EPAPER

Shekhar Bhasha: అతడు తల్లి చావుతో లాభం పొందాలనుకున్నాడు.. శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్

Shekhar Bhasha: అతడు తల్లి చావుతో లాభం పొందాలనుకున్నాడు.. శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్

Bigg Boss Buzz Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 నుండి రెండోవారం శేఖర్ భాషా ఎలిమినేట్ అయిపోయాడు. మొదటివారంలో ఎలిమినేట్ అయిపోయిన బేబక్కతో కలిసి బడ్డీగా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆ బడ్డీలు ఇద్దరూ హౌజ్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. కానీ శేఖర్ భాషా మాత్రం ప్రేక్షకుల వల్ల ఎలిమినేట్ అవ్వలేదు. హౌజ్‌మేట్స్ అంతా కలిసి ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌజ్‌లో ఉండడానికి అర్హుడు అని, శేఖర్ భాషా కాదు అని తనను బయటికి పంపించేశారు. బయటికి వచ్చిన తర్వాత ముందుగా అర్జున్‌తో కలిసి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు శేఖర్ భాషా. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


కంటెస్టెంట్స్‌పై జోకులు

‘‘ఒకవేళ మీకు పెళ్లి కాకపోయింటే సింగిల్ అయ్యింటే హౌజ్‌లో ఎలా ఉండేవారు’’ అంటూ అర్జున్ అడిగే చిలిపి ప్రశ్నతో బిగ్ బాస్ బజ్ ప్రోమో ప్రారంభమయ్యింది. ‘‘పనిచేసే చోట పనిచేయకూడదు అన్నట్టు’’ అని తన స్టైల్‌లో స్పందించాడు శేఖర్ భాషా. ‘‘హౌజ్‌లో కంటెస్టెంట్స్ పేర్లు చెప్తుంటాను. వారి గురించి చిన్న జోక్ చెప్పాలి’’ అంటూ శేఖర్ భాషాను కోరాడు అర్జున్. ‘‘మీ శత్రువు కాని శత్రువు సోనియా’’ అనగానే ‘‘సో.. నియా.. అంటే నిద్రపోనియ్యా’’ అన్నాడు శేఖర్ భాషా. పృథ్వి పేరు చెప్పగానే.. ‘‘చాలామంది కన్నడ రాదు కదా. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఎవరికైనా వచ్చేస్తుంది. ఎలా అంటే.. కనడం.. పిల్లల్ని కనడం వస్తుంది కదా’’ అని తన కుళ్లు జోకులను మరోసారి ఆడియన్స్‌ను నవ్వించాడు.


Also Read: శేఖర్ భాషా అవుట్.. కలిసికట్టుగా గెంటేసిన హౌజ్‌మేట్స్, వెళ్లేముందు వారికి ఫేక్ సర్టిఫికెట్

సేఫ్ గేమ్

‘‘హౌజ్‌లో ఆదిత్య ఓంను గుడ్డిగా నమ్మారని నాకు అనిపించింది’’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు అర్జున్. దానికి సమాధానంగా ‘‘ఆది ఒక సేఫ్ గేమ్ ఆడదామనుకున్నట్టు ఉన్నాడు’’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ భాషా. ‘‘ఆయన మిమ్మల్ని నామినేట్ చేస్తాడని మీరు కూడా ఊహించలేదా?’’ అని అర్జున్ ప్రశ్నించాడు. ‘‘ఆయన నన్ను రెండోసారి నామినేషన్ చేసినప్పుడు కూడా నేను ఆయనను చేసేవాడిని కాదు. కానీ నేనేమైనా మిలిటరీ క్యాంప్‌కు వచ్చానా? క్రమశిక్షణతో ఉండడానికి’’ అంటూ ఆదిత్య ఓం నామినేషన్స్‌లో చేసిన కామెంట్స్‌పై స్పందించాడు శేఖర్ భాషా. ‘‘మీరు నామినేషన్స్‌లో ఆదిత్య ఓంతో ఒక మాట అన్నారు. మీరు నన్ను నామినేట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మీరు విలన్ అవుతారు. నా మీద సింపథీ పెరుగుతుంది అన్నారు. కట్ చేస్తే.. మీరు హౌజ్‌లో విలన్ అయ్యి బయటికి వచ్చారు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు అర్జున్.

అదే మనస్థత్వం

అర్జున్ స్టేట్‌మెంట్‌కు శేఖర్ భాషా ఒప్పుకోలేదు. ‘‘నేను విలన్ అవ్వలేదు. హీరోగానే బయటికి వచ్చాను’’ అన్నాడు. మణికంఠ గురించి మాట్లాడుతూ.. ‘‘తండ్రి చావు, తల్లి చావు.. వీటి గురించి చెప్పి గేమ్‌లో లాభం పొందాలనుకుంటున్నారా అనిపిస్తుంది’’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సోనియా గురించి చెప్తూ.. ‘‘నేను చెప్పిందే నడవాలి అనే మనస్థత్వం. చిన్న విషయాన్ని పెద్దగా చేసి, వారిని చెడుగా చూపించడం తన మనస్థత్వం’’ అని అన్నాడు. సోనియా, పృథ్వి, నిఖిల్ రిలేషన్‌షిప్‌పై స్పందిస్తూ.. ‘‘ఎందుకురా ఇంత ఫ్యామిలీ, సెంటిమెంట్, డ్రామా అవసరమా అనిపిస్తుంది’’ అని తెలిపాడు. చివరిగా తన కొడుకు ఫోటోను సర్‌ప్రైజ్‌గా ఇచ్చాడు అర్జున్. అది చూసి శేఖర్ భాషా ఎమోషనల్ అయ్యాడు.

Related News

Bigg Boss 8 Day 44 Promo1: నామినేషన్ రచ్చ.. తారస్థాయికి చేరిన గొడవ..!

Bigg Boss 8 Telugu: సొంత మనుషులే ప్రేరణకు వెన్నుపోటు, మణికంఠకు అన్యాయం.. అందరూ కలిసి తేజను గట్టెంక్కిచారుగా!

Bigg Boss Sita : బిగ్ బాస్ నుంచి బయటకొచ్చినా ఆ కోరిక తీరలేదని సీత ఎమోషనల్..

Bigg Boss: ఏడవ వారం నామినేషన్స్ జాబితా.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..!

Bigg Boss 8 Telugu: నయని నోరుమూయించిన గంగవ్వ, ప్రేరణపై పగపట్టి న పృథ్వి.. ఈసారి నామినేషన్స్ అదుర్స్

Bigg Boss 8 Day 43 Promo 1: గౌతమ్ ఇక మారవా.. యాంగ్రీ మెన్ గా మారిన కూల్ పర్సన్..!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో మరో రచ్చ.. అతడు నామినేట్ చేస్తే ఎలిమినేట్?

Big Stories

×