Roshan Kanakala’s Mowgli 2025 : తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ సుమ. తన కొడుకు రోషన్ కనకాలను హీరో చేయడానికి చాలా గట్టి ప్రయత్నాలే చేస్తుంది. బబుల్‌గమ్ మూవీ తర్వాత ఇప్పుడు మరో మూవీని అనౌన్స్ చేశారు. మౌగ్లీ 2025 అనే టైటిల్‌తో వాలెంటైన్స్ డే రోజు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ 1990లో వచ్చిన ఓ మూవీలా ఉంటుందని టాక్ వస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…
‘బాటిల్ ఫర్ లవ్ బిగిన్స్’ అనే పేరుతో నిన్న రోషన్ కనకాల మూవీ టైటిల్ టీజర్ వచ్చింది. మొత్తం టీజర్ చూసిన తర్వాత… ఓ సైలెంట్ లవ్ స్టోరీలో వైలెంట్ వార్ ఉంటుందని చూపించాడు డైరెక్టర్ సందీప్ రాజ్.
అయితే ఈ మూవీ 1990లో వచ్చిన ఓ మూవీలా ఉంటుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే… 1990లో దగ్గుబాటి వెంకటేష్, దివ్య భారతి కలిసి నటించిన బొబ్బిలి రాజా సినిమా గుర్తుందా… ఆ సినిమాలో హీరో – హీరోయిన్ అడవుల్లో ఉంటారు. అచ్చం అలానే ఈ మోగ్లీ 2025 ఉంటుందని సమాచారం.
అయితే బొబ్బిలి రాజా సినిమాలో హీరోయిన్ అడవులకు వెళ్తే అక్కడా… హీరో గైడ్‌గా ఉంటాడు. అక్కడే అడవుల్లో హీరో, హీరోయిన్ చిక్కిపోతారు. అయితే… మోంగ్లీ మూవీలో హీరో, హీరోయిన్ అడవుల్లోనే ఉంటారు. కానీ, అది తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం అని తెలుస్తుంది.
ప్రేమను గెలిపించుకోవడం కోసం హీరో, హీరోయిన్ అడవుల నుంచే వైల్డ్ వార్ చేస్తారట. ఈ లైన్‌తోనే స్టోరీ ప్రిపేర్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో మోగ్లీ : లెజెండ్ ఆఫ్ ది జంగిల్ అనే హాలీవుడ్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మూవీలో కూడా లీడ్ రోల్ అడవుల్లోనే ఉంటాడు. అచ్చం అలానే… హీరో కూడా అడవుల్లోనే ఉండటం వల్ల మోగ్లీ అని టైటిల్ పెట్టి దానికి ట్యాగ్‌గా 2025 అని ఇచ్చారని తెలుస్తుంది.
బాగానే స్టార్ట్ చేశారు… కానీ…
రోషన్ కనకాల మూవీని… 8 మంత్స్ రైటింగ్, 7 మంత్స్ ప్రీ ప్రొడక్షన్, 6 న్యూ ఏజ్ టెక్నిషియన్స్ అంటూ డిఫరెంట్‌గా అనౌన్స్ చేశారు. టీజర్‌ను కూడా అట్రాక్ట్‌గా డిజైన్ చేశారు. అయినా… ఎందుకో… ఆడియన్స్‌కు పెద్దగా రీచ్ కాలేకపోయింది. ఈ మోగ్లీ 2025 టైటిల్ టీజర్ వచ్చి 40 గంటలు అయినా… 200K వ్యూస్ మాత్రమే వచ్చాయి. కనీసం 1M వ్యూస్ కూడా రాకపోవడం వల్ల ఆ టీజర్ ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.