BigTV English

Reliance Jio 5G: వచ్చేస్తోంది జియో 5G స్మార్ట్‌ లేన్.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

Reliance Jio 5G: వచ్చేస్తోంది జియో 5G స్మార్ట్‌ లేన్.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

Reliance Jio 5G SmartLane:

దేశంలో  అతిపెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో వినియోగదారులకు ఎలాంటి అవాంతరాలు లేని సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే  5G స్మార్ట్‌ లేన్‌ ను పరిచయం చేయబోతోంది. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతకీ స్మార్ట్ లేన్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


జియో 5G స్మార్ట్ లేన్ అంటే ఏంటి?

జియో 5G స్మార్ట్ లేన్ అనేది జియో ట్రూ 5G నెట్‌ వర్క్‌ లో ఉపయోగించే ఒక ఫీచర్. ఇది ప్రతి అప్లికేషన్ కోసం ప్రత్యేకమైన, హై-స్పీడ్ లేన్‌ ను క్రియేట్ చేస్తుంది. అంటే, ఏ యాప్ కు ఎంత నెట్ అవసరమో డిసైడ్ చేస్తుంది. అంత మొత్తంలో ఆటోమేటిక్ గా కేటాయింపులు జరపుతుంది. ఫలితంగా వినియోగదారులు గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, కాలింగ్ సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాయపడుతుంది.

⦿ నెట్‌ వర్క్ స్లైసింగ్ ఆధారిత సర్వీసు: నెట్‌వర్క్ స్లైసింగ్ అనేది ఒక అధునాతన నెట్‌ వర్క్ టెక్నాలజీ. ఇది ఒక  ఫిజికల్ నెట్‌ వర్క్‌ ను వేర్వేరు నెట్‌ వర్క్ స్లైస్‌ లుగా విభజించి, ప్రతి స్లైస్‌ను నిర్దిష్ట వినియోగదారులకు, అప్లికేషన్లకు కేటాయిస్తుంది.


⦿ ఆప్టిమైజ్ ఎక్స్ పీరియెన్స్: జియో 5G స్మార్ట్ లేన్, నెట్‌ వర్క్ స్లైసింగ్ ద్వారా  గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ మొదలైన అప్లికేషన్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేయబడిన నెట్‌ వర్క్ లేన్‌ ను పొందుతాయి.

⦿ అధునాతన నెట్‌ వర్క్: ఇది 4G-ఆధారిత నెట్‌ వర్క్‌ లతో పోలిస్తే తక్కువ జాప్యం, మెరుగైన పనితీరును అందిస్తుంది. ఎందుకంటే ఇది స్వతంత్ర 5G కోర్‌ మీద వర్క్ చేస్తుంది.

జియో 5G స్మార్ట్ లేన్ యొక్క ప్రయోజనాలు

⦿ అప్లికేషన్లకు మెరుగైన పనితీరు: గేమింగ్ సహా ఇతర మిషన్ క్రిటికల్ సేవలకు హైస్పీడ్, తక్కువ జాప్యంతో కూడిన అనుభవాన్ని అందిస్తుంది.  ప్రతి స్లైస్ ఇతర నెట్‌ వర్క్ ట్రాఫిక్ నుంచి విడిగా పనిచేయడం వల్ల నెట్‌ వర్క్ రద్దీ తగ్గుతుంది.  ఫలితంగా వినియోగదారులకు మరింత క్వాలిటీ సర్వీసులు అందుతాయి. వినియోగదారులు తమకు నచ్చిన అప్లికేషన్లను ఎటువంటి ఆటంకం లేకుండా, హైస్పీడ్ నెట్ వర్క్ తో ఉపయోగించుకోవచ్చు.

Read Also: ఫేస్‌బుక్, యూట్యూబ్ బ్యాన్.. ఆ దేశం కీలక నిర్ణయం!

జియో 5G స్మార్ట్ లేన్ గురించి  ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

ఇటీవల జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ప్లాట్‌ ఫామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ జియో 5G స్మార్ట్ లేన్ గురించి కీలక ప్రకటన చేశారు. 2025-26 సంవత్సరానికి కంపెనీ నుండి వస్తున్న కొత్త ఆవిష్కరణలు మరింత ఆశాజనకంగా ఉండబోతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న జియో వినియోగదారులకు జియో 5G స్మార్ట్ లేన్ ఎంతో అద్భుతమైన సేవలు అందించబోతుందన్నారు.

Read Also:  రూ. 329కే 1000 జీబీ డేటా, BSNL బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్లు ఇంత బాగున్నాయా?

Related News

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

రిటైర్ అయ్యాక ప్రతి నెలా 1 లక్ష రూపాయల పెన్షన్ కావాలా..అయితే ఇలా ఇన్వెస్ట్ చేయండి..?

BSNL Offer: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Today Gold Price: తగ్గినట్టే తగ్గి మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు..

Flipkart Offer: ఎంత షాపింగ్ చేసినా సేవింగ్స్ గ్యారెంటీ.. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్

Jio Special Offers: ఫ్రీ డేటా.. OTT యాక్సెస్.. జియో బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా!

Big Stories

×