Priyanka Jain: ప్రియాంక జైన్.. ప్రముఖ బుల్లితెర నటిగా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది. బుల్లితెరపై ‘మౌనరాగం’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె ఇందులో మాటలు రాని అమ్మాయిగా సహజ నటనతో అందరిని కట్టిపడేసింది. ఈ సీరియల్ తో తెలుగులో భారీ పాపులారిటీ అందుకున్న ప్రియాంక జైన్ (Priyanka Jain) ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ తో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఇమేజ్ తో ఏకంగా బిగ్ బాస్ రియాల్టీ షోలో అడుగు పెట్టింది ప్రియాంక. అలా సీజన్ 7 లో పాల్గొని తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె.. టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచింది. టాప్ 3 వరకు వెళ్ళిన ప్రియాంక టైటిల్ విన్నర్ మాత్రంకాలేక పోయింది.
మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంటున్న ప్రియాంక..
ఒక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు శివ (Siva) తో కలిసి పలు రీల్స్ చేస్తూ తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆ రీల్స్ తో అప్పుడప్పుడు నెటిజన్స్ ఆగ్రహానికి కూడా గురవుతోంది. మొన్నా మధ్య తిరుపతిలో టైగర్ వచ్చింది అంటూ ఫ్రాంక్ చేసిన ఈ జంట.. ఆ తర్వాత పుష్కరాల సమయంలో ప్రయాగ్ రాజ్ లో ఫోటోలు షేర్ చేసి మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు మరొకసారి ప్రియాంక చేసిన పనికి నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రియుడికి పెళ్లి ప్రపోజల్..
ప్రియాంక జైన్.. తన ప్రియుడు శివతో సహజీవనం కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పైగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లెప్పుడు చేసుకుంటారు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సీరియల్స్ లో పద్ధతిగా కనిపించిన ఈమె.. ఇక్కడ గ్లామర్ ఒలకబోస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్స్ ట్రోల్స్ ఎదుర్కొనేలా చేస్తోందని చెప్పవచ్చు.
వీడియో విషయానికి వస్తే.. తన బాయ్ ఫ్రెండ్ శివను పెళ్లి చేసుకోమని అడగడానికి భారీగానే ప్లాన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక రిసార్ట్లో “విల్ యు మ్యారీ మీ” అంటూ చాలా అందంగా డెకరేట్ చేసి మరీ.. తన బాయ్ ఫ్రెండ్ ఎదుట మోకాళ్ళ పైన కూర్చొని.. డైమండ్ రింగ్ ఇస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ అడిగిన తీరు చూడడానికి ముచ్చటగానే ఉన్నా.. చూసిన నెటిజన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంత ఓవరాక్షన్ అవసరమా – నెటిజన్స్
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ అవ్వడంతో పెళ్లి చేసుకోమని అడగడానికి ఇంత ఓవరాక్షన్ అవసరమా? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎలాగో నీ బాయ్ ఫ్రెండే కదా.. పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారు కదా.. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి ఇంత ఓవరాక్షన్ అవసరమా? అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే తన లవ్ ను పెళ్లిగా మార్చుకోవాలని ఏదో ప్రియాంక ప్రయత్నం చేసిన ఇప్పుడు.. ఈమెపై ఇప్పుడు ట్రోల్స్ మాత్రం భారీగా పేలుతున్నాయని చెప్పవచ్చు. మరి దీనిపై ప్రియాంక జైన్, అటు శివ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
ALSO READ:Kalpika Ganesh: హీరోయిన్ కల్పికపై అబ్యూసింగ్ కేస్.. ఈ సారి బయటకు వచ్చే ఛాన్సే లేదు!
?utm_source=ig_web_copy_link