E-Paper
Advertisement

బంగారం ధర పతనం.. కొనుగోలుదారుల్లో ఒకటే ఆనందం, కొన్నాళ్ల వరకు పతనం?

బంగారం ధర పతనం.. కొనుగోలుదారుల్లో ఒకటే ఆనందం, కొన్నాళ్ల వరకు పతనం?
Advertisement

Gold Price Down: కొన్నాళ్లుగా కొండెక్కి కూర్చొన్న పసిడి ధర క్రమంగా దిగి వస్తోంది. పెట్టుబడుదారులు అమ్మకాలకు పాల్పడడంతో ఊహించని స్థాయికి పతనమైంది. దీంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్నాళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని అంటున్నాయి బులియన్ మార్కెట్ వర్గాలు.

దిగొస్తున్న బంగారం-వెండి ధరలు

అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాలు, దిగొస్తున్న చమురు ధరలు, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతాయని సంకేతాల మధ్య ఇన్వెష్టర్లు బులియన్ మార్కెట్ లో అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఎప్పుడు లేని విధంగా బంగారం, వెండి ధరలు పతనం అవుతున్నాయి. రోజు రోజుకూ బంగారం ధరలు పతనం కావడంతో కొనుగోలుదారుల్లో ఆనందం మిన్నంటింది.

Advertisement

గుడ్ రిటర్న్స్ వివరాల మేరకు.. గురువారం ఉదయం 10 గంటలకు బంగారం-వెండి ధరలను దేశీయంగా పరిశీలిద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,39,800 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. బుధవారంతో పోల్చితే 10 గ్రాములకు రూ. 2180 మేరా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం రేటు రూ.1,28,150గా కొనసాగుతోంది. మునుపటి రోజుతో పోల్చితే పది గ్రాములకు దాదాపు రూ.2000 మేరా దిగి వచ్చింది.

కొనుగోళ్లదారుల్లో ఒకటే ఆనందం

వెండి ధరల విషయానికి వద్దాం. కిలో వెండి సుమారు రూ.1,86,550 పలుకుతోంది. బుధవారంతో పోలిస్తే దాదాపు రూ.3000 వేలకు పైగానే తగ్గింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్‌ గోల్డ్‌ ఔన్సు ధర 3,974 డాలర్లు వద్ద ట్రేడింగ్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక ఔన్సు వెండి ధర 51.48 డాలర్లు వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఈ స్థాయిలో దిగి రావడంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవంబరు 4 తర్వాత మళ్లీ ఇప్పుడే దిగుతోందని అంటున్నారు.

Advertisement

ALSO READ: 2 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కేవలం రూ. 155.. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఆనందంలో కొనుగోలుదారుడు

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర చూద్దాం. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు రూ.1, 39, 800 వద్ద కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇక ముంబై, చెన్నై, కోల్‌కత్తా, కేరళం మార్కెట్లో రూ.200 నుంచి 100 అటు ఇటుగా ఉంది. అదే 22 క్యారెట్ల పసిడి ధరకు చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.1,28,300 వద్ద లావాదేవీలు కొనసాగుతున్నాయి. మిగతా నగరాల్లో రూ.200 తక్కువగా ఉంది.

Related News

2 బీహెచ్‌కే ఫ్లాట్‌ని కేవలం రూ. 155.. ఇంతకీ ఎక్కడో తెలుసా? ఆనందంలో కొనుగోలుదారుడు

వాహనదారులకు కడుపు మంట.. చమురు కంపెనీల లాభాల పంట

బిర్యానీ ధరకు ఇల్లు మీ సొంతం.. కేవలం రూ.155కే రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్

రూ.1లక్ష పెట్టుబడితో..లక్షలు సంపాదించండి,పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ బెనిఫిట్స్ ఇవే!

ఈ సెలబ్రిటీల విడాకులు చాలా కాస్ట్లీ గురూ.. స్పీల్‌బర్గ్ కొంప ముంచిన టిష్యూ!

ఎంబీఏ మిత్రుల గ్రేట్ ఐడియా.. అరటి వ్యర్థాలతో రూ.కోట్ల బిజినెస్.. 60% మహిళలకే ఉపాధి!

కాలేజీలో చదువుతూనే.. రూ. 15 లక్షల వ్యాపారం.. ఫుడ్ రంగంలో దుమ్మురేపుతున్న 21 ఏళ్ల యువతి!

Big Stories

Advertisement
×