BigTV English

మీరు ధనవంతులు అవకుండా అడ్డుపడుతున్న 5 లక్షణాలు ఇవే..వీటిని వెంటనే వదిలించుకోండి..

మీరు ధనవంతులు అవకుండా అడ్డుపడుతున్న 5 లక్షణాలు ఇవే..వీటిని వెంటనే వదిలించుకోండి..

డబ్బు సంపాదించడం అనేది ఒక కళ అని చాలామంది చెబుతూ ఉంటారు. నిజానికి ప్రపంచంలోని టాప్ బిలియనీర్లు అందరూ కూడా వ్యాపార రంగానికి చెందిన వారే కావడం విశేషం. ఒకప్పుడు పలు దేశాలకు చెందిన రాజవంశీకులు ఈ టాప్ బిలియన్ లిస్టులో ఉండేవారు. కానీ రాను రాను కాలం మారే కొద్ది వ్యాపార ప్రపంచం విస్తరించే కొద్దీ, మల్టీ నేషనల్ కంపెనీల యజమానులే టాప్ బిలియన్లుగా మారిపోతున్నారు. దీన్నిబట్టి వ్యాపార రంగం ద్వారా ఎంత అభివృద్ధి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి సంపన్నుడు అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అనేది ఇలాంటి టాప్ బిలియనీర్లను చూసి నేర్చుకోవచ్చు.


నిజానికి సంపన్నుడు అవ్వాలంటే చూసి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి మన జీవితంలో తారసపడే పలువురు విజయవంతమైనటువంటి వ్యక్తుల జీవితాల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. కానీ కొన్ని అలవాట్లను మానుకున్నప్పుడు మాత్రమే సంపన్నుడిగా మారగలం అనే సంగతి గుర్తుంచుకోవాలి. అలా సంపన్నులు అవడానికి మానుకోవాల్సినటువంటి ఐదు అలవాట్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

చిన్న చిన్న ఖర్చులపై ఎక్కువగా దృష్టి పెట్టవద్దు:
మీరు ఒక లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో దారిలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులను చూసి అక్కడే ఆగిపోయినట్లయితే, మీ లక్ష్యాన్ని చేరుకునే మార్గం ఆలస్యం అవుతుంది. ముఖ్యంగా చిన్న చిన్న ఖర్చుల పైన ఎక్కువగా దృష్టి పెట్టవద్దని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. వీటి గురించి ఆలోచిస్తూ కూర్చున్నట్లయితే మీరు నిర్ణయించుకున్న అసలైన లక్ష్యం వైపు అడుగులు వేయలేరని నిపుణులు చెబుతుంటారు.


అవసరానికి మించిన పెద్ద ఇల్లు కొనడం తప్పు:
మీ అవసరం ఎంత ఉందో అంత అవసరానికి మాత్రమే తగిన ఇంటిని నిర్మించుకోవడం లేదా కొనుగోలు చేయడం మంచిదే అని నిపుణులు సూచిస్తున్నారు. మీకు ఎంత శక్తి ఉందో అంత మేరకు మాత్రమే ఇంటి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. . మీ లోన్ ఈఎంఐ వాయిదాలు వంటివి మీ వేతనంలో 25 శాతం మించి ఉండకుండా జాగ్రత్త పడాలి. . అప్పుడే మీరు మీ వేతనంలో కాస్త పొదుపు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.

కొత్త కారును కొనడం మానుకోండి
ఎప్పటికప్పుడు మీ పాత ఈఎంఐ పూర్తయిన వెంటనే కొత్త కారును కొనే ప్లాన్స్ వేసినట్లయితే, మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు మదుపు చేసినట్లయితే భవిష్యత్తులో మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

మీకు సంతృప్తిని ఇవ్వని అంశాల పైన డబ్బు ఖర్చు చేయడం మానుకోండి
మీకు ఒక విషయం సంతృప్తిని ఇవ్వడం లేదు అని భావించినట్లయితే దానిపైన పెట్టుబడి పెట్టడం అనేది మానుకుంటే మంచిది. ఉదాహరణకు మీరు ఒక సంపన్నుల క్లబ్ లో చేరి అక్కడ ఎంజాయ్ చేయలేక పోయినట్లయితే అందులో డబ్బు కట్టి కూడా వృధా అవుతుంది.

అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది
మీరు డబ్బు సంపాదన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో ఆ డబ్బులు ఖర్చు చేసే సమయంలో కూడా అంతే శ్రద్ధ కలిగి ఉండాలి. మీరు సంపాదించిన రూపాయి ఎటువైపు వెళుతుందో ఎందుకు వెళ్తుందో దానివల్ల మీకు కలిగే సౌకర్యం ఏంటో లాభం ఏంటో తెలుసుకోకుండా ఖర్చు చేసినట్లయితే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

Related News

Reko Diq Gold Mine: రెకోడిక్ బంగారు గని.. ఇక్కడ 5లక్షల కోట్ల విలువైన బంగారం.. ఇది బిగ్గెస్ట్ జాక్‌పాట్..!

Top 6 Clothing Brands: జుడియో తరహాలోనే వీటిలో కూడా దుస్తులు చాలా చీప్, వెంటనే ట్రై చెయ్యండి!

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

Zudio షోరూమ్‌కు ఎందుకంత క్రేజ్? ధరలు ఎందుకంత తక్కువ?

Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే

Big Stories

×