గత కొంత కాలంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి తీసుకొస్తున్న BSNL తాజాగా మరో క్రేజీ ప్లాన్ ను పరిచయం చేసింది. 72 రోజుల చెల్లుబాటుతో మరో చౌకైన ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులు రోజూ 2GB డేటా, అపరిమిత కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా BSNL తరచుగా చౌకైన ప్లాన్స్ ను పరిచయం చేస్తోంది.
BSNL తాజాగా ఈ చౌకైన ప్లాన్ ను ప్రకటించింది. ఈ రీఛార్జ్ ప్లాన్ లో వినియోగదారులు 72 రోజుల వ్యాలిడిటీని పొందనున్నారు. రూ.485 ప్లాన్ లో, వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. BSNL ఈ రీఛార్జ్ ప్లాన్ రోజు వారీ 2GB హై స్పీడ్ డేటా, 100 ఉచిత SMSలతో వస్తుంది. దీనితో పాటు, BSNL తన మొబైల్ వినియోగదారులందరికీ BiTV యాక్సెస్ ను అందిస్తోంది. వినియోగదారులు 350 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్, OTT యాప్ లకు యాక్సెస్ పొందుతారు. అంతేకాదు, BSNL ఇటీవల BiTV ప్రీమియం ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. రూ.151 ప్లాన్ లో, వినియోగదారులకు 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్స్, 23 కంటే ఎక్కువ OTT యాప్ లకు యాక్సెస్ ఇవ్వబడుతుంది.
అటు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రూ.1 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజూ 2GB డేటా, అపరిమిత కాలింగ్, ఉచిత SMS లాంటి ప్రయోజనాలను అందిస్తుంది. BSNL ఈ ఫ్రీడమ్ ఆఫర్ కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. BSNL ఈ రూ.1 ఆఫర్ ఆగస్టు 31న ముగియాల్సి ఉండగా, వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. మరికొద్ది రోజుల పాటు ఈ ప్లాన్ ను పొడిగించాలనే డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15 వరకు ఈ ప్లాన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Read Also: ఫ్రీ డేటా.. OTT యాక్సెస్.. జియో బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా!
BSNL త్వరలో 5G సేవలను ప్రారంభించబోతోంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ వేగంగా కొత్త టవర్లను ఏర్పాటు చేస్తోంది. భారతదేశం అంతటా ప్రతి టెలికాం సర్కిల్ లో కంపెనీ 4G సేవలను ప్రారంభించింది. కంపెనీ ప్రధాన దృష్టి ఇప్పుడు నెట్ వర్క్ విస్తరణపై ఉంది. ఇటీవల 1 లక్ష కొత్త 4G/5G టవర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది.
Read Also:రూ. 329కే 1000 జీబీ డేటా, BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ఇంత బాగున్నాయా?