BigTV English

8th Pay Commission: ఉద్యోగులకు మరో దెబ్బ..సాలరీ పెంపుపై సంచలన నిర్ణయం..

8th Pay Commission: ఉద్యోగులకు మరో దెబ్బ..సాలరీ పెంపుపై సంచలన నిర్ణయం..

8th Pay Commission: 8వ వేతన సంఘం జీతాల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు షాకింగ్ న్యూస్ వచ్చింది. 2026 జనవరి నుంచి కొత్త వేతనాలు వస్తాయని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే జీతం, పెన్షన్ పెంపుదల మరింత ఆలస్యం అవుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కొత్త జీతం, పెన్షన్ 2027 ప్రారంభం నుంచి అమలు అవుతుందని అంటున్నారు. కానీ ఇక్కడ ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే, కొత్త జీతం అమలు చేసినప్పుడు 12 నెలల బకాయిలు కూడా ఇస్తారని తెలుస్తోంది.


తుది సిఫార్సుల ప్రక్రియ
కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన ఆయా వర్గాల సమాచారం ప్రకారం, కొత్త కమిటీ 15 నుంచి 18 నెలల్లోపు వారి సిఫార్సులను సిద్ధం చేసే అవకాశం ఉంది. తుది సిఫార్సులు ఇచ్చే ముందు కమిటీ మధ్యంతర నివేదికను కూడా సమర్పించవచ్చు. ఈ క్రమంలో పూర్తి నివేదిక 2026 చివరి నాటికి మాత్రమే వస్తుందని చెబుతున్నారు. వేతన కమిషన్ల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని, తుది నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం సమీక్ష జరిపి అమలు కోసం మరింత సమయం తీసుకోనుంది. ఇలాంటి క్రమంలో ఇప్పట్లో జీతాల పెంపు అమలు కష్టమేనని, 2027 ప్రారంభంలో మాత్రమే అవకాశం ఉందని అంటున్నారు.

8వ వేతన సంఘం ప్రక్రియ ఎలా ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం 2025 జనవరి 16న అధికారికంగా 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. ఈ కమిషన్ పనితీరు, దాని విధివిధానాలను నిర్ణయించేందుకు ప్రభుత్వం త్వరలో Terms of Reference (ToR) ప్రకటించనుంది. నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి సంబంధించిన ToR ని వచ్చే నెలలో ఆమోదించే అవకాశం ఉంది. ఇది పూర్తయిన తర్వాత, కమిషన్ 2025 ఏప్రిల్ నుంచి తన పనిని ప్రారంభించనుంది.


Read Also: Ugadi Offer: రూ.16500కే ప్రీమియం ఫీచర్లతో డెల్ ల్యాప్‌టాప్. …

ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య చర్చలు
వేతన సంఘం ప్రతిపాదనలపై ఉద్యోగుల సంఘాలు (JCM – Joint Council of Administrative Staff), ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతాయి. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం, వాటిపై చర్చించుకోవడం ఈ ప్రక్రియలో భాగంగా ఉంటుంది.

జీతం, పెన్షన్ పెంపుపై తుది నిర్ణయం
మునుపటి వేతన సంఘాల అనుభవాలను పరిశీలిస్తే, తుది నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానిని అమలు చేయడానికి మరింత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా, 8వ వేతన సంఘం అమలు 2027 నాటికి మాత్రమే పూర్తవుతుందని అంచనా.

ఉద్యోగుల డిమాండ్లు ఏమిటి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వేతన పెంపు, అదనపు భత్యాలు, డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపును కోరుతున్నారు. వీటితో పాటు, పదవీ విరమణ వయస్సు పెంపు, ప్రోత్సాహకాలు మరియు ఇతర సంక్షేమ పథకాలను కూడా వారు ఆశిస్తున్నారు.

ప్రభుత్వం TORని ఎప్పుడు ఆమోదిస్తుంది?
సమాచారం ప్రకారం కేంద్ర మంత్రివర్గం వచ్చే నెలలో 8వ వేతన సంఘం నిబంధనలను (ToR) ఆమోదించవచ్చు. కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం తుది ప్రక్రియలో ఉంది. మంత్రివర్గం ఆమోదం పొందిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తరువాత, కమిషన్ ఏప్రిల్ 2025 నుంచి తన పనిని ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ 15 నుంచి 18 నెలలు అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం కూడా ఇంకా జరగలేదు. ఈ క్రమంలో సిఫార్సులు, అమలు ప్రక్రియ అన్నీ కలిపితే మరింత ఆలస్యం అవుతుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×