BigTV English

Prerana: బిగ్ బాస్ లోకి రష్మిక క్లోజ్ ఫ్రెండ్..

Prerana: బిగ్ బాస్ లోకి రష్మిక క్లోజ్ ఫ్రెండ్..

Prerana: బిగ్ బాస్ సీజన్ 8 మొదలయ్యింది. కంటెస్టెంట్స్ ను చూసి ఫ్యాన్స్ షాక్ అవ్వడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు వెళ్లిన నలుగురు కంటెస్టెంట్లు ప్రేక్షకులకు తెలిసినవారే కావడంతో కొంత రిలీఫ్ ఉంది. కకృష్ణ ముకంద మురారి సీరియల్ లో హీరోయిన్స్ గా నటించిన ప్రేరణ, యష్మీ  హౌస్ లోకి మొదటి,నాలుగు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టారు. ఇక వీరికి పార్ట్నర్స్ గా నటుడు అభయ్, సీరియల్ హీరో నిఖిల్ సెలెక్ట్ అయ్యారు.


ఇక అభయ్.. సెలెక్ట్ చేసుకున్న ఎల్లో కలర్ లో ప్రేరణ ఉండడంతో ఆమె అభయ్ కు పార్ట్నర్ గా మారింది. ఇక ప్రేరణ రావడం రావడమే.. మంచి డ్యాన్స్ నంబర్స్ తో అదరగొట్టింది. ప్రేరణ.. ఒకే ఒక్క సీరియల్ తో  ఫేమస్ అయిన ప్రేరణ.. షోస్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. ఈ మధ్యనే ఈ చిన్నదానికి పెళ్లి అయ్యింది.

ఇక స్టేజిమీద నాగ్ తో పులిహోర కలిపినా ప్రేరణ.. ఎవరికి తెలియని ఒక విషయాన్నీ చెప్పుకొచ్చింది. తాను, హీరోయిన్ రష్మిక మందన్నా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని, ఎన్నో అల్లరి పనులు చేసినట్లు తెలిపిన ప్రేరణ.. ఇప్పుడు రష్మిక పెద్ద పొజిషన్ కు వెళ్లడం హ్యాపీ గా ఉందని తెలిపింది.


ఒకరాత్రి.. లగేజ్ మోయడం ఇద్దరివలన కాలేదని ఒక మెమొరీని పంచుకుంది. ఇక అభయ్ వచ్చేలోపు.. ప్రేరణతో నాగ్.. ఒక రొమాంటిక్ గేమ్ ఆడించాడు. 8 నెలల కాపురంలో ప్రేరణ తన భర్తను ఎలా అర్ధం చేసుకుందో చెప్పమని ప్రశ్నలు అడిగాడు. ఆ ప్రశ్నలకు ప్రేరణ కరెక్ట్ ఆన్సర్లు చెప్పడంతో నాగ్.. అభయ్ ను పిలిచి జంటగా లోపలి పంపారు. మరి ప్రేరణకు రష్మిక ఫ్యాన్స్ సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ప్రేరణ టాప్ 5 లో నిలిస్తుందేమో చూడాలి.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×