Shoaib Akhtar: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా రేపు జరిగే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ పై పాకిస్తాన్ జట్టుకు చెందిన మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అది మహా యుద్ధం అని వ్యాఖ్యానించారు. కొంతమంది టికెట్లు అమ్ముడు పోలేదని… తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు షోయబ్ అక్తర్. అలాంటి వాళ్లు పెద్ద వెధవలు అంటూ నిప్పులు చెరిగాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలో చాలా మంది భారతీయులు మరణించారు.
Also Read: Asia Cup 2025 : ఆసియా కప్ లో టీమిండియా కు ఎదురు దెబ్బ.. దుబాయ్ నుంచి వచ్చేసిన వాషింగ్టన్ సుందర్
అటు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఒకే రోజున 100 మందిని చంపేసింది ఇండియన్ ఆర్మీ. పహాల్గం సంఘటన నేపథ్యంలో… పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం దాదాపు 20 రోజుల పాటు కొనసాగింది. అయితే ఈ యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు నిర్వహించకూడదని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం భారత క్రికెట్ మండలిని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో… ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రేపు జరిగే మ్యాచ్ నేపథ్యంలో టికెట్లు సేల్ కాలేదని… సగానికి పైగా అలాగే మిగిలి ఉన్నాయని వస్తున్న ప్రచారంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) స్పందించారు. రెండు దేశాల మధ్య మ్యాచ్ నేపథ్యంలో భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయని పేర్కొన్నారు. యుద్ధం తర్వాత ఇండియాతో పాకిస్తాన్ తొలిసారిగా మ్యాచ్ ఆడుతోంది.. ఇది చాలా అద్భుతంగా ఉందన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్టేడియం మొత్తం నిండిపోతుందని కూడా వ్యాఖ్యానించారు. టికెట్లు సేల్ కాలేదని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు అన్నీ సేల్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇది కావాలనే కొంతమంది తప్పుడు ప్రచారం కోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ తో ( Team India vs Pakistan ) మ్యాచ్ జరుగనున్న తరుణంలోనే.. సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav ) సేనకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టుకు సంబంధించిన ఓపెనర్ గిల్ కు గాయం అయింది. ప్రాక్టీస్ చేస్తూండగా.. అతనికి గాయం అయింది. దీంతో రేపటి మ్యాచ్ కు గిల్ ఆడటం డౌట్ అని అంటున్నారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.