BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా? నామినేషన్స్ లో మరో రచ్చ..

Bigg Boss 8 Telugu : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా? నామినేషన్స్ లో మరో రచ్చ..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 ఇప్పుడు ఆసక్తిగా మారింది.. ఆదివారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డు ద్వారా ఏకంగా హౌస్ లోకి 8 మంది వచ్చిన సంగతి తెలిసిందే. ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఇప్పుడు ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. మొన్నటివరకు ఏదో పేరుకే అన్నట్లు కొనసాగిన బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం జనంతో సందడి వాతావరణంతో కళకళ లాడుతుంది. ఇకపోతే ప్రతి సోమవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరుగుతాయి అన్న విషయం తెలిసిందే.. ఇక సోమవారం ఎపిసోడ్ లో కూడా ఈ నామినేషన్స్ తంతు జరుగుతుంది. అయితే కొత్త వాళ్లు, పాత వాళ్లు అందరు విష్ణు ప్రియానే టార్గెట్ చేసి నామినేషన్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారం విష్ణునే బయటకు వెళ్ళబోతుందని తెలుస్తుంది.


ఈ ఈరోజు విడుదలైన ప్రోమోలో.. హౌస్‌లో ఉండటానికి ఎవరు అనర్హులని భావిస్తే వారి మెడలో బోర్డు వేసి తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక ముందుగా యష్మీ మెడలో నామినేటెడ్ బోర్డ్ వేసి తన పాయింట్లు చెప్పింది హరితేజ. నిఖిల్ హరితేజ మధ్య రగడ మొదలైనట్లు తెలుస్తుంది. మీకు ఇష్టం లేదు అన్న దగ్గర వేరే రూల్ అప్లయ్ అవుతుంది.. అంటూ హరితేజ చెప్పింది. దీనికి నాకు ఏదనిపిస్తే అది చేస్తా.. నా గేమ్‌కి ఎవరు డిస్ట్రబింగ్‌గా అనిపిస్తే వాళ్లనే కదా నామినేట్ చేస్తా అని అంటుంది. ఒక్క రోజు కూడా అవ్వలేదు. అప్పుడే ఫిటింగ్ పెట్టాడు బిగ్ బాస్. ఇక విష్ణు ప్రియను అందరు నామినేట్ చేస్తారు.

ఇక ఆ తర్వాత విష్ణుప్రియను నామినేట్ చేస్తూ సరైన పాయింట్లు చెప్పాడు గౌతమ్. నువ్వు నీ గేమ్‌ను పక్కన పెట్టేసి వేరే వ్యక్తిపై కాన్సట్రేట్ చేస్తున్నావ్ అంటూ గౌతమ్ చెప్పాడు. దీనికి ఇక్కడ నేనేంటి.. నేను ఏం ఫీల్ అయ్యాను.. నా ఎమోషన్స్ ఏంటి.. నేను అదే చూపిస్తాను.. అంటూ విష్ణు చెప్పింది. ఇక నయని పావని కూడా విష్ణుప్రియ మెడలోనే బోర్డ్ వేసింది. నీలో సీరియస్‌నెస్ అస్సలు లేదనిపిస్తుంది.. ఈ హౌస్ లో ఏం చేస్తున్నామో వాళ్లకు క్లారిటీ ఉండాలని విష్ణు ప్రియను ఎక్కువగా టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తారు.. యష్మి, విష్ణు, గంగవ్వ, సీత, పృథ్వీ, మెహబూబ్.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌కి ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పటికీ కచ్చితంగా ఇద్దరూ లిస్టులో ఉండాలని బిగ్‌బాస్ చెప్పడంతో మెహబూబ్, గంగవ్వ వచ్చారు. ఇక విష్ణు గత వారం తప్పించుకుంది. ఈ వారం ఈ అమ్మడు బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి..


Related News

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Big Stories

×