Bhupalapally News: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం–భూపాలపల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. రోడ్డుపక్కన యువతి మృతదేహం కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా, అక్కడే యువతి ఆధార్ కార్డు దొరికింది. దాని ఆధారంగా ఆమె ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి అని గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే…
ఈ నెల 6వ తేదీన చిట్యాల పోలీస్‌స్టేషన్‌లో వర్షిణి మిస్సింగ్ కేసు నమోదైంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె కోసం గాలింపు జరిపినా ఎక్కడా కనబడలేదు. అయితే నేడు జాతీయ రహదారి పక్కనే మృతదేహం కనిపించడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఇక ఘటనా స్థలంలో మరో విచిత్రమైన విషయం బయటపడింది. మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కనిపించాయి. దీంతో పోలీసులు అనుమానాస్పదంగా కేసు నమోదు చేశారు. ఎక్కడైనా క్షుద్రపూజల కోసం వర్షిణిని బలి ఇచ్చారా? అనే కోణంలో విచారణ ప్రారంభించారు. స్థానికులూ ఇదే అనుమానంతో ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యకు కుట్ర
పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ సిబ్బందిని పిలిపించి ఘటనా స్థలాన్ని పరిశీలింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వాస్తవానికి వర్షిణి మరణానికి గల కారణం ఏంటి? నిజంగా ఇది బలి పూజేనా? లేక వేరే కారణమా? అనే అంశాలపై పూర్తి స్పష్టత కోసం దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వర్షిణి మిస్సింగ్ అయిన రోజు నుండి ఎవరి సన్నిహితంగా కనిపించింది, ఎవరైనా ఆమెను మోసం చేసి తీసుకెళ్లారా, లేక వేరే దురుద్దేశంతో హత్య చేశారా? అన్న విషయాలు ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామంలో మాత్రం భయాందోళన వాతావరణం నెలకొంది. యువతి మృతి కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కుటుంబం కన్నీటి మునిగిపోయిన ఈ ఘటనపై పోలీసులు త్వరగా దర్యాప్తు పూర్తిచేసి నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువతి అనుమానాస్పద మృతి..
కాటారం-భూపాలపల్లి జాతీయ రహదారి ప్రాంతంలో మృతదేహం లభ్యం
మృతురాలు ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణిగా గుర్తింపు
ఘటనా స్థలంలో లభించిన యువతి ఆధార్ కార్డు
ఈ నెల 6న చిట్యాల పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు
మృతదేహం వద్ద పసుపు,… pic.twitter.com/N85HRYuTUP
— BIG TV Breaking News (@bigtvtelugu) August 29, 2025