Warren Buffet Heir Howard Buffet | ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, పరోపకారి వారెన్ బఫెట్ ఎట్టకేలకు తన సంస్థ బెర్క్‌షైర్ హాత్వేకి వారసుడిని ప్రకటించారు. తన కుమారుడు హోవర్డ్ బఫెట్.. సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. ప్రస్తుతం బెర్క్‌షైర్ బిజినెస్ సామ్రాజ్యం విలువ అక్షరాలా ఒక ట్రిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ.86 లక్షల కోట్లు).
94 ఏళ్ల వారెన్ బఫెట్ ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సంపదలో మెజారిటీ భాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛారిటబుల్ ట్రస్ట్‌కి కేటాయించనున్నట్లు తెలిపారు. తన ముగ్గురు పిల్లలకు తక్కువగా సంపద అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే, 140 బిలియన్ డాలర్ల ట్రస్ట్ ద్వారా చేపట్టే దాతృత్వ కార్యక్రమాలను మాత్రం తన పిల్లలే పర్యవేక్షిస్తారని తెలిపారు. కుమారుడు హోవర్డ్‌ను వారసుడిగా ఎంపిక చేసిన విషయం గురించి మాట్లాడుతూ, ‘‘నా ముగ్గురు పిల్లలపైనా నాకు గట్టి నమ్మకం ఉంది. హోవర్డ్ నా కుమారుడే కాబట్టి ఈ బాధ్యత ఇచ్చాను’’ అని చెప్పుకొచ్చారు.
Also Read: అభిశంసనకు గురైన ప్రెసిడెంట్.. అయినా జీతం పెంచారు!
వారెన్ బఫెట్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయన స్వయంగా కంపెనీలు ప్రారంభించకపోయినా, మెరుగైన భవిష్యత్తు గల సంస్థలను గుర్తించి పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రఖ్యాతి గాంచారు. ఈ విధానంతో ఆయన మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న అనేక కంపెనీల్లో వాటాలు కలిగి ఉన్నారు. 90 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆస్తితో బఫెట్ సంపద ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి ఉంటుంది.
బఫెట్ వారసుడిగా హోవర్డ్ ఎంపిక
వారెన్ బఫెట్ వయసు 100 ఏళ్లకు చేరువ అవుతున్నప్పటికీ ఇప్పటికీ బెర్క్‌షైర్ హాత్వే సంస్థను ఆయనే నడిపిస్తున్నారు. కానీ రిటైర్మెంట్‌కు సమయం వచ్చినట్లు భావించి తన వారసుడిని ప్రకటించారు. అనేక పరీక్షల అనంతరం, తన ముగ్గురు పిల్లల్లో రెండో కుమారుడు హోవర్డ్ బఫెట్‌ను ఎంపిక చేశారు.
30 ఏళ్లకు పైగా బెర్క్‌షైర్ బోర్డులో హోవర్డ్ పనిచేశారు. తన బాధ్యతల గురించి స్పందిస్తూ, ‘‘నాన్న నాకు అవసరమైన పాఠాలు నేర్పించారు. అందువల్ల నేను ఈ స్థానానికి సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పారు.
హోవర్డ్ బఫెట్ ఎవరు?
70 ఏళ్ల హోవర్డ్ బఫెట్.. కాలేజీ చదువు పూర్తి చేసిన వెంటనే తండ్రి అడుగుజాడల్లో నడుచుకుంటూ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.
లాస్ ఏంజెలెస్‌లోని ఒక క్యాండీ తయారీ సంస్థలో పనిచేస్తూ బెర్క్‌షైర్ కోసం కీలక వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు.
హోవర్డ్ కోసం వారెన్ ఒక పొలం కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ భూమిలో వ్యవసాయం చేస్తూనే అద్దె చెల్లించడం అనేది ఆయనకు విధిగా పెట్టారు.
భూమి వినియోగం, సుస్థిర వ్యవసాయం మీద హోవర్డ్ ప్రత్యేక శ్రద్ధ చూపారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు 800 మిలియన్ డాలర్లు తన హోవర్డ్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం చేశారు.
బిజినెస్ లో హోవర్డ్ కీలక పాత్రలు
1989లో హోవర్డ్ కౌంటీ బోర్డు కమిషనర్‌గా చేరి, ఆపై ఛైర్మన్‌గా పనిచేశారు.
2017-18లో ఇల్లినాయ్ మాకాన్ కౌంటీ షెర్రిఫ్ (కలెక్టర్ ర్యాంక్)గా సేవలు అందించారు.
1993 నుంచి అనేక సంస్థల బోర్డుల్లో డైరెక్టర్‌గా పనిచేశారు. ఇందులో కోకాకోలా, లిండ్సే కార్పొరేషన్, ఇతర ప్రముఖ సంస్థలున్నాయి.
ఎనిమిది పుస్తకాలను రచించి పాఠకుల నుంచి ప్రశంసలు పొందారు.
హోవర్డ్ బఫెట్ తన తండ్రి సంప్రదాయాలను కొనసాగిస్తూ బెర్క్‌షైర్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.