BigTV English

Mukku Avinash Remuneration: రీ ఎంట్రీలో భారీ డిమాండ్.. అవినాష్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Mukku Avinash Remuneration: రీ ఎంట్రీలో భారీ డిమాండ్.. అవినాష్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Mukku Avinash Remuneration.. ఇన్ఫినిటీ.. లిమిట్ లెస్ అంటూ బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయింది. ముఖ్యంగా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని , ఊహించని టాస్క్ లతో ఆడియన్స్ కి మంచి వినోదం ఉంటుందని, నాగార్జున ముందు నుంచే చెబుతున్నారు. అందులో భాగంగానే 14 మంది హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టారు. అందులో 6 మంది ఐదు వారాలకు గానూ ఎలిమినేట్ అవ్వగా.. మిగతా ఎనిమిది మంది హౌస్ లో ఓజీ క్లాన్ గా ఏర్పడ్డారు. మరొకవైపు వైల్డ్ కార్డు ద్వారా ఎనిమిది మంది హౌస్ లోకి అడుగుపెట్టారు.. అలా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చి తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గేమ్ స్వరూపాన్నే మార్చేశారు.


రూ.10 లక్షలు నష్టపోయిన ముక్కు అవినాష్..

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపించి, అసలు ఆట మొదలైంది అంటూ తెలిపారు. ఇకపోతే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో ముక్కు అవినాష్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పడంలో సందేహం లేదు. జబర్దస్త్ కామెడీ షో తో ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. చిన్న కామెడీ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకుంటూ టీం లీడర్ గా ఎదిగాడు. తన టాలెంట్ ను గుర్తించిన బిగ్ బాస్ టీం నాలుగవ సీజన్ లో పాల్గొనడానికి అవకాశం కల్పించింది. ఆ సమయంలో కామెడీ షో నిర్వహకులతో చేసుకున్న అగ్రిమెంట్ ను క్లోజ్ చేసి రూ .10లక్షలు కట్టి మరీ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు అవినాష్.


సీజన్ -4 లో రూ .15 లక్షల రెమ్యునరేషన్..

అలా హౌస్ లోకి వచ్చిన ఈయన దాదాపు పది వారాలపాటు ఉన్నారు. అప్పట్లో రూ.15 లక్షల వరకు రెమ్యూనరేషన్ లభించింది. ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా, కొన్ని షోలలో కంటెస్టెంట్ గా బిజీగా మారిన ఈయన మంచి ఎంటర్టైనర్ అనిపించుకున్నారు. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ టీం అవకాశాన్ని కల్పించడంతో వెంటనే ఈ కార్యక్రమానికి ఒకే చెప్పేశారు. అలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు అవినాష్. రెండవసారి ఎంట్రీ ఇచ్చిన ఈయనకు బిగ్ బాస్ ఎంత రెమ్యునరేషన్ ఇస్తోంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

వారానికి రూ.5లక్షలు..

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి బిగ్బాస్ మేనేజ్మెంట్ అవినాష్ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆయన డిమాండ్ ను బట్టి చూస్తే ముక్క అవినాష్ ఒక వారం పాటు హౌస్ లో కొనసాగడానికి ఏకంగా 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రీ ఎంట్రీ లో భారీ డిమాండ్ చేస్తున్న ఈయన టైటిల్ గెల్చుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి ఎన్ని రోజులు హౌస్ లో ఉంటారో చూడాలి.

Related News

Bigg Boss 9 Promo : బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ, కళ్యాణ్ చేసింది కరెక్టా?

Bigg Boss 9 Promo: నడుము గిల్లారంటున్న ఇమ్మానుయేల్.. ఇదెక్కడి గొడవ రా బాబు!

Bigg Boss 9 Promo: హిప్పో ఆకలి తీరేనా.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం!

Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Big Stories

×