Jio Lucky Draw: జియో ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు కొత్త కొత్త ఆఫర్లతో ఆకర్షిస్తుంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఆఫర్ లక్కీ డ్రాతో జియో మీ ముందుకు వచ్చింది. ఈ లక్కీ డ్రాలో గెలిస్తే నేరుగా 20జిబిల జియో డేటా ఫ్రీగా వస్తుంది. మనం సాధారణంగా రీచార్జ్ చేసుకుంటే రోజువారీ 1.5జీబీ లేదా 2జిబి మాత్రమే వాడగలుగుతాం. కానీ ఈ లక్కీ డ్రా ద్వారా లభించే 20జిబి డేటా అంటే ఒక బోనస్ ప్యాక్‌లా ఉపయోగించుకోవచ్చు. ఇది డేటా ఎక్కువగా అవసరమయ్యే విద్యార్థులు, వీడియోలు ఎక్కువగా చూసేవాళ్లు, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేవాళ్లకు చాలా ఉపయోగపడుతుంది.
ఆఫర కావాలాంటే ఏం చేయాలి
ఈ ఆఫర్‌లో పాల్గొనడం చాలా సింపుల్. మీరు మీ ఫోన్‌లో మైజియో యాప్ ఓపెన్ చేసి జియోఎంగేజ్ సెక్షన్‌లోకి వెళ్ళాలి. అక్కడ లక్కీ డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చిన్న టాస్కులు లేదా గేమ్ లాంటివి పూర్తి చేస్తే మీరు డ్రాలో ఎంటర్ అవుతారు. గెలిచిన వారికి డేటా వోచర్ రూపంలో వస్తుంది. అది వెంటనే మైజియో యాప్‌లోని మై విన్నింగ్ లేదా నా వోచర్లులో కనిపిస్తుంది. ఈ వోచర్‌ను రీడీమ్ చేసుకున్న తర్వాత మీ ప్రస్తుత ప్లాన్ ఎంత రోజులు ఉంటుందో అంత వరకూ ఆ అదనపు 20జిబి డేటాను వాడుకోవచ్చు. ఉదాహరణకు, మీ ప్లాన్‌కి ఇంకా 10 రోజులు వాలిడిటీ ఉంటే, ఈ 20జిబి కూడా ఆ 10 రోజులకే వర్తిస్తుంది.
Also Read: OTT Movie : గ్రామంలో ఏ మహిళనూ వదలని దొర… పనోడితో దొర పెళ్ళాం… ఈ అరాచకం మాములుగా ఉండదు భయ్యా
సమయం- తేదీ ఎప్పుడు?
ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లక్కీ డ్రా ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుందన్నది. దీనికి జియో స్పష్టమైన తేదీ చెప్పలేదు. అలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మైజియో యాప్‌లోని జియోఎంగేజ్ సెక్షన్‌లో చూపిస్తారు. సాధారణంగా జియో ఇలాంటి ఆఫర్లు ఒక వారం లేదా రెండు వారాలపాటు మాత్రమే ఇస్తుంది. అంటే మీరు వెంటనే పాల్గొనడం మంచిది. ఆలస్యం చేస్తే ఆఫర్ ముగిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆఫర్‌ను మిస్ కాకుండా వెంటనే యాప్ ఓపెన్ చేసి ప్రయత్నిస్తే 20జిబి మీకే కావొచ్చు.
అదృష్టవంతులు మీరే కావొచ్చు
మొత్తం మీద జియో లక్కీ డ్రా వినోదం కోసం మాత్రమే కాదు, నిజంగా అదనపు డేటా పొందే అవకాశం కూడా. ముఖ్యంగా 5జి వాడుతున్న వారికి ఇది బంగారు అవకాశం. ఎందుకంటే 5జి స్పీడ్ ఎక్కువగా ఉండటంతో డేటా కూడా వేగంగా ఖర్చవుతుంది. అలాంటప్పుడు 20జిబి బోనస్ డేటా నిజంగానే పెద్ద బహుమతి. కాబట్టి ఈ లక్కీ డ్రాలో మీరు కూడా పాల్గొని అదృష్టాన్ని పరీక్షించండి. ఎవరికీ తెలియదు, ఆ 20జిబి ఫ్రీ డేటా మీకే దక్కొచ్చు.