BigTV English

Javed Akhtar: మొహాలు తెలియని సౌత్ హీరోల సినిమాలు చూస్తున్నారు.. బాలీవుడ్ రైటర్ ఆవేదన

Javed Akhtar: మొహాలు తెలియని సౌత్ హీరోల సినిమాలు చూస్తున్నారు.. బాలీవుడ్ రైటర్ ఆవేదన

Javed Akhtar: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని చాలామంది ఫారిన్ ప్రేక్షకులు అనుకునేవారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి చాలా మారిపోయింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ పుంజుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పటికీ ఏడాదిలో విడుదలయ్యి ఒకట్రెండు సినిమాలు తప్పితే బీ టౌన్ బాక్సాఫీస్ పెద్దగా ముందుకు సాగడం లేదు. గతేడాది విడుదలయిన ‘స్త్రీ 2’, తాజాగా విడుదలయిన ‘ఛావా’ లాంటి సినిమాలే హిందీ బాక్సాఫీస్‌కు కాస్త ప్రాణం పోశాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న ఈ ధీన స్థితిపై సీనియర్ రైటర్ జావేద్ అఖ్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ చిత్రాలతో హిందీ సినిమాలను పోల్చారు.


ఏమైంది ప్రేక్షకులకు.?

ఎంతోకాలంగా బాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్‌గా, లిరిసిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు జావేద్ అఖ్తర్. ఆ తర్వాత తన వారసులను కూడా ఇండస్ట్రీలో రైటర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్‌గా పరిచయం చేశాడు. తాజాగా జావేద్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఏ విధంగా కష్టాలు పడుతుందో చెప్పుకొచ్చాడు జావేద్. ‘‘హిందీ సినిమాలు ఆడియన్స్‌తో పూర్తిగా కనెక్షన్‌ను కోల్పోయాయి. అసలు మొహాలు కూడా తెలియని సౌత్ ఇండియన్ హీరోలు నటిస్తున్న డబ్బింగ్ సినిమాలు సైతం ఇక్కడ విడుదలయ్యి రూ.600 నుండి 700 కోట్లు బిజినెస్ చేస్తున్నాయి. మన దగ్గర వర్కవుట్ అవుతున్న సినిమాలు కూడా సౌత్ నుండి డబ్ అయినవే ఉంటున్నాయి. అసలు ఏమైంది బాలీవుడ్ ప్రేక్షకులకు?’’ అని వాపోయాడు.


వాటిపైనే ఫోకస్

జావేద్ అఖ్తర్ (Javed Akhtar) మాత్రమే కాదు.. చాలామంది బాలీవుడ్ యాక్టర్స్, మేకర్స్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. సౌత్ సినిమాలే హైలెట్ అవుతున్నాయని, బాలీవుడ్ సినిమాలు ఆ రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయని అనుకుంటున్నారు. కొందరు ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్తున్నా.. కొందరు మాత్రం అది నిజమే అని సైలెంట్‌గా ఒప్పుకుంటున్నారు. ఇక జావేద్ అఖ్తర్‌తో పాటు అమీర్ ఖాన్ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొని బాలీవుడ్‌కు, సౌత్ సినిమాలకు మధ్య ఉన్న తేడా గురించి మాట్లాడాడు. ‘‘మనం కేవలం ప్రేమ, కోపం, రివెంజ్‌పైన మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. సౌత్‌లాగా మనం కూడా నమ్మకంతో సినిమాలు చేయాలి’’ అని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్.

Also Read: వాళ్లిద్దరూ అలా ప్రవర్తించారు.. నయన్, విఘ్నేష్‌పై ధనుష్ కొత్త ఆరోపణలు

ఆప్షన్ లేదు

‘‘సౌత్ సినిమాలను ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ సినిమాలు అనేవాళ్లం. మాస్‌గా, కమర్షియల్‌గా ఉంటాయని చెప్పుకునేవాళ్లం. అలా అయితే బాలీవుడ్ ఇప్పుడు కేవలం మల్టీప్లెక్స్ సినిమాలపై ఫోకస్ చేస్తునట్టుంది. ఇంతకు ముందు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను ప్రతీ సినిమా చూసేవాడిని. ఇప్పుడు సినిమాలు చూడడం కూడా ఫ్యాన్సీ అయిపోయింది. మనమే మన బిజినెస్ మోడల్‌ను చంపేసుకుంటున్నాం’’ అంటూ బాలీవుడ్ ఉన్న దుస్థితిపై అమీర్ ఖాన్ (Aamir Khan) కూడా వాపోయాడు. ఇక సినిమాలు థియేటర్లలో, ఓటీటీలో విడుదల అవ్వడానికి మధ్య చాలా గ్యాప్ ఉండాలని కూడా అన్నాడు. ఇది ఇండస్ట్రీలో జరుగుతున్న పెద్ద తప్పు అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×