Elderly couple suicide| తల్లిదండ్రులు వృద్ధులైతే వారి సంతానం ఆస్తుల కోసం వేధిస్తారు. ఇలాంటిదే ఒక ఘటనలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు వారి పిల్లలు నరకం చూపించారు. ఆస్తి ఇవ్వకపోతే వారని దూషించడం, భోజనం పెట్టకుండా పస్తులు పెట్టడం, పలుమార్లు వారిని కొట్టడం కూడా జరిగింది. ఇలా సొంత బిడ్డలు పెట్టే వేధింపులు భరించలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని నాగోర్ ప్రాంతలో చెందిన హజారీ రామ్ బిష్నోయి (70), అతని భార్య ఛావలి దేవి నివసిస్తున్నారు. వీరిద్దరికీ నలుగురు సంతానం. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు చేశారు. అయితే తల్లిదండ్రులకు వద్ద ఎవరూ నివసించడం లేదు. ఇద్దరు కొడుకులు రాజేంద్ర, సునీల్ తల్లిదండ్రుల ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నారు.
పిల్లలందరూ ఆస్తి రాసివ్వమ్మని వేధించడంతో హజారీ రామ్ ఆస్తిలో కొంత తన పేరు మీద పెట్టకొని అంతా బిడ్డల పేరు మీద రాసిచ్చాడు. కానీ కొంచెం ఆస్తితోనే పెద్ద సమస్య వచ్చిపడింది. పిల్లల పేరు మీద మూడు ప్లాట్లు, ఒక కారుని హజారీ రామ్ రాసిచ్చారు. అయితే ముసలితనం కారణంగా తమకు ఒక నీడగా ఉన్న ఒక్క ఇంటిని మాత్రం రాసివ్వలేదు.
దీంతో ఇద్దరు కొడుకులు రాజేంద్ర, సునీల్ వారి భార్యలు రోష్ని, అనీతా.. తల్లిదండ్రలుపై ఆ ఉన్న ఒక ఇంటిని రాసివ్వమని తమకు రాసివ్వమంటే మరొకరు లేదు తమకు రాసివ్వమని ఒత్తిడి చేశారు. మరోవైపు ఇద్దరు కూతుర్లు మంజు, సునీతా కూడా కొడుకులతో పాటు కూతుర్లకు సమానంగా హక్కు ఉంటుంది కాబట్టి.. ఆ ఆస్తి తమ పేరు మీదే రాయాలని గొడవపడ్డారు. ఈ గొడవలు చూసి హజారీ రామ్ తన ఇంటిని ఎవరికీ రాసిచ్చేది లేదని తెగేసి చెప్పాడు. ఇక అక్కడి నుంచి హజారీరామ్, అతని భార్యకు గడ్డుకాలం మొదలైంది.
Also Read: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ
ఇద్దరు కొడుకులు వారికి భోజనం పెట్టడం మానేశారు. పక్కింట్లోనే ఉండే చిన్న కొడుకు సునీల్ ని అడిగితే.. బిచ్చమెత్తుకొని బతకండి అని సమాధానం ఇచ్చాడు. ఇలా కొంతకాలంగా జరుగుతుండగా.. తండ్రిని పట్టుకొని రాజేంద్ర మూడు సార్లు కొట్టాడు. తాను చెప్పింది వినకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఎక్కడ అన్న పేరు మీద ఆస్తి పోతుందని భయపడి సునీల్ తన తండ్రిని ఆస్తి తన పేరు మీదే ఆస్తి రాయాలని చెప్పాడు. కానీ హజారీరామ్ వినకపోయే సరికి సునీల్ కూడా తన తండ్రిని కొట్టాడు. మరోసారి ఇంటికి వచ్చిన ఇద్దరు కూతుర్లు కూడా ఆస్తి రాసివ్వలేదని తిట్టిపోసారు. దీంతో హజారీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించాడు. కానీ అది తెలుసుకున్న వారి పిల్లలు పోలీసుల వద్దకు వెళ్తే.. ప్రాణాలు దక్కవని హెచ్చరించారు.
ఇదంతా చూసి కుమిలిపోయిన హజారీరామ్ భార్య ఛావలా దేవి తన ఇంటి వెనకాల ఉన్న బావి లోకి ఆత్మహత్య చేసుకుంది. కానీ హజారీ రామ్ మాత్రం తనకు జరిగిన అన్యాయం గురించి ఒక ఉత్తరంలో రాసి గోడకు అంటించి.. ఆ తరువాత తాను కూడా భార్య లాగా బావిలోకి చనిపోయాడు. పొరుగింటివారు బావిలో ఇద్దరి మృతదేహాలు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేస్తుండగా.. హజారీ రామ్ రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో తమ బిడ్డలను పెట్టిన వేధింపుల గురించి హజారీరామ్ రాశాడు.
ప్రస్తుతం పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. వృద్ద దంపతుల మరణం కేసులో వారి సంతానం పెట్టిన వేధింపుల గురించి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.