Mumbai times tower: ముంబైలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్తుల టైమ్స్ టవర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ఆరున్నరకు ఒక్కసారిగా మంటలు చెలరేగా యి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి.
నాలుగుపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నది అధికారులు మాట. ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. 14 అంతస్తుల ఈ భవనం వెనుక భాగంలోని మూడు- ఏడు అంతస్తుల మధ్య మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: కోల్‌కతా హత్యాచార ఘటన.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు!
ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతం కమలా మిల్స్ కాంపౌండ్. ఐదేళ్లలో ఇక్కడ అగ్నిప్రమాదాలు జరగడం ఇది మూడోసారి. పేరుకే భారీ ఎత్తున భవనాలు, అధికారులు ఎప్పుడూ తనిఖీలు చేసిన సందర్భం లేదని అంటున్నారు మహారాష్ట్ర నిర్మాణ సేన నేత సందీప్ దేశ్‌పాండే. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వీటిని స్థానిక ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని అంటున్నారు.
ముంబై: టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ ఇంజిన్లు.#MumbaiFireAccident #MumbaiTimesTower #NewsUpdates #Bigtv pic.twitter.com/Tl5dK1qqao
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2024