E-Paper
Advertisement

Medigadda Barrage: రిపేర్ చేయలేం.. మేడిగడ్డను కూల్చాల్సిందే.. NDSA నివేదిక

Medigadda Barrage: రిపేర్ చేయలేం.. మేడిగడ్డను కూల్చాల్సిందే.. NDSA నివేదిక

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్‌ను కూల్చి మళ్లీ కడితేనే మంచిదనే అభిప్రాయాన్ని నేషనల్ ​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ వ్యక్తం చేసింది. కుంగిన దానిని కూల్చి.. కొత్తగా నిర్మిస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తుది నివేదికలో కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. ఏడో బ్లాక్ ​కింద భారీ అగాధం ఉందని.. దాన్ని ఇప్పటికే గ్రౌటింగ్‌లో పూడ్చారని.. ఈ బ్లాక్‌కు రిపేర్లు చేసినా ఎన్నాళ్లు పటిష్టంగా ఉంటుందనే విషయం చెప్పలేమని రిపోర్టులో వెల్లడించినట్టు సమాచారం. కొద్దిపాటి వరదకే ఏడో బ్లాక్​ కుంగిందని.. భవిష్యత్తులో భారీ వరద వస్తే తట్టుకుంటుందన్న గ్యారంటీ లేదని పేర్కొన్నట్టు సమాచారం. బ్యారేజీ కట్టిన ప్రాంతంలో నది వెడల్పు ఒక్కసారిగా కుచించుకుపోయినట్టు ఉంటుందని.. ఫలితంగా భారీ వరద వస్తే తన్నుకొచ్చే ప్రమాదం ఎక్కువని నివేదికలో ఉన్నట్లు సమాచారం.

మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లన్నీ లోపభూయిష్టంగానే ఉన్నాయని రిపోర్టులో కమిటీ స్పష్టం చేసినట్టు తెలిసింది. బ్యారేజీ సైట్‌లో టెస్టులు చేశాక.. డిజైన్లు ఫైనల్​ చేయాల్సి ఉన్నా.. అలా చేయలేదని నివేదికలో పేర్కొంది. అరకొరగా టెస్టులు చేశారని.. బ్యారేజీకి దిగువన సీసీ బ్లాకులు, ఆప్రాన్ల వంటి ప్రొటెక్షన్​ వర్క్స్ సరిగా లేవని ఆక్షేపించినట్టు తెలుస్తోంది. జియోఫిజికల్, జియోటెక్నికల్​ టెస్టులను సరిగా నిర్వహించకుండానే బ్యారేజీకి డిజైన్లను ఖరారు చేశారని పేర్కొన్నట్టు సమాచారం.

బ్యారేజీ కుంగిన తర్వాత.. అక్కడ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్​ చేయాలని చెప్పినా సరిగా చేయలేదని, గ్రౌటింగ్ ​చేసి అక్కడున్న ఎవిడెన్స్‌ తుడిచిపెట్టారని వెల్లడించినట్టు సమాచారం. బ్యారేజీ కట్టినప్పటి నుంచి ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్‌ పట్టించుకోలేదని.. ఎప్పటికప్పుడు మానిటర్ ​చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం ప్రదర్శించారని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Also Read:  ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు.. మాజీ మంత్రి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, ముగ్గురు అరెస్ట్

రిపోర్టును కొద్దిరోజుల క్రితమే కేంద్ర జలశక్తి శాఖకు..NDSA సమర్పించింది. ఇటీవల సీతారామ ప్రాజెక్టుపై జరిగిన టెక్నికల్​అప్రైజల్ కమిటీ మీటింగ్‌లో రిపోర్టుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆ నివేదికను చూపించే… సీతారామ డిజైన్లపై మరోసారి రివ్యూ చేయించుకోవాలని అధికారులకు కేంద్రం సూచించిందని సమాచారం. NDSA ఫైనల్​ రిపోర్టును కేంద్ర సర్కార్ మరో రెండు వారాల్లో రాష్ట్రానికి అందజేయనుంది. ఈ రిపోర్టు కోసమే కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్ ​కూడా వేచి చూస్తోంది. రిపోర్టు ప్రకారం కమిషన్ ​చర్యలను సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×