Bigg Boss 9 Telugu : బుల్లితెర ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైంది.. గత ఏడాది సీజన్ తో పోలిస్తే. ఈ ఏడాది ప్రత్యేకతలు మాత్రం మామూలుగా లేవని చెప్పాలి.. నాగార్జున ఎంట్రీ నుంచి హౌస్ లోపలికి వెళ్లేంతవరకు ట్విస్టులు మీద ట్విస్టులు ఇచ్చి బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాగార్జున కే ఒక పరీక్ష పెట్టి కళ్ళకు గంతలు కట్టుకొని హౌస్ లోకి వెళ్ళమని బిగ్ బాస్.. ఈసారి సీజన్ అనుకున్న విధంగానే రణరంగం చూపించే విధంగా ఉందని అర్థమవుతుంది. హౌస్ లోకి వెళ్ళిన నాగార్జున బిగ్ బాస్ ప్రత్యేకతలను చూసి షాక్ అయ్యారు. డబల్ హౌస్ డబల్ జోస్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది మరి బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం..
ప్రతి రూమ్, హాల్ ఇలా అన్నీ ఒక థీమ్‌తో ఉంటాయి. డిజైన్స్ సరికొత్తగా ఆకట్టుకునేలా ఉంటాయి. మరి ఈ సారి ఎలా డిజైన్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో హౌజ్‌ని చూపించారు. నాగార్జున కళ్లకి గంతలు కట్టుకుని హౌజ్‌లోకి వెళ్లారు.కళ్లకు గంతలు కట్టుకొని హౌస్ లోకి వెళ్ళిన నాగార్జున బిగ్ బాస్ హౌస్ ను ఒక్కసారిగా అవ్వక్కయ్యారు. హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే అదిరిపోయే లైటింగ్ తో ఎంతో అట్రాక్టింగ్ గా ఉంది.. ఇక ఎంట్రీ ఇవ్వడంతోనే నాగార్జున ఈ ఘాటు ఏంటి అని బిగ్ బాస్ ని అడుగుతాడు.. అక్కడ ఉన్న గుంటూరు మిరపకాయల తోరణాలను చూసి నాగార్జున ఏంటి బిగ్ బాస్ ఇది కాస్త ఘాట్ ఎక్కువగా ఉంది అని అడుగుతాడు. ఇది కిచెన్ ఆ మాత్రం ఘాటు ఉండాలి అని బిగ్ బాస్ హింట్ ఇస్తాడు.
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది. సీజన్ 9 ఈసారి సరికొత్తగా ఉండబోతుందని నాగర్జున ప్రోమో ని చూసి అందరూ షో కోసం ఎంతగానో వెయిట్ చేశారు. అయితే అనుకున్న దాని కన్నా వెయ్యిరెట్లు అద్భుతంగా ఉందని హౌసింగ్ చూసిన బిగ్ బాస్ ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.. గత ఎనిమిది సీజన్ల వరకు ఒక్క హౌస్ మాత్రమే ఉంది. 9వ సీజన్లో మాత్రం డబల్ హౌస్.. డబల్ డోస్ ఉండబోతుంది.. అదేవిధంగా ప్రత్యేకమైన విధంగా జైలును కూడా డిజైన్ చేశారు.. ప్రతి ఒక్క రూము ఎంతో అద్భుతంగా అందంగా ఉంది. మొత్తానికైతే రెండిళ్ల ప్రత్యేకతలైతే మామూలుగా లేవు.. కలర్ఫుల్ హౌస్ లో కలర్ఫుల్ కంటెస్టెంట్లతో బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుంది. ఇక హౌస్ లోకి ఎవరెవరు ఇంటర్వ్యూ పోతున్నారో మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.. ఈ సీజన్ గురించి ఈ సీజన్ లో కంటెస్నల్ ఇంట్లో గురించి తెలుసుకోవాలంటే బిగ్ బాస్ ని అసలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..