెట్టేసి తెలిపారు. పోలీసులు గుర్తించి.. 108 వాహనానికి ఫోన్ చెయ్యడంతో ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారని.. వైద్యులు పరీక్షించి సింగయ్య చనిపోయినట్టు దృవీకరించారని తెలిపారు ఎస్పీ. అయితే కాన్వాయ్ ఢీకొని గాయపడిన వృద్ధుడిని పట్టించుకోకుండా జగన్‌తో పాటు వైసీపీ నాయకులు వెళ్లిపోవడం, రోడ్డు పక్కకి నెట్టేయడంతో జగన్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Story By Apparao, Bigtv Live