E-Paper
Advertisement

Jitendra Primo: సూపరో సూపర్.. 137 కి.మీ మైలేజీ‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. కేవలం రూ.79,999లకే.. ఓ రేంజ్‌లో ఫీచర్లు!

Jitendra Primo: సూపరో సూపర్.. 137 కి.మీ మైలేజీ‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. కేవలం రూ.79,999లకే.. ఓ రేంజ్‌లో ఫీచర్లు!
Advertisement

Jitendra EV Primo S And Primo Plus E-Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు అధికంగా పెరగడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై వినియోగదారులు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త కంపెనీలు మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు లుక్, డిజైన్, ఫీచర్లు, ధరలతో అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో కొత్త కంపెనీలు మార్కెట్‌లోకి రాగా.. తాజాగా మరొక కంపెనీ దర్శనమిచ్చింది.

నాసిక్‌కి చెందిన ప్రముఖ ఈవీల తయారీ కంపెనీ జితేంద్ర ఎలక్ట్రిక్ ప్రిమో సిరీస్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రిలీజ్ చేసింది. దీనిని రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రిమో ఎస్, ప్రిమో ప్లస్ (Primo S And Primo Plus) అనే రెండు వేరియంట్లను లాంచ్ చేసింది. ఇక ఈ స్కూటర్లకు సంబంధించి ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో రిమూవబుల్ మోడ్‌లో బ్యాటరీలు రానున్నాయి.

Advertisement

IP67 ప్రోటెక్షన్‌తో స్మార్ట్ బిఎమ్ఎస్‌తో వస్తుంది. అంతేకాకుండా.. రేంజ్ ప్రిడిక్షన్ ఫీచర్, సైడ్ స్టాండ్ సెన్సార్, థర్మల్ ప్రమోషన్ అలర్ట్, రివర్స్ అసిస్టెన్స్, డిజిటల్ క్లస్టర్, USB మొబైల్ ఛార్జింగ్ LED ల్యాంప్స్, స్మార్ట్ ఇన్స్ట్రుమెంటెడ్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. ఇక ఈ స్కూటర్ బ్యాటరీ, మైలేజీ విషయానికొస్తే.. ఇది 2.04 kWh, 3.26 బ్యాటరీ ఆప్షన్స్‌తో రానుంది. ఇవి వరుసగా 82 కి.మీ నుంచి 137 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Also Read: మహిళలు, వృద్ధులకు ఈ స్కూటీ సూపర్.. ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. మిస్స్ అవ్వొద్దు..!

Advertisement

ప్రిమో ఎస్, ప్రిమో ప్లస్ ఈ రెండు స్కూటర్లు గంటకు 52 కి.మీ వేగంతో పరుగులు పెడతాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యాధునిక డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో పాటు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఇవి ఎందులోనూ తీసిపోవక్కర్లేదని ఆ సంస్థ చెబుతోంది. ఎందుకంటే ఈ స్కూటర్లను అద్భుతమైన లుక్, కళ్లు చెదిరే డిజైన్‌తో చాలా అందంగా తయారుచేశారు.

ఇందులో అధునాతన సేఫ్టీ ఫీచర్లు, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. అయితే ఈ స్కూటర్లను దేశవ్యాప్తంగా మార్కెట్లలో విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. అయితే స్కూటర్ల ధర విషయానికొస్తే.. వీటి ధర కూడా చాలా తక్కువగానే ఉంది. కేవలం రూ.79,999లకే ప్రారంభ ధరతో మొదలవుతుంది. ఇతర కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర కంటే.. ప్రిమో సిరీస్ స్కూటర్ల ధర చాలా చాలా తక్కువని చెప్పొచ్చు. అంతేకాకుండా మార్కెట్ డిమాండ్, మార్కెటింగ్‌ని బట్టి ధర తగ్గే అవకాశముందని కూడా కంపెనీ చెబుతోంది. ఇక కస్టమర్ల నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి త్వరలో మార్కెట్‌లోకి మరిన్ని స్కూటర్లను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ పేర్కోంది.

Tags

Related News

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

ఆధార్, ఫోన్ నంబర్‌తో.. మీ UAN నంబర్‌ను క్షణాల్లో కనుక్కోండిలా

ఆషాడ వేళ పసిడి షాక్.. ఆశలకి బ్రేక్ వేస్తూ మళ్ళీ పైపైకి బంగారం ధరలు!

ఎల్పీజీ గ్యాస్‌కు చెక్.. ఇకపై ఇథనాల్‌తో కుకింగ్, కేంద్రం సన్నాహాలు మొదలు

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

Big Stories

Advertisement
×