Mustard Oil: పొడవైన, మందపాటి జుట్టును ఎవరు ఇష్టపడరు చెప్పండి. కానీ నేడు ఆరోగ్య సమస్యలు, పోషహాకార లోపం, చెడు ఆహారపు అలవాట్లు, మురికి ఉప్పునీరు, ఒత్తిడి జుట్టు రాలేందుకు కారణం అవుతున్నాయి. దాదాపు ప్రతి ఒక్కరూ జుట్టు రాలడం, పొడిబారడం, పెరుగుదల తగ్గడంతో పాటు చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణంగా, మార్కెట్‌లో లభించే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లు వీటన్నింటిని తగ్గించలేవు.
మీ జుట్టుకు సంబంధించిన దాదాపు ప్రతి సమస్యకు పరిష్కారం మీ వంటగదిలో ఉంచిన ఆవనూనెలో ఉందని మీకు తెలుసా? అవును, స్వచ్ఛమైన ఆవాల నూనె మీ జుట్టుకు ఒక వరం. ఆవాల నూనెలో వంటగదిలోని మరి కొన్ని పదార్థాలను కలిపి జుట్టుకు పట్టిస్తే.. జుట్టు సంబంధిత సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అంతే కాకుండా జుట్టు రాలకుండా ఉంటుంది.
ఆవాల నూనెలో కరివేపాకు :
ఆహారానికి ఆహ్లాదకరమైన వాసన, రుచిని జోడించే కరివేపాకు, మీ జుట్టు పెరుగుదలకు కూడా అద్భుతాలు చేస్తాయి. దీన్ని ఉపయోగించడానికి ఉత్తమ మార్గం ఆవాల నూనెతో కరివేపాకు వేసి ఈ ఆయిల్ ను మీ జుట్టుకు పట్టించడం. దీని కోసం, ఒక కప్పు ఆవాల నూనె తీసుకుని ఒక గిన్నెలో మరిగించండి. కాస్త ఆయిల్ మరిగిన తర్వాత అందులో కరివేపాకు వేసి కలపండి. ఆకులు కొద్దిగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ నూనెను ఫిల్టర్ చేసి మీ జుట్టుకు పట్టించండి. 30 నిమిషాల తర్వాత ఆయిల్ తలస్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మీ జుట్టును పొడవుగా, ఒత్తుగా మారుతుంది. జుట్టు సంబంధిత సమస్యలు తగ్గడానికి ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఆవాల నూనె, మెంతి గింజలు:
జుట్టుకు మెంతి గింజల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. జుట్టుకు సంబంధించిన దాదాపు అన్ని సమస్యలను దూరం చేయడంలో మెంతి గింజలు మీకు సహాయపడతాయి. మీరు ఒక గిన్నెలో కాస్త ఆవాల నూనెను తీసుకుని అందులో 2 టీ స్సైన్ల మెంతి గింజలు వేసి మరిగించండి. 10 నిమిషాల పాటు మరిగించి గ్యాస్ ఆఫ్ చేయండి. ఈ నూనె చల్లారిన తర్వాత దానిని ఫిల్టర్ చేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వా తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
ఉసిరి జుట్టుకు ఒక వరం:
జుట్టు రాలే సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే లేదా.. సమయానికి ముందే జుట్టు తెల్లబడితే.. మీకు ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం, ఒక గిన్నెలో 100 గ్రాముల ఆవల నూనె తీసుకుని అందులో 4-5 ఉసిరి కాయలు లేదా ఉసిరికాయ ముక్కలను వేసి కలపండి. తర్వాత 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద వేడి చేయాలి. కొద్దిగా ఉడికిన తర్వాత దించి, చల్లారిన తర్వాత ఆయిల్ తో జుట్టుకు బాగా మసాజ్ చేయాలి. ఆవాల నూనె , ఉసిరి మిశ్రమం కొన్ని రోజుల్లో మీ జుట్టు బాగా మెరుగుపరుస్తుంది.
Also Read: టీ పౌడర్ ఇలా వాడారంటే.. తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది
ఆవనూనెలో పెరుగు కలపాలి:
శీతాకాలంలో, జుట్టు పూర్తిగా పొడిగా మారుతుంది. దీని కారణంగా జుట్టు రాలడం కూడా వేగంగా పెరుగుతుంది. ఈ సమయంలో దురద, చుండ్రు వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మీ జుట్టును వాస్ చేయడానికి 40 నిమిషాల ముందు ఆవాల నూనె , పెరుగుతో మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును ఆరోగ్యంగా, సిల్కీ స్మూత్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.