BigTV English

CM Revanth Reddy: ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి ఫలాలు.. రేవంత్ సర్కార్ చేపట్టిన పనులు, చేసుకున్న ఒప్పందాలివే!

CM Revanth Reddy: ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి ఫలాలు.. రేవంత్ సర్కార్ చేపట్టిన పనులు, చేసుకున్న ఒప్పందాలివే!

హైదరాబాద్ ఐటీకి స్ట్రాంగ్ బేస్ గా ఉంది. ఇది మొదటి నుంచి ఉన్నదే. అయితే అంతకంతకూ స్టామినా పెరుగుతోంది. అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీల ఆఫీసులన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఐటీ బూస్టప్ రోజురోజుకూ పెరుగుతుంది తప్ప ఇక్కడ తగ్గేది ఉండదు. కాకపోతే ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేసింది. ఐటీ ఎక్స్ పోర్ట్స్ విషయమైనా, స్టార్టప్ లకు ప్రోత్సాహమైనా, దూరదృష్టిలో ఏఐ సమ్మిట్ నిర్వహించినా.. పెట్టుబడుల కోసం సీఎం, ఐటీ మంత్రి విదేశీ పర్యటనలు చేసినా అవన్నీ అడిషనల్ గ్రోత్ ఇంజిన్లుగా పని చేశాయి.


ఐటీ డెవలప్‌మెంట్ దిశగా అడుగులు

హైదరాబాద్ కు, తెలంగాణకు మేజర్ షేర్ ఆదాయంలో ఐటీ నుంచే ఉన్నాయి. సో ఇది మనీ పవర్ సోర్స్ గా పని చేస్తోంది. అలాంటి ఐటీని మరో లెవెల్ కు తీసుకెళ్లడంతో రేవంత్ ప్రభుత్వం తొలి ఏడాది గట్టి పునాదులను ఏర్పాటు చేసింది. పగ్గాలు చేపట్టాక సీఎం రేవంత్ అమెరికా, సౌత్ కొరియా, దావోస్ పర్యటనలతో మరింత బూస్టప్ వచ్చింది. పెట్టుబడుల్లో జోష్ పెరిగింది. తొలి ఏడాదిలో ఐటీ మేటి అయ్యేలా పని చేసింది.


అదే మన ప్లస్ పాయింట్

మన దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 15 శాతం ఉంది. 2030 నాటికి ఇది మరింత పెరగడం ఖాయమే. హెల్త్ ​కేర్, రిటైల్ అండ్ ఈ–కామర్స్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, లాజిస్టిక్స్ అండ్ ​సప్లయ్ చైన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, మ్యానుఫాక్చరింగ్ వంటివి రాష్ట్రంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాప్ట్, అమెజాన్​, యాపిల్ వంటి పెద్ద కంపెనీలు సైతం తెలంగాణలో తమ సెంటర్లను రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. కొత్త సెంటర్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి మ్యాన్ పవర్, ఎకో సిస్టమ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీస్ కంపెనీలకు చాలా కలిసి వస్తోంది.

గూగుల్ వస్తే.. మెండుగా ఉపాధి అవకాశాలు

దేశంలోనే మొట్టమొదటి గూగుల్‌ సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ఆ సంస్థ ముందుకు రావడం ఏడాది విజయోత్సవాల సందర్భంగా హైలెట్. బిగ్ బూస్టప్ కూడా. గూగుల్‌తో డిసెంబర్ 4న తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. గూగుల్‌ ప్రధాన సమాచార అధికారి రాయల్‌ హన్సెన్‌ ఆధ్వర్యంలోని టీం సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబుతో సీఎం నివాసంలో భేటీ అయి.. సేఫ్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అమెరికా బయట అతిపెద్ద కార్యాలయాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి గూగుల్‌ ముందుకు రావడం మరో బోనసే అని చెప్పాలి. ప్రపంచంలోనే హైదరాబాద్‌ ఐటీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా అందరి దృష్టినీ ఆకర్షిస్తోందనడానికి ఈ డీల్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌ ఏర్పాటు ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ఇక డిజిటల్‌ స్కిల్స్ డెవలప్ మెంట్ లో తెలంగాణ ముందంజలో ఉందని గూగుల్‌ ప్రతినిధులు ప్రశంసించారంటే ఇక్కడి ఎకో సిస్టమ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఫార్మాకు భారీగా పెట్టుబడులు

రాష్ట్రం నుంచి ప్రతిఏటా 27 వేల నుంచి 31 వేల మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్,​ మ్యాథమేటిక్స్ గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు. లివింగ్ ​కాస్ట్ లో తెలంగాణ టాప్ 3లో ఉంది. దేశవ్యాప్తంగా ఫార్మా ఎగుమతులు 27.85 బిలియన్​ డాలర్లు ఉంటే, అందులో ఒక్క తెలంగాణ వాటానే 4.4 బిలియన్ డాలర్లు. ఏరో, డిఫెన్స్ లోనూ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ రంగంలో 25 పెద్ద కంపెనీలతో పాటు వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న వాతావరణం, సదుపాయాలు, లో కాస్ట్ ​లివింగ్​, ఐటీ, ఇండస్ర్టీలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ఎకో ఫ్రెండ్లీ విధానాలు తొలి ఏడాది ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి.

వరల్డ్ క్లాస్ ఐడియాలతో మున్ముందుకు..

2037 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ కు చేరుకుంటుందని ప్రభుత్వం కాన్ఫిడెంట్ గా ఉందంటే తొలి ఏడాది నుంచే రేవంత్ రెడ్డి సర్కార్ ఐటీ, ఇండస్ట్రీస్ పై ప్లానింగ్ ఎలా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. దేశ జీడీపీతో పాటు అనేక రంగాల్లో తెలంగాణ టాప్​ ర్యాంక్ లో ఉంది. వీటికి బూస్టప్ ఇచ్చేలా ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ ​రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్, అర్బన్, సెమీ అర్బన్ ​ఇండస్ట్రియల్ క్లస్టర్లు, మెట్రో రైలు కనెక్టివిటీ, యంగ్ ఇండియా స్కిల్​ యూనివర్సిటీ వంటివన్నీ తెలంగాణ గ్రోత్ ​ను మరింతగా పెంచబోతున్నాయి. ఇవి పూర్తయితే మాత్రం తెలంగాణ, హైదరాబాద్ ఇక వెనుదిరిగి చూసుకోని విధంగా దూరదృష్టితో గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్నీ టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ ఐడియాలతో హైదరాబాద్ ఐటీని మరో లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం తొలి ఏడాదిలో జరిగింది.

జీడీపీ గ్రోత్‌కూ పునాదులు.. 

రానున్న కొన్నేండ్లలో దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ కీరోల్ పోషించబోతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం 2.39 లక్షల కోట్లు ఉండగా, 2036 నాటికి అది 12.34 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలున్నాయి. దేశ జీడీపీలో ప్రస్తుతం తెలంగాణ వాటా 5 శాతం ఉండగా, 2037 నాటికి అది 10 శాతానికి పెరుగుతుందన్న ఎక్స్ పెక్టేషన్స్ కు రేవంత్ ప్రభుత్వం తొలి ఏడాది గట్టి పునాదులే వేసింది. తెలంగాణ గ్రోత్​ స్టోరీ.. ది రోడ్ టు వన్ ​ట్రిలియన్ పేరుతో ఇప్పటికే రిపోర్ట్ రిలీజ్ చేసింది. అంటే ఎంత ముందు చూపు ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనం తొలి ఏడాది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐడీ, ఇండస్ట్రీస్ రంగంలో సాధించిన విజయాలే.

ఐటీ, ఇండస్ట్రీస్ ముఖ్యమే. వాటితో పాటే ఇరిగేషన్, సహా ఇతర ప్రాధాన్య రంగాలు కూడా ఇంపార్టెంటే. అందుకే అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ తొలి ఏడాదిలో చేపట్టాల్సిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వర్తించింది రేవంత్ ప్రభుత్వం. త్వరగా పూర్తయ్యే వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. పట్టాలెక్కించారు. కథ చాలా వరకు మార్చడంలో సక్సెస్ అయ్యారు.

కొత్త ఎయిర్ పోర్టుల కోసం ముందడుగు

విదేశీ పెట్టుబడుల టార్గెట్ లో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ దావోస్ పర్యటన, ఆగస్టులో అమెరికా, కొరియా పర్యటన సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్ పర్యటనలో 40,232 కోట్లు, అమెరికా పర్యటనతో 31 వేల 502 కోట్లు, సౌత్ కొరియా పర్యటనతో 4500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఓవరాల్ గా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం 76,232 కోట్ల మేర పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుకోవటం సరికొత్త రికార్డు. మొత్తం 25 కంపెనీలతో ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెజ్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్, ఆమ్జెన్ జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఫోకస్

ఐటీ, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడమే కాదు.. ఇందులో ఏ టెక్నాలజీకి భవిష్యత్ ఉందో ఊహించగలగాలి. అయితే సీఎం రేవంత్ తొలి ఏడాదిలోనే దీన్ని క్యాచ్ చేశారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే కావడంతో హైదరాబాద్ ను ఈ రంగంలో టాప్ లో నిలపాలని సీఎం అనుకున్నారు. అనుకోవడమే తరువాయి.. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ రెండు రోజుల నిర్వహించారు. ఇందులోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ రిలీజ్ చేశారు. ప్రపంచం నలు మూలల నుంచి 2 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. సో ఏఐ విషయంలో ఇదో బిగ్ మైల్ స్టోన్.

కాగ్నిజెంట్ రాకతో 30 వేల మందికి ఉపాది

హైదరాబాద్ కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండవ క్యాంపస్ నిర్మాణానికి కాగ్నిజెంట్ ముందుకు వచ్చింది. ఈ క్యాంపస్ ఏర్పాటు ద్వారా దాదాపు 30 వేల మంది యువతకు ఐటీ ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తుంది. మరోవైపు సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలు MSMEలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో MSME పాలసీ 2024ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాబోయే ఐదేళ్లలో MSMEల అభివృద్ధి కోసం 4 వేలకోట్లు ఖర్చు చేయనుంది. రాబోయే ఐదేళ్లలో 25 వేల కంటే ఎక్కువ కొత్త MSMEలను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీలో మహిళా స్వయం సహాయక బృందాలు MSMEలుగా మారేందుకు అన్ని దశల్లో సహాయం అందించనున్నారు.

మెగా మాస్టర్ పాలసీ 2025 లక్ష్యంతో ముందుకు… 

ఇక కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళా పారిశ్రామికవేత్తలకు, 15% SC-ST పారిశ్రామికవేత్తలకు కేటాయించేలా డిజైన్ చేశారు. ప్రభుత్వం SC-ST వ్యవస్థాపకులకు 50 లక్షల రూపాయలతో 50% భూమి ధర రాయితీని అందిస్తుంది. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ది జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ 2050 చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ ఒక్క చోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఇది కీలకమైన నిర్ణయం. మెగా మాస్టర్ ప్లాన్ 2050 లో భాగంగా అవుటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ క్లస్టర్, రీజనల్ రింగ్ రోడ్డు వరకు మధ్యలో ఉన్న ఏరియాను సెమీ అర్బన్ క్లస్టర్ గా, ఆర్ఆర్ఆర్ బయట రూరల్ క్లస్టర్ గా గుర్తించారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా, హెల్త్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, ఆర్గానిక్ క్లస్టర్లుగా అక్కడ పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ – 2050 రూపొందించారు.

Also Read: సీఎం రేవంత్ మనసులోని మాట.. తెలంగాణలో ప్రభుత్వానికి ఏడాది

డోన్ పైలెట్లకు ప్రత్యేక శిక్షణ

యువతకు డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ పైలెటింగ్ ద్వారా ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. డ్రోన్ పైలెటింగ్, డ్రోన్ డేటా మేనేజ్ మెంట్, డేటా అనాలసిస్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అటు తెలంగాణ నుంచి మచిలీపట్నానికి హైస్పీడ్​ ఎక్స్ ​ప్రెస్ ​వే నిర్మాణ ప్రతిపాదన, నల్గొండ జిల్లాలో డ్రైపోర్ట్ సిటీ ఏర్పాటు, నిజామాబాద్, మహబూబ్​ నగర్, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త ఎయిర్​ పోర్టుల ఏర్పాటు, వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ లో ఇప్పటికే ఉన్న ఎయిర్ స్ట్రిప్ ల పునరుద్ధరణ జరిగితే తెలంగాణ అభివృద్ధి మరో లెవెల్ కు వెళ్లడం ఖాయమే.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×