BigTV English

Bigg Boss 9 : బిగ్ బాస్ లోకి సీరియల్ హీరోయిన్.. హుగ్గులు, ముద్దులే..?

Bigg Boss 9 : బిగ్ బాస్ లోకి  సీరియల్ హీరోయిన్.. హుగ్గులు, ముద్దులే..?

Bigg Boss 9 : బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగు లో 8 సీజన్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్ తో పోలిస్తే తొమ్మిదో సీజన్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తూస్తున్నారు.. అయితే బిగ్ బాస్ 9 ఒక నెల ముందుగానే రాబోతుందని గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. తొమ్మిదో సీజన్ లో ఓన్లీ సెలబ్రిటీలు మాత్రమే ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. సీరియల్, సినిమాలలో క్రేజ్ ను సంపాదించుకున్న యాక్టర్స్ ను నిర్వాహకులు దించబోతున్నారని సమాచారం.. ఇప్పటికే సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది . అందుతున్న సమాచారం ప్రకారం మరో సీరియల్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.. ఆమె ఎవరు అన్నది తెలుసుకుందాం..


హౌస్ లోకి సీరియల్ బ్యూటీ..?

బిగ్ బాస్ 9 లో కొత్తవాళ్లకు చోటులేదు.. కేవలం అందరికి తెలిసిన వాళ్ళే రాబోతున్నారు. రీతూ చౌదరి, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, అలేఖ్య చిట్టి పికెల్స్ రమ్యలు ఖచ్చితంగా హౌస్‌లోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా బుల్లితెర నటి సత్యభామ సీరియల్ ఫేమ్ దేబ్జానీని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈమెతో బిగ్‌బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. స్టార్ మాలో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామ తదితర సీరియల్స్‌తో ఈ ముద్దుగుమ్మ తెలుగువారికి పరిచయమయ్యారు. ప్రస్తుతం స్టార్ మా లోనే ప్రసారం అవుతున్న కిర్రాక్ బాయ్స్ – ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో పార్టీస్పెట్ చేస్తుంది. మొన్న ఇమ్మానుయేల్ కు లైవ్ లో ముద్దు పెట్టేసింది. ఇక బిగ్ బాస్ లో ఎలా ఉంటుందో చూడాలి..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మూవీ లవర్స్ పండగే..

బిగ్ బాస్ లో సరికొత్త హంగులు..? 

గత సీజన్లతో పోలిస్తే ఈ తొమ్మిదో సీజన్లో మార్పులు జరిగినట్లు తెలుస్తుంది. బిగ్‌బాస్ తెలుగు 8లో కెప్టెన్‌కు బదులు చీఫ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే చీఫ్‌కు ఇద్దరు డిప్యూటీ చీఫ్‌లను కూడా ఇచ్చారు. ఈ విధానం బాగానే వర్కవుట్ అయ్యింది. అలాగే ప్రైజ్‌మనీ సున్నాతో ప్రారంభించి.. కంటెస్టెంట్సే తమ ప్రైజ్‌మనీని సంపాదించుకోవాలనే నిబంధన తీసుకొచ్చి సస్పెన్స్ కంటిన్యూ చేశారు. ఇది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఉల్టా ఫల్టా అనేది కూడా పెద్దగా నచ్చలేదు. బ్యాచ్ లుగా సీరియల్స్ వాళ్లు ఉన్నారు. కానీ ఈసారి వాటిని పూర్తిగా మార్చేస్తున్నట్లు సమాచారం. ఈసారి బిగ్‌బాస్ టీమ్ కంటెస్టెంట్స్‌ ఎంపిక ప్రక్రియ కాస్త ముందుగానే ప్రారంభించినట్లుగానే పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చేనెలలో కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉందని టాక్. ఆగస్టు లో షో ప్రారంభం కానుంది. ఈ సారి సినిమా యాక్టర్స్ ఎక్కువగా ఉండేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందట.. ప్రైజ్ మనీ కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ఈ సీజన్ లో కొత్త టాస్క్ లు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×