BigTV English

Jayam Ravi: విడాకుల కేసు.. కౌన్సిలింగ్ కు హాజరైన జయం రవి దంపతులు

Jayam Ravi: విడాకుల కేసు.. కౌన్సిలింగ్ కు హాజరైన జయం రవి దంపతులు

Jayam Ravi: ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత త్వరగా అవుతున్నాయో విడాకులు కూడా అంతే త్వరగా అయిపోయితున్నాయి. ఇంకా చెప్పాలంటే విడాకులు తీసుకోవడం ట్రెండ్ గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు సైతం తమ భార్యలతో విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ల మీద షాకులు ఇస్తున్నారు. ఇక గత కొన్నిరోజుల క్రితం కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.


15 ఏళ్ల కాపురం తరువాత జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే ఈ విడాకుల విషయం తనకు తెలియదని, తన అనుమతి లేకుండా  విడాకులు ప్రకటించడాని భర్త జయం రవిపై ఆర్తి  ఫైర్ అయిన విషయం కూడా విదితమే. ఇక ఈ విడాకుల కేసు కోర్టుకు కూడా వెళ్ళింది. కానీ, కోర్టు మాత్రం జయం రవికి షాక్ ఇచ్చింది. వెంటనే విడాకులు ఇవ్వడం కుదరదని, ఇద్దరు భార్యాభర్తలు కౌన్సిలింగ్  లో పాల్గొనాలని సూచించింది.

Samantha: శోభితా టెంపరరీ రా.. సమంత పర్మినెంట్.. అది ఆమె రేంజ్


కొన్నిరోజులు ఈ జంటను కలిసి ఉండమని, రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించమని చెప్పింది. ఇక కోర్టు చెప్పిన విధంగానే జయం రవి, ఆర్తి రెండుసార్లు కౌన్సిలింగ్ లో పాల్గొన్నారు.  అయినా కూడా తమకు ఈ బంధం వర్క్ అవుట్ అవ్వడం లేదని తెలుపడంతో.. మరోసారి కోర్టు వీరికి ఇంకాస్త  గడువును ఇచ్చింది. ఈ కేసును వచ్చేనెల 18 కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఈలోపు మరోసారి మాట్లాడుకోవాలని తెలిపింది.

అయితే అంతకుముందులా మొక్కుబడిగా కాకుండా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలని సలహా ఇచ్చింది. దీంతో జయం రవి, ఆర్తి ఇంకోసారి విడాకుల గురించి మాట్లాడుకోనున్నారు. ఈ జంట తిరిగి కలవాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రవి హీరోగా నటించిన మొదటి సినిమా జయం. తెలుగులో నితిన్ నటించిన జయంకు రీమేక్. ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రవి ఇంటిపేరుగా మారింది. ఆ తరువాత కోలీవుడ్ లో మంచి మంచి సినిమాలతో స్టార్ హీరోగా మారాడు జయం రవి.

Govindh Naamdev : 31 ఏళ్ల యువతితో వివాహం.. క్లారిటీ ఇచ్చిన గోవింద్..!

2019 లో ఆర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రవి. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక జయం రవి విడాకులు ఇవ్వడానికి కారణం ఒక సింగర్ తో ఎఫైర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కోసమే ఈ హీరో  భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని టాక్. ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ హీరో చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది  సైరన్, బ్రదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జయం రవి అంతగా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాడు.

ఇక ఈ మధ్యనే ఆకాశం నీ హద్దురా సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిన సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో జయం రవి ఒక హీరోగా నటిస్తున్నాడు. శివ కార్తికేయన్, అధర్వ లతో ఈ సినిమా  మల్టీస్టారర్ గా తెరకెక్కనుంది. మరి ఈ కౌన్సిలింగ్  తరువాత అయినా ఈ జంట విడాకులు మానేసి కలిసి ఉంటుందా.. ? లేక విడాకులు కావాలంటుందా.. ? అనేది చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×