Mehaboob:మెహబూబ్ (Mehaboob).. బిగ్ బాస్ షోలో రెండుసార్లు పాల్గొన్నా.. విజేతగా నిలవలేకపోయారు. ఈయన అక్కడ తన ఆట, మాటతీరుతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న మెహబూబ్.. ఇటీవల మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య (Sree Satya) తో కలిసి ‘నువ్వే కావాలి’ అనే సాంగ్ చేశారు. ఈ సాంగ్ కి యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఇటీవల ఈ సాంగ్ గురించి చెబుతూ కోటి రూపాయలు ఖర్చు చేశానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులకు, తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను షేర్ చేసే మెహబూబ్.. తాజాగా మా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది అంటూ తెలిపి అందరిని ఆశ్చర్యపరిచారు.
మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యింది..
అసలు విషయంలోకి వెళ్తే.. “నా సోదరుడు సుభాన్ కి మగ బిడ్డ జన్మించారు. ఈ బుడ్డోడు ఇప్పటికే మా జీవితాలలో అంతులేని ఆనందాన్ని కన్నీళ్లుగా మార్చాడు. వాడే మా జీవితాలలో అత్యంత విలువైన బహుమతిగా మేము అనుకుంటున్నాము. అతని రాకతో మా జీవితాలు నవ్వుల హరివిల్లుగా, ప్రేమమయంగా మారిపోయాయి. అతని ప్రయాణం, ఆరోగ్యం, ప్రేమ, ఆనందంతో నిండి ఉంటుంది. అతను తన తండ్రిలాగే బలం, దయగల వ్యక్తిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బుడ్డోడితో మా కుటుంబ సభ్యుల మధ్య బంధం మరింత దృఢంగా పెరగాలని, మా హృదయాలు ఆనందంతో నిండాలి అని కోరుకుంటున్నాను.భగవంతుడు ఇచ్చిన ఈ ప్రసాదాన్ని ప్రపంచంలోకి స్వాగతిస్తూ.. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ మెహబూబ్ తన ఆనందాన్ని అక్షర రూపంలో మార్చి అభిమానులతో పంచుకున్నారు. ఇక ప్రస్తుతం మహబూబ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు, బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, సెలబ్రిటీలు కూడా ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మెహబూబ్ పెళ్ళెప్పుడంటే..?
ఇకపోతే తన సోదరుడి కొడుకును చేతుల్లోకి తీసుకొని ఉబ్బితబ్బిబవుతున్న మెహబూబ్ తో మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై కూడా ఇదివరకే ఈయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంట్లో పదేపదే పెళ్లి ప్రస్తావన తీస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారా? అని తల పట్టుకున్నారు మెహబూబ్. ఇక మెహబూబ్ కెరియర్ విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో పాల్గొని, అప్పుడే తన నటనతో, పెర్ఫార్మెన్స్ తో ఎంతోమంది ఆడియన్స్ హృదయాలను దోచుకున్నారు. ఇక అదే సమయంలో టైటిల్ విజేత అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అంతవరకు ఆయన వెళ్ళలేకపోయారు. ఇక మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇక్కడ కులం గురించి మాట్లాడి, కాస్త విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక విమర్శలు ఎదుర్కొన్న మెహబూబ్ ఈ కారణంగానే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ కెరియర్ కొనసాగిస్తున్నారు.