IDENTITY Teaser: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగు, తమిళ్, మలయాళ భాషలను ఏది వదలకుండా మంచి అవకాశాలను అందిపుచ్చుకొని హిట్స్ కొడుతోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. తెలుగులో చిరు సరసన విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఇక తమిళ్ లో లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ కు త్రిష బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ మధ్యనే గోట్ సినిమాలో ఒక చిన్న క్యామియోలో కనిపించి అదరగొట్టింది.
ఇక మలయాళంలో త్రిష నటిస్తున్న చిత్రం ఐడెంటిటీ. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అఖిల్ పాల్ – అనాస్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వినయ్ రాయ్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఐడెంటిటీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ను బట్టి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. ఇందులో వినయ్ రాయ్ పోలీస్ గా కనిపిస్తుండగా.. టోవినో స్కెచ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నాడు.
Sobhita Dhulipala: పెళ్లి కూతురిగా శోభితా.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో
” మొదట అతని ముఖాన్ని రఫ్ గా గీద్దాం” అని టోవినో.. త్రిషకు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. త్రిష.. ఒకక్రైమ్ ను చూస్తుంది. ఆ క్రైమ్ ను చేసిన వారిని గుర్తుపట్టే ప్రాసెస్ లో అతడి స్కెచ్ గీయడానికి పోలీసులకు హెల్ప్ చేస్తున్నట్లు టీజర్ లో చూపించారు. క్రైమ్ జరిగి చాలా రోజులు అయిపోయింది కదా.. గుర్తుచేసుకోవడానికి టైమ్ తీసుకోమని టోవినో చెప్పినా.. త్రిష మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అతడి ముఖం గుర్తుపట్టినట్లు చెప్తుంది.
టీజర్ మొత్తం త్రిష.. ఆ హంతకుడు గురించి మాట్లాడుతున్నదే చూపించారు. ఇంకోపక్క ఆమె చెప్పిన పోలికలతో ఉన్న మనుషులను చూపిస్తూ.. కిల్లర్ ఎవరు.. ? అనే క్యూరియాసిటీని పెంచారు. ఇక మొదటి నుంచి వినయ్ రాయ్ ను నార్మల్ డ్రెస్ లలో చూపించి చివరికి పోలీస్ డ్రెస్ లో చూపించి షాక్ ఇచ్చారు. అసలు త్రిష చూసిన క్రైమ్ ఏంటి.. ? దానికి, వినయ్ రాయ్ కు సంబంధం ఏంటి.. ? మధ్యలో టోవినో పాత్ర ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Nagababu: మెగా ఫ్యాన్స్ కు నాగబాబు విజ్ఞప్తి.. పుష్ప 2 ను ఆదరించండి
త్రిషకు ఇలాంటి సినిమాలు కొత్త కాదు. ఇక టోవినో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మంచి కథలను వెతికి పట్టుకోవడంలో టోవినో ఎప్పుడుముందే ఉంటాడు. ఈ ఏడాది ఏఆర్ఎమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. మలయాళంలో మంచి పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు ఐడెంటిటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజర్ కూడా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ మలయాళంలోనే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో త్రిష ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.