BigTV English

OTT Movie : ఇంజనీరింగ్ కాలేజ్ లో బ్లాక్ మ్యాజిక్‌ విన్యాసాలు… పరకాయ ప్రవేశంతో గందరగోళం… ఓటీటీలోకి కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : ఇంజనీరింగ్ కాలేజ్ లో బ్లాక్ మ్యాజిక్‌ విన్యాసాలు… పరకాయ ప్రవేశంతో గందరగోళం… ఓటీటీలోకి కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : ఒక కాలేజ్ క్యాంపస్‌లో, నలుగురు  విద్యార్థులు జితిన్, రమ్జాద్, కన్నన్, నకుల్  సూపర్‌హీరో ఫాంటసీలలో మునిగి, సమయాన్ని సరదాగా గడుపుతుంటారు.  అయితే ఈ  కాలేజ్‌లో కొత్తగా వచ్చిన ప్రొఫెసర్ రంజిత్ (షరఫుద్దీన్) వీళ్ళ ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తాడు. రంజిత్‌ దగ్గర ఒక లూడో లాంటి వింత బోర్డు గేమ్ ఉంటుంది.  ఇది బ్లాక్ మ్యాజిక్‌తో నిండిన అతీంద్రియ శక్తులను కలిగి ఉంది. ఈ విషయం తెలిసిన నలుగురు స్నేహితులు ఈ బోర్డు గేమ్‌ను దొంగిలించి నాశనం చేయాలని నిర్ణయిస్తారు. కానీ ఈ చర్య వారిని ఒక అతీంద్రియ గందరగోళంలోకి నెట్టివేస్తుంది.  ఇక్కడ శరీరాలు మారిపోతాయి, మనసులు నియంత్రించబడతాయి, రంజిత్ నిజమైన ఉద్దేశాలు బయటపడతాయి. ఈ నలుగురు బ్లాక్ మ్యాజిక్‌ బాక్స్ నుంచి బయటపడతారా ? ఆ గేమ్ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో జరుగుతుంది. ఇక్కడ కామిక్ స్టోరీలను ఇష్టపడే నలుగురు జితిన్ (సందీప్ ప్రదీప్), రమ్జాద్ (అరుణ్ ప్రదీప్), కన్నన్ (సాఫ్ బాయ్), నకుల్ (అరుణ్ అజికుమార్) విద్యార్థులు ఉంటారు. వీళ్ళు ఫస్ట్ బెంచర్స్‌గా ఉంటూనే, సూపర్‌హీరోలైన గ్రీన్ లాంటర్న్, బాట్‌మాన్‌లను అభిమానిస్తుంటారు. జితిన్ తన ప్రియురాలు జీవిక (నీరజన అనూప్)తో విడిపోవడంతో బాధగా ఉంటాడు. ఆమె వ్యక్తిగత విభేదాల కారణంగా బ్రేకప్ చేస్తుంది. ఇదే సమయంలో కాలేజ్‌లో ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (HOD) స్థానం కోసం స్ట్రైక్ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుత HOD నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కుంటాడు.


ఈ క్యాంపస్ గందరగోళంలోకి కొత్త ప్రొఫెసర్ రంజిత్ (షరఫుద్దీన్) ఎంట్రీ ఇస్తాడు. అతను పైకి మంచివాడిలా ఉంటూ, లోపల దురుద్దేశాలతో ఉంటాడు. జితిన్, అతని స్నేహితులు రంజిత్ ఒక వింత బోర్డు గేమ్‌ను ఉపయోగిస్తున్నట్లు గమనిస్తారు. ఇది లూడో లాంటిది కానీ బ్లాక్ మ్యాజిక్ శక్తులను కలిగి ఉంటుంది. దీనితో అతను ఇతరుల మనసులను నియంత్రిస్తాడు. రంజిత్ మరొక ప్రొఫెసర్ షాజీ (సురాజ్ వెంజరమూడు)ని నియంత్రిస్తున్నాడని వాళ్ళు అనుమానిస్తారు. ఈ బోర్డును దొంగిలించి నాశనం చేయాలని నలుగురు స్నేహితులు ఒక నిర్ణయానికి వస్తారు. దానిని స్వాధీనం చేసుకున్నప్పుడు వారి జీవితాలు తలక్రిందులవుతాయి. ఈ గేమ్ వల్ల వీరి శరీరాలు మారిపోతాయి. జితిన్, రంజిత్, షాజీల మధ్య ఒక ‘పరకాయ ప్రవేశం’ (బాడీ స్వాప్) జరుగుతుంది. ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు.

ఈ గందరగోళంలో, షాజీ భార్య శోభ (పూజ మోహన్‌రాజ్) వైవాహిక సమస్యలు, జితిన్-జీవిక మధ్య లవ్ స్టోరీ, నలుగురు స్నేహితులు రంజిత్ యొక్క దురుద్దేశాలను, HOD స్థానం కోసం అతని కుట్రలను బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ చర్యలు ఒక ఊహించని మలుపుకు దారి తీస్తాయి. చివరికి ఈ బ్లాక్ మ్యాజిక్ గేమ్‌ వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? పరకాయ ప్రవేశం వల్ల ఏం ఘోరాలు జరుగుతాయి ? వీళ్ళంతా మ్యాజిక్ బాక్స్ నుంచి బయటపడతారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : సైకాలజిస్ట్ నే తికమక పెట్టే సస్పెన్స్ థ్రిల్లర్ … సీను సీనుకూ గుండెలు అదరాల్సిందే

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు ‘పడక్కలం’ (Padakkalam). ఈ సినిమాకి మను స్వరాజ్ దర్శకత్వం వహించారు. 2025 మే 8 న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. జూన్ 10 నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్‌స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 2 గంటల 3 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 7.4/10 రేటింగ్ ఉంది. ఇందులో సందీప్ ప్రదీప్ (జితిన్/రంజిత్), సురాజ్ వెంజరమూడు (షాజీ/జితిన్), షరఫుద్దీన్ (రంజిత్/షాజీ), నీరజన అనూప్ (జీవిక), పూజ మోహన్‌రాజ్ (శోభ), అరుణ్ ప్రదీప్ (రమ్జాద్), సాఫ్ బాయ్ (కన్నన్), అరుణ్ అజికుమార్ (నకుల్), విజయ్ బాబు (డాక్టర్ S షమీర్ – కామియో) వంటి నటులు నటించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×