Bigg Boss Siri: సిరి హనుమంత్ (Siri Hanumanth)పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఇటీవల కాలంలో సినిమాలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సిరి హనుమంతు బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss 5) కార్యక్రమంలో పాల్గొని టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు. ఇక ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. కానీ ఈమె అదే స్థాయిలో నెగిటివిటీని కూడా మూట కట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత వరుస బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెబ్ సిరీస్, సినిమాలలో నటిస్తున్న సిరి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
పెళ్లి కాకుండా వ్రతం ఏంటీ?
ఇక శ్రావణమాసం కావడంతో సెలబ్రిటీలు ఇప్పటికే వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన హడావిడిని మొదలు పెట్టారని తెలుస్తోంది. తాజాగా సిరి హనుమంత్ కూడా వరలక్ష్మీ వ్రతాన్ని(Varalakshmi Vratam) జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది వరలక్ష్మీ వ్రతం ఈరోజు కాదు వచ్చే శుక్రవారం అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు పెళ్లి కాకుండానే వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ఏంటి అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
శ్రీహాన్ తో కలిసి వరలక్ష్మి వ్రతం చేసిన సిరి..
వరలక్ష్మి వ్రత వేడుకలను సిరి హనుమంతు తన ప్రియుడు శ్రీహాన్(Srihan) తో కలిసి జరుపుకోవడంతో ఈ విధమైనటువంటి కామెంట్ లు వ్యక్తం అవుతున్నాయని చెప్పాలి. ఇలా వీరిద్దరూ జంటగా కూర్చుని వరలక్ష్మి వ్రతం జరుపుకున్నట్టు తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది సిరికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. మనసులో ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటే చాలు మిగతాది అంతా అమ్మ చూసుకుంటుంది అంటూ ఈమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే సిరి గత కొంతకాలంగా శ్రీహాన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే . అయితే ఇటీవల వీరిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది . ఇలా పెళ్లి కాకుండానే సహజీవనం చేయడమే కాకుండా వరలక్ష్మి వ్రతం కూడా చేయడంతోనే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఇక వీరి రిలేషన్ గురించి ఇదివరకు ఇలాంటి ఎన్నో విమర్శలు వచ్చిన ఆ విమర్శలను తాము పట్టించుకోమని క్లారిటీ ఇచ్చారు. విడిపోతామనే భయం ఉంటే రిలేషన్ లో ఉండడం తప్పుకాని, మేము పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలని నిశ్చయించుకున్న తర్వాత రిలేషన్ లో ఉంటే తప్పేంటి అంటూ కూడా ట్రోలర్లకు గట్టి సమాధానం ఇచ్చారు. ఇక ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల శ్రీహన్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
Also Read: Kalpika Ganesh: వింత వ్యాధితో బాధపడుతున్న కల్పిక… పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి?