Case on Kalpika:ప్రముఖ నటి కల్పిక గణేష్ పై మరో కేసు నమోదయింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇంస్టాగ్రామ్ అకౌంట్లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించింది అంటూ బాధితురాలు కీర్తన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆన్లైన్ అబ్యూజింగ్ తో పాటు వేధింపులకు కూడా పాల్పడుతోందంటూ ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఇక సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకోవడంతో పాటు బాధితురాలికి మెసేజ్ పెట్టి కల్పిక గణేష్ చాలా వల్గర్ గా మాట్లాడిందట. ఇన్ బాక్స్ మెసేజ్లను, స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను పోలీసులకు బాధితురాలు కీర్తన సమర్పించింది. దీంతో రంగంలోకి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 67 ITA 2000-2008,79,356 BNS ప్రకారంగా కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఇక కల్పిక బయటికి రావడం కష్టమే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
పబ్ లో గొడవ.. ఇప్పటికే కేస్ ఫైల్..
సినీ నటి కల్పిక గణేష్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా వివాదంలో చిక్కుకుంది.హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం పబ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా కేక్ విషయంలో మొదలైన ఆ చిన్నపాటి వివాదం తీవ్ర స్థాయికి చేరి, చివరికి పోలీస్ కేసు వరకు వెళ్ళింది.అసలు విషయంలోకి వెళ్తే.. గత నెల 29వ తేదీన కల్పిక ప్రిజం పబ్ కి వెళ్లారు. రూ.2200 బిల్లు చేసి కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వమని కోరారట. అయితే అలా ఇవ్వడం కుదరని మేనేజర్ చెప్పారు. ఈ విషయంలో కల్పిక గణేష్ కి, పబ్ సిబ్బందికి మధ్య కాస్త వివాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో నటి కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించింది అని పబ్ యాజమాన్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టడం ఇవన్నీ చేసిందని సదరు మేనేజర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.
పబ్ కేసు పై స్పందించిన కల్పిక..
పబ్ కేస్ పై కల్పిక స్పందించింది. ఒక కేక్ విషయంలో తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. డ్రగ్ అడిక్ట్ అంటూ దూషించారని, ఈ క్రమంలోనే సిబ్బందితో వాగ్వాదం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కల్పిక ఆరోపించారు.
కల్పిక నటించిన సినిమాలు..
కల్పిక సినిమాల విషయానికొస్తే.. ప్రయాణం, మా వింత గాధ వినుమా, సారొచ్చారు, యశోద వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇక ఇప్పుడు అవకాశాలు లేక సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా రచ్చ చేసింది అని నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఏకంగా 2 కేసులు ఈమెపై ఫైల్ అవ్వడంతో ఇక ఈమె బయటికి రావడం కష్టమే అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Rana Daggubati: ఆరోగ్య సమస్యలపై రానా స్పందన.. ఈ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదుగా?