BigTV English

Telangana Global AI Summit 2024: AI గ్లోబల్ సమ్మిట్.. ఎన్ని కంపెనీలతో ఒప్పందాలంటే..

Telangana Global AI Summit 2024: AI గ్లోబల్ సమ్మిట్.. ఎన్ని కంపెనీలతో ఒప్పందాలంటే..

Telangana Global AI Summit 2024: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ గ్లోబల్ సదస్సులో ఇప్పటి వరకూ 46 ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. తొలిరోజు 21, ఇవాళ 25 ఒప్పందాలను ప్రభుత్వం చేసుకున్నట్లు సమాచారం. ఏఐ ఆధారిత తెలంగాణ కోసం నిర్దేశించుకున్న సర్కారు…అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యాసంస్థలు, పెద్దపెద్ద సాంకేతిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణకు దేశంలోనే ఎన్నడు లేని విధంగా ఏఐ సూపర్ పవర్ తీర్చిదిద్దేందుకు కొన్ని ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా 7 రంగాల్లో ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. కంప్యూటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, స్కిల్లింగ్, స్టార్టప్‌ ఇన్నోవేషన్, జనరేటివ్‌ ఏఐ, రీసెర్చ్‌ అండ్‌ కోలాబరేషన్, డేటా అన్నోటేషన్‌ రంగాల్లో పరస్పర ఒప్పందాలు కుదిరాయి.


తెలంగాణ రాష్టంలో ఏఐ సదస్సుకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు యెట్టా సంస్థ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏఐ డేటా సెంటర్‌ నిర్మించనుంది. 4వేల హెచ్‌ హండ్రెడ్ జీపీయూ సామర్థ్యంతో ప్రారంభించి.. భవిష్యత్తులో 25వేల హెచ్‌ హండ్రెడ్ జీపీయూకు పెంచనున్నారు. ఒప్పందంలో భాగంగా సిడాక్‌ పరమ్‌సిద్ధి-ఏఐ, ఐరావత్‌ టీ-ఎయిమ్స్‌ అంకుర సంస్థలకు ఆరు నెలల వరకూ ఉచితంగా వెయ్యి GPU గంటలను అందిస్తారు. ఖర్చులు తగ్గించి కీలక రంగాల్లో ఏఐ ఆవిష్కరణల ప్రోత్సాహానికి దోహదం చేస్తుంది.

Also Read: AI గ్లోబల్ హబ్‌గా తెలంగాణ.. తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న భారత్


ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయడానికి పాత్, నజారా టెక్నాలజీస్‌తో  తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యం, స్పోర్ట్స్, ఇతర యాక్టివిటీస్ గేమ్స్, డిజిటల్ కంటెంట్ ఆవిష్కరణ, యువత్ ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి కోసం నెక్ట్ వేవ్, మైక్రోసాఫ్ట్ కెంపెనీలు, అమెజాన్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా 2 లక్షల 50 వేల మంది విద్యార్థులు, నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి ఈ-గవర్నెన్స్, పౌర సేవలను మెరుగు పరిచేందుకు మెటాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. లామా 3.1 మోడల్‌తో సహా మెటా ఓపెన్‌ సోర్స్‌ జనరేటివ్‌ ఏఐ సాంకేతికతలతో ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల సామర్థ్యం మెరుగుపడనుంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×