Baba Vanga: ప్రస్తుతం మన చేతిలో ఉన్న చిన్న పరికరం స్మార్ట్‌ఫోన్, ఒకప్పుడు కేవలం సంభాషణ కోసం మాత్రమే వాడే వారు. కానీ ఇప్పుడు అది అనేక మంది జీవితాల్లో భాగంగా మారిపోయింది. కానీ, ఈ చిన్న పరికరం వల్ల మనపై పడుతున్న ప్రభావాలను మీరు ఎప్పుడైనా ఆలోచించారా. దీనిపై బల్గేరియన్ జ్యోతిష్కురాలు బాబా వంగా ఇచ్చిన హెచ్చరిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ఆమె చేసిన జోస్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మరి, ఈ జోస్యం మన రోజువారీ జీవితానికి ఎంత దగ్గరగా ఉందో ఇప్పుడు చూద్దాం.
స్మార్ట్‌ఫోన్ సహచారి కాదు…శత్రువు కూడా
ఒక్కసారి ఆలోచించండి… రోజు ఎంతసేపు మీరు ఫోన్ చూస్తారు? ఉదయం లేవగానే మొబైల్ చూడటం, రాత్రి నిద్రపోయే ముందు చివరిసారి స్క్రోల్ చేయడం, మధ్యాహ్నం భోజన సమయంలోనూ మీ కళ్ల ముందు స్క్రీన్ ఉండటం. ఈ వ్యసనం చిన్నదేనని మీరు అనుకోవచ్చు కానీ బాబా వంగా చెప్పిన ప్రకారం, ఈ వ్యసనం క్రమంగా మన మానవతను హరించేస్తుంది. మన చుట్టూ ఉన్నవాళ్లను విస్మరించి, సంబంధాలను చూంచేస్తుంది. మన భావోద్వేగాలను నియంత్రించే శక్తి తగ్గి, మనం యంత్రాల్లా ప్రవర్తించటం మొదలవుతుందన్నారు.
మానసికంగా ఖాళీ..
మొబైల్ మన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత అనేక కొత్త అలవాట్లు ఏర్పడ్డాయి. కానీ కొన్ని శారీరకంగా, మానసికంగా మనల్ని బలహీనంగా చేస్తున్నాయి. నిరంతరం నోటిఫికేషన్లు వస్తుండటంతో మన ఏకాగ్రత శక్తి తగ్గిపోతోంది. నిరంతరంగా స్క్రోల్ చేయటం వల్ల మన మనస్సు శాంతిగా ఉండటం లేదు. మనం నిజ జీవితాన్ని అనుభవించకుండా, డిజిటల్ ప్రపంచంలోనే నలుగురితో ‘కనెక్ట్’ అవుతున్నామనే మాయలో జీవిస్తున్నాం. బాబా వంగా ఈ తరహా జీవనశైలి వల్ల మానవులు మానసికంగా ఖాళీగా మారిపోతారని, తమకే తెలియకుండా ఆలోచనలేని రోబోలాగా మారిపోతారని హెచ్చరించారు.
Read Also: Budget Air Coolers: రూ.5000కే వేసవిలో చల్లదనం..టాప్ 4 …
నిద్ర మీద ప్రభావం…
ఇది సైంటిఫిక్‌గా ప్రూవైన విషయం. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి (Blue Light) మన శరీరంలో నిద్ర హార్మోన్ అయిన మెలటొనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫలితంగా నిద్ర తగ్గిపోతుంది, మనం రాత్రంతా టాస్ అండ్ టర్న్ అవుతూనే ఉంటాం. ఈ ప్రభావం యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. నిద్ర సరిపోకపోవడం వల్ల రాత్రుళ్లు వేగంగా గడవడం, ఉదయాన్నే అలసటగా లేవడం, మానసిక ఉల్లాసం తగ్గిపోవడం వంటి అనేక సమస్యలు కలుగుతున్నాయి.
ఆత్మవిశ్వాసం క్షీణత – సోషల్ మీడియా మాయలో మన జీవితం
ఇక సోషల్ మీడియా ప్రభావం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ప్రతి ఫోటో, ప్రతి పోస్టు, ఒక ‘పర్ఫెక్ట్ లైఫ్’ ను చూపిస్తుంటుంది. కానీ మన జీవితంలో అలాంటిది జరగకపోవడంతో, మనలో తక్కువ భావన పెరిగిపోతోంది. అది మానసిక నిరాశకు దారి తీస్తోంది.
పరిశోధనలు ఏమంటున్నాయి?
తాజా అధ్యయనాల ప్రకారం…
-రోజుకు 4 గంటలకుపైగా మొబైల్ వాడే వారిలో మానసిక ఒత్తిడి 60% అధికంగా ఉంది.
-16-30 సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలో ‘ఫోమో’ (Fear of Missing Out) పెరుగుతోంది.
-ప్రతి 10 మందిలో 7 మందికి సోషల్ మీడియా డిప్రెషన్ లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
బాబా వంగా జోస్యం – ఇప్పటి జనరేషన్‌కు హెచ్చరిక!
బాబా వంగా చెప్పిన జోస్యం కేవలం ఊహాత్మకంగానే కాకుండా, ఇప్పటి సమాజానికి అద్దం పట్టిస్తోంది. ఆమె తెలిపిన ప్రకారం, భవిష్యత్తులో మనం టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడతాం, మన భావోద్వేగాలు, సంబంధాలు అంతగా విలువలేని వాటిగా మారతాయి. మన శరీరాలు శక్తిలేని, మనస్సు లేని మాదిరిగా తయారవుతాయి.
పరిష్కారం ఏమిటి? – డిజిటల్ డీటాక్స్
-‘డిజిటల్ డీటాక్స్’ అనే పదం వినగానే కొందరికి గబగబలేస్తుంది. మొబైల్ లేకుండా ఎలా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ ఇది ఫోన్‌ను పూర్తిగా వదిలేయమన్న మాట కాదు. -ఇది వాడకాన్ని తెలివిగా నియంత్రించడం అన్నమాట.
-ప్రతి రోజు కొన్ని గంటల పాటు ‘నో ఫోన్’ టైమ్ ఉంచండి
-నిద్రకు రెండు గంటల ముందు మొబైల్ వాడకాన్ని మానేయండి
-ఉదయం లేచిన వెంటనే మొబైల్ కాకుండా, ప్రకృతిని చూసి రోజు ప్రారంభించండి
-వీకెండ్స్‌లో సోషల్ మీడియా Detox చేసుకోండి
-కుటుంబంతో, స్నేహితులతో ప్రత్యక్షంగా సమయం గడపండి