BigTV English

Best BSNL Plans: నెల రోజుల వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్.. రూ. 199 లోపు 5 బెస్ట్ BSNL ప్లాన్స్ ఇవే!

Best BSNL Plans: నెల రోజుల వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్..  రూ. 199 లోపు 5 బెస్ట్ BSNL ప్లాన్స్ ఇవే!

Best 5 BSNL Plans:

ప్రభుత్వరంగ టెలింకాం సంస్థ అయిన BSNL దేశంలో అత్యంత సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. దేశ వ్యాప్తంగా కనెక్టివిటీ, గ్రామీణ ప్రాంతాలకు చక్కటి నెట్ వర్క్ ను కలిగి ఉండటంతో BSNLకు రోజు రోజుకు వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు, జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ రంగ టెలికాం సంస్థలకు ధీటుగా BSNL రీఛార్జ్ ప్లాన్స్ అందించడంతో వినియోగదారులు ఈ సంస్థ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర కంపెనీలకు సాధ్యం కాని రీతిలో జస్ట్ రూ. 199 లోపు బోలెడు ప్లాన్ అందిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ, స్వల్పకాలిక అవసరాలు ఉన్న వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడతాయి. డేటా, వాయిస్ కాలింగ్, SMS ప్రయోజనాలు అందించే BSNL రూ. 200 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


⦿ రూ.107 ప్లాన్: తక్కువ డేటా, లాంగ్ వ్యాలిడిటీ

ఈ ప్యాక్ 35 రోజుల వాలిడిటీతో వస్తుంది. మొత్తం 3GB హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఆ తర్వాత డేటా వేగం 40 Kbpsకి పడిపోతుంది. ఇందులో నేషనల్ రోమింగ్‌తో సహా 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. ఉచిత వినియోగం తర్వాత,  కాల్/SMS ఛార్జీలు వర్తిస్తాయి. లోకల్‌ కు నిమిషానికి రూ. 1, STD/నిమిషానికి రూ. 1.3, SMSకి 80 పైసలు ఛార్జీ పడుతుంది.

⦿ రూ. 141 ప్లాన్: SMS, కాల్స్, రోజువారీ డేటా

రోజువారీ డేటా అవసరమైన వినియోగదారులకు, ఈ ప్లాన్ 30 రోజుల పాటు రోజుకు 1.5GB డేటా  అందిస్తుంది. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాల్స్, రోజుకు 200 ఎస్సెమ్మెస్ లు కూడా ఉంటాయి. రోజువారీ పరిమితులు అయిపోయిన తర్వాత డేటా, ఎస్సెమ్మెస్ అందుబాటులో ఉండదు.


⦿ రూ. 147 ప్లాన్: హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్

ఈ ప్లాన్ 10GB హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఆ తర్వాత వేగం 40 Kbpsకి తగ్గుతుంది. ఇందులో రోమింగ్‌ తో సహా అపరిమిత కాల్స్ కూడా ఉంటాయి. 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది.

⦿ రూ. 149 ప్లాన్: బెస్ట్ బడ్జెట్ డైలీ డేటా ప్యాక్

ఈ ప్లాన్ 28 రోజులకు రోజుకు 1GB డేటా అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్ లను అందిస్తుంది. బడ్జెట్ పై ఆసక్తి ఉన్న వినియోగదారులకు ఇది ఆల్ రౌండర్ గా చెప్పుకోవచ్చు.

Read Also: వచ్చేస్తోంది జియో 5G స్మార్ట్‌ లేన్.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

⦿ రూ. 197 ప్లాన్: ఎక్స్‌ టెండెడ్ వాలిడిటీ ప్యాక్

ఇది 70 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. మొదటి 15 రోజులకు రోజుకు 2GB డేటా ఇస్తుంది. తర్వాత మిగిలిన కాలానికి రోజుకు 50MBకి తగ్గుతుంది. పరిమితి తర్వాత వేగం తగ్గుతుంది. తొలి 15 రోజులకు వాయిస్ కాల్స్ అపరిమితంగా ఉంటాయి.

Read Also: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Related News

Swiggy: కస్టమర్ షాక్.. రెస్టారెంట్‌ Vs యాప్, 81 శాతం ధర తేడా?

Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర..

Jio vs Airtel vs VI: జియో, ఎయిర్‌ టెల్, VI.. డైలీ డేటాలో బెస్ట్ మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!

iPhone 17 launch: కొత్త ఐఫోన్ 17 డిజైన్, ఫీచర్స్ లీక్…ధర ఎంతంటే..? 

Best bikes under 1 lakh: ఒక్క లక్షలోపు బెస్ట్ బైక్‌లు.. 2025 టాప్ బైక్స్ ఇవే..

×