E-Paper
Advertisement

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి 3 సూపర్ స్కీమ్స్.. పిల్లల భవిష్యత్తుకు కొండంత భరోసా!

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ నుంచి 3 సూపర్ స్కీమ్స్.. పిల్లల భవిష్యత్తుకు కొండంత భరోసా!
Advertisement

LIC Child Plans: పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తుంటారు. బిడ్డల ఉన్నత విద్య, కెరీర్ లక్ష్యాల కోసం భారీ మెుత్తంలో డబ్బు అవసరమని ముందు నుంచే తెగ టెన్షన్ పడిపోతుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి పిల్లల పేరిట కొద్దిగా కొద్దిగా పొదుపు చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసం ఎల్ఐసీ (LIC)లో మంచి స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందులోనూ మూడు స్కీమ్స్ పిల్లల భవిష్యత్తుకు మెరుగైన భరోసాను ఇచ్చేలా ఉన్నాయని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి? దాని అర్హతలు, ఇతర వివరాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఎల్‌ఐసీ అమృత్‌బాల్

పిల్లల ఉన్నత విద్య, భవిష్యత్తు అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని ఆదా చేసుకోవడానికి ఎల్‌ఐసీ ‘అమృత్‌బాల్’ ప్లాన్ అందుబాటులో ఉంది. 30 రోజుల పిసికందు నుంచి 13 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల పేరు మీద ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధిని 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఎంచుకునే సౌలభ్యం ఇందులో ఉంది. ఎంచుకున్న కాలపరిమితి పూర్తయిన తర్వాత పిల్లల చదువు లేదా ఇతర పెద్ద అవసరాల కోసం మెచ్యూరిటీ బెనిఫిట్ లభిస్తుంది.

ఎల్‌ఐసీ చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్

Advertisement

పిల్లల చదువులో విభిన్న దశలలో ఆర్థిక అవసరాలు ఎదురవుతాయని భావించే తల్లిదండ్రుల కోసం ఈ ‘చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. పుట్టిన చిన్నారి నుంచి 12 ఏళ్ల వయస్సు వరకు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. మెచ్యూరిటీకి ముందే పిల్లల ఉన్నత చదువుల సమయంలో నిర్ణీత వయస్సుల వద్ద సర్‌వైవల్ బెనిఫిట్స్ రూపంలో డబ్బు పొందొచ్చు. పాలసీ గడువు ముగిసినప్పుడు.. మిగిలిన డబ్బుతో పాటు అదనపు బోనస్‌లు సైతం చెల్లిస్తారు. కాలేజీ అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు వంటి ఖర్చులకు ఈ ప్లాన్ ఆసరాగా నిలుస్తుందని చెప్పవచ్చు.

ఎల్‌ఐసీ జీవన్ తరుణ్

‘ఎల్‌ఐసీ జీవన్ తరుణ్’ ఒక ఫ్లెక్సిబుల్ సేవింగ్స్ ప్లాన్. మెచ్యూరిటీకి ముందు ఎంత శాతం సొమ్మును క్రమానుగతంగా తీసుకోవాలో తల్లిదండ్రులే ఎంచుకునే సదుపాయం ఇందులో ఉంది. 90 రోజుల పసిపాప నుంచి 12 ఏళ్ల వయస్సు గల పిల్లల వరకు దీనికి అర్హులు. పాలసీ గడువు ముగియగానే మిగిలిన మొత్తాన్ని ఒకేసారి అందిస్తారు. ఇది పిల్లల భవిష్యత్తు లక్ష్యాలకు బాగా ఉపయోగపడుతుందని ఎల్ఐసీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Also Read: ‘ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాల్సిందే’.. ఏపీ ప్రభుత్వానికి షర్మిల అల్టిమేటం!

పన్ను ప్రయోజనాలు

పైన పేర్కొన్న పాలసీలు అన్నింటికి పన్ను మినహాయింపు వర్తించనుంది. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు పొందే వెసులుబాటు కల్పించారు. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని షరతులకు లోబడి మెచ్యూరిటీ రూపంలో వచ్చే సొమ్ముపై కూడా పన్ను ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే పైన పేర్కొన్న ఎల్ఐసీ పాలసీల్లో పెట్టుబడి పెట్టే ముందు స్కీమ్ పరిమితులు, బెనిఫిట్స్, మినహాయింపులు, అర్హత ప్రమాణాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటే బెటర్. సరైన ప్లాన్‌ను ఎంచుకునేందుకు ఎల్‌ఐసీ ప్రతినిధి, ఆర్థిక సలహాదారుని సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.

Also Read: లగ్జరీ ఫ్లాట్‌ అద్దెకిచ్చే అందమైన అమ్మాయి… కలల ఇల్లు కాస్తా భయంకరమైన పీడకలగా మారితే… తమిళ హర్రర్ మూవీ తెలుగులో

Tags

Related News

భయాందోళన నేపథ్యంలో బంగారం-వెండి ధరలు పతనం, కొనుగోలు ఇదే సరైన సమయమా?

స్క్రాప్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి? ఎక్కడ కొనాలి, ఎవరికి అమ్మాలి? చెత్త నుంచి సూపర్ సంపాదన

SBI క్రెడిట్ కార్డ్ యూజర్లకు బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. 1% అదనపు ఛార్జీలు!

నవంబర్ 1 నుంచి కీలక మార్పులు.. సామాన్యులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం.. తెలుసుకోకుంటే ఇబ్బందే!

దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా బంగారం కొంటున్నారా? ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి

రైతుల్లో అప్పుడే ఆనందం.. శుక్రవారం నిధులు విడుదల, రూ. 2 వేలకు ఎవరు అర్హులు?

టీ స్టాల్, కిరాణా, కూరగాయల బండి.. అందరికీ GST రిజిస్ట్రేషన్ తప్పనిసరి? చిన్న వ్యాపారులకు ఫైలింగ్ రూల్స్ ఇవే

Big Stories

Advertisement
×