BigTV English

Bigg Boss prerana : తప్పు తెలుసుకున్న ప్రేరణ.. మాటలతో ఏడ్పించిన బిగ్ బాస్..

Bigg Boss prerana : తప్పు తెలుసుకున్న ప్రేరణ.. మాటలతో ఏడ్పించిన బిగ్ బాస్..

Bigg Boss prerana : వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో ప్రస్తుతం ఎనిమిదోవ సీజన్ జరుగుతుంది.. మరో నాలుగు రోజుల్లో ఆ ఎపిసోడ్ కూడా పూర్తి అవుతుంది. ఆదివారం బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. దాంతో ఈ సీజన్ పూర్తి అవుతుంది. ఈ సీజన్ ఎండ్ అవ్వడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. విన్నర్ ఎవరు అనే ఆసక్తి జనాల్లో మొదలైంది. బిగ్ బాస్ గురించి ఏ చిన్న వార్త వచ్చిన వదలట్లేదు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ పై ఆడియన్స్ కు మరింత క్యూరియాసిటిని పెంచేందుకు ఈ వారం సీరియల్స్ ప్రమోషన్స్ చేశారు. ఇక నిన్న ఈరోజు హౌస్ మేట్స్ బిగ్ బాస్ జర్నీ av లని చూపించారు. తన జర్నీ వీడియోను చూసి ఏడ్చేసిన ప్రేరణ.. ఆ వీడియోలో ఏముందంటే..


ఫైనల్‌ వీక్‌లో టాప్‌ 5 కంటెస్టెంట్లు ఆడుతూపాడుతూ గడిపేస్తారు. అలాగే తమ జర్నీ వీడియోలు చూసుకుని మురిసిపోతుంటారు. అయితే సగం వారం అయిపోయాకగానీ ఈ జర్నీ వీడియోలు ప్లాన్‌ చేయలేదు బిగ్‌బాస్‌.. ఇప్పుడు ఇలా చెయ్యడం ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. శుక్రవారం ఎపిసోడ్ లో నిఖిల్, ప్రేరణ, నబీల్ ఏవిలను బిగ్ బాస్ రిలీజ్ చేసింది. ప్రేరణ జర్నీ వీడియో బాగా ఆకట్టుకుంది. వీడియో రాగానే గార్డెన్ ఏరియాలోకి వచ్చిన ప్రేరణ అక్కడ సెటప్ చూసి మొదట మురిసిపోతుంది. హౌస్ లో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. సందర్భానికి తగ్గట్లు మాట్లాడుతావు. అలాగే చిన్న పిల్లలాగా మారిపోతావు.. ఓటమిని చివరి వరకు వచ్చిన ఒప్పుకోలేదు.. అదే నిన్ను ఈ స్థాయిలో నిల్చొనేలా చేసిందని బిగ్ బాస్ అంటాడు. పట్టుదల తో మెగా చీఫ్ అయ్యారు. అదే మిమ్మల్ని గొడవల్లోకి నెట్టేసిందని బిగ్ బాస్ అన్నారు..

కొన్ని సందర్భాల్లో సరిగ్గా వ్యవహరించలేక వరస్ట్ మెగా చీఫ్ అయ్యారు. ప్రేరణ భావోద్వేగానికి లోనైంది. పసిపాపలా హౌస్‌లో అడుగుపెట్టావ్‌.. పెళ్లి దేనికీ అడ్డుకాదని, పెళ్లయిన మహిళలు కూడా ఎంతో సాధించవచ్చని ఎంతోమందికి ప్రేరణగా నిలిచావంటూ బిగ్‌బాస్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇంటి సభ్యుల దృష్టిలో వరస్ట్‌ మెగా చీఫ్‌ కానీ నా దృష్టిలో మాత్రం బెస్ట్‌ మెగా చీఫ్‌ అని చెప్పడంతో ప్రేరణ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.. పెళ్ళైన వాళ్ళు కూడా రావొచ్చు అని ఆదర్శంగా నిలిచావు అని బిగ్ అంటాడు. దానికి ఫైనలిస్ట్ లోకి వచ్చిన తొలి మహిళ అవుతాను అని చెబుతుంది. బిగ్ బాస్ ఆల్ బెస్ట్ చెబుతాడు. ఫైనల్ వరకు వెళ్తానని మాట ఇస్తున్న బిగ్ బాస్.. ఈ వీడియో చూశాక చాలా నేర్చుకున్నాను ఇక ఎలా ఉండాలో తెలిసిందని ప్రేరణ అంటుంది. బిగ్ బాస్ ఎమోషనల్ వర్డ్స్ వినగానే ఏడ్పును ఆపుకోలేక పోయింది.. మనసారా ఏడ్చేసింది. ఆ వీడియో ఎపిసోడ్ కు హైలెట్ అయ్యింది..


Tags

Related News

Bigg Boss Agni Pariksha: అగ్ని పరీక్షకు ఎంపికైంది వీరే.. రేయ్ ఎవర్రా మీరంతా?

Bigg Boss season 9: బిగ్ బాస్ హౌస్ కి ఆ స్టార్ డైరెక్టర్, ఇదేమి ఖర్మ సామీ?

Bigg Boss season 9 : బిగ్ బాస్ అగ్నిపరీక్షలో నవదీప్ ఆవేశం, జడ్జ్ గా స్టార్ డైరెక్టర్ లీకైన వీడియో

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Big Stories

×