BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. విష్ణు ప్రియా ఎలిమినేటె అవుతుందా?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ ఓటింగ్ తారుమారు.. విష్ణు ప్రియా ఎలిమినేటె అవుతుందా?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతుంది. ఐదు వారాల వరకు ఏదో మొక్కుపొడిగా సాగిన షో ఇప్పుడు కాస్త ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.. ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి 8 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. సోమవారం ఎపిసోడ్ నుంచి హౌస్ లో వార్ మొదలైంది. కొత్త వాళ్లు vs పాతవాళ్లు అని పెద్ద యుద్ధమే జరుగుతుంది. మొదటి వారం నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లంతా పాత వాళ్లకు చుక్కలు చూపించారు. అందరు విష్ణు ప్రియా, యాష్మిని టార్గెట్ చేశారు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో యష్మీ, పృథ్వీరాజ్, సీత, విష్ణుప్రియ, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. వీరికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయినప్పటి నుంచి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ బిగ్ బాస్ తెలుగు 8 ఓటింగ్‌లో ఈ వారం మొదటి నుంచి గంగవ్వ టాప్ ప్లేసులో దూసుకుపోతుంది.


గత వారం అందరి పై అరిచిన యష్మీ జనాల్లో నెగిటివిని అందుకుంది. దాంతో ఈ అమ్మడు ఎలిమినేట్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ గత రెండు, మూడు రోజులుగా యష్మీ ఫైర్ కనిపిస్తుంది. ఆటలో విజ్రంబిస్తుంది.. బెటర్ అండ్ క్యూట్ పర్ఫామెన్స్‌తో ఓటింగ్‌పై పైకి వచ్చేసింది. దాంతో రెండో స్థానంలో యష్మీ కొనసాగుతోంది. గంగవ్వ తర్వాత ఈమెనే సెకండ్ ప్లేసులో ఉంది. ఇక మూడో స్థానంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. డేంజర్ జోన్‌లో ఉన్న పృథ్వీరాజ్ నాలుగో ప్లేసుకు చేరుకున్నాడు. పృథ్వీరాజ్ స్థానంలోకి విష్ణుప్రియ వెళ్లిపోయింది. బిగ్ బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్ మెటీరియల్‌గా ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ లవ్ ట్రాక్‌ను నమ్ముకుని చేతులారా గేమ్ పాడు చేసుకుంది.. ఇప్పుడు తన ఆటనే చూస్తున్నారు. కానీ అక్కడ అమ్మాయి గారి పెర్ఫార్మన్స్ లేకపోవడంతో డేంజర్ జోన్లో పడిపోయింది.

ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?


ఓటింగ్ ప్రకారం చూసుకుంటే లీస్ట్ లో ఇద్దరు కొనసాగుతున్నారు. విష్ణుప్రియకు 15.03 శాతం ఓటింగ్, 6,863 ఓట్లు పడ్డాయి. స్వల్ప తేడాతోనే విష్ణుప్రియ ఐదో స్థానంలోకి వెళ్లి డేంజర్‌లో పడిపోయింది. ఇక ఆరో స్థానంలో కిర్రాక్ సీతనే కొనసాగుతోంది. ఆమెకు 14.22 శాతం ఓటింగ్, 6,492 ఓట్లు పడ్డాయి. వీరిద్దరు ఇప్పుడు డేంజర్ లో ఉన్నారని తెలుస్తుంది. గత రెండు వారాలుగా సీత పెర్ఫార్మన్స్, విష్ణు ప్రియతో పోలిస్తే బాగానే ఉంది.. దాంతో ఈ వారం హౌస్ నుంచి విష్ణు ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఎలిమినేషన్ అయ్యేంత డేంజర్‌లోకి విష్ణుప్రియ వచ్చింది. కానీ, ఆమెకంటే తక్కవగా అట్టడుగు స్థానంలో ఉన్న సీతనే దాదాపుగా ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ విష్ణుప్రియ ఆరో స్థానంలోకి పడిపోయినా కూడా బిగ్ బాస్ తనను ఎలిమినేట్ చేయడు. ఎందుకంటే పృథ్వీతో విష్ణుప్రియ నడిపే లవ్ ట్రాక్ బిగ్ బాస్ కు అవసరం. దానికోసమే ఎక్కువగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారని టాక్ నెట్టింట వినిపిస్తుంది. మరి ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారో చూడాలి..

Related News

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Bigg Boss 9: పాపం ఒంటరైన సంజన.. పేరుకే అమ్మా.. ఏంటి ఇమ్మాన్యుయేల్ ఇది

Bigg Boss 9 Day 58: హౌజ్ లో ఇద్దరు రెబల్స్.. పక్కనే ఉంటూ వెన్నుపోటు.. బలైన కళ్యాణ్, మళ్లీ ఒంటరైన సంజన

Bigg Boss 9: నాన్న పోయి తమ్ముడచ్చాడు.. తనూజకి కొత్త బాండింగ్ దొరికిందోచ్

Big Stories

×